Asia Cup 2022 Ind Vs Pak- Arshdeep Singh: ఆసియాకప్-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. ముఖ్యంగా పాక్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన రవి బిష్ణోయ్ వేసిన బౌలింగ్‌లో.. అసిఫ్ అలీ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
కానీ బంతి ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఈ క్రమంలో షార్ట్ థర్డ్‌మెన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఆర్ష్‌దీప్ సింగ్.. ఈజీ క్యాచ్‌ను జారవిడిచాడు. ఇందుకు భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆసిఫ్ అలీ 16 పరుగులు సాధించి మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు.
ఈ క్రమంలో ఆర్ష్‌దీప్ సింగ్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భారత్ ఓటమికి బాధ్యుడు అతడే అని అభిమానులు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. 'అర్ష్‌దీప్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ ఇవ్వాలి.. అది కూడా పాక్ తరపున' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఆటలో ఇటువంటి తప్పిదాలు సహజమే అంటూ అర్ష్‌దీప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.
చదవండి: Asia Cup 2022 - Ind Vs Pak: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. మాకిది గుణపాఠం.. ఇక కోహ్లి: రోహిత్
Virat Kohli: ధోని తప్ప ఒక్కరూ మెసేజ్ చేయలేదు.. టీవీలో వాగినంత మాత్రాన: కోహ్లి ఘాటు వ్యాఖ్యలు
Every Indian to Arshdeep Singh when he dropped the catch #INDvsPAK2022 #INDvsPAK pic.twitter.com/oe4oNZFWn6
— Just Another Guy (@JustNotherGuy11) September 4, 2022
Arshdeep Singh winning Man of the Match, but from Pakistan's side.#INDvPAK #AsiaCupT20 pic.twitter.com/P1mftciIhx
— Duke 🦁 (@DukeForPM7) September 4, 2022
చదవండి: Asia Cup 2022 - Ind Vs Pak: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. మాకిది గుణపాఠం.. ఇక కోహ్లి: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment