
ప్రేమ అనేది ఓ గొప్ప అనుభూతి. మనలో చాలా మంది ప్రేమలో పడుతారు. కానీ ప్రేమను వ్యక్త పర్చడంలో వెనకడుగువేస్తారు. తమ ప్రేమ గురించి తెలియజేసేందుకు ధైర్యం చాలక వాటిని మనసులోనే దాచుకుని సతమతమవుతారు. ప్రియురాలికి ప్రియుడు ప్రపోజ్ చేయాలని, ప్రియురాలు ప్రియుడికి ప్రప్రోజ్ చేయాలని తెగ ఊగిసలాడుతుంటారు. అందుకే ప్రపోజ్ చేయడానికి ఏ ప్రదేశాలకు తీసుకెళ్లాలి. ప్రేమను ఎక్కడ, ఎలా వ్యక్తపరిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటారు. అలా ఆలోచించిన ఓ ప్రేమికుడు.. అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా.. జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రపోజ్ చేసి ప్రేయసి మనసు గెలుచుకున్నాడు.
ఇక వివరాల్లోకి వెళితే..అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌కు చెందిన ఫిల్మ్ మేకర్, ఎడిటర్ అయిన లీలోచ్లర్.. స్తుతి అనే యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా స్తుతికి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. డిస్నీ నిర్మాణంలో తెరకెక్కిన స్లీపింగ్ బ్యూటీ సినిమా అంటే స్తుతికి చాలా ఇష్టమని తెలుసుకున్నాడు. ఆరు నెలల పాటు కష్టపడి.. స్లీపింగ్ బ్యూటీ యానిమేషన్ మూవీని తిరిగి స్వయంగా సృష్టించాడు. డిజైన్ చేసిన వీడియోను ఓ థియేటర్ లో ప్లే అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు.
ఓ రోజు స్లీపింగ్ బ్యూటీ సినిమా మళ్లీ థియేటర్‌లో ఆడుతోందని వెళ్దామా అంటూ స్తుతిని ముందుగా ప్లాన్ చేసుకున్న థియేటర్‌కు తీసుకెళ్లాడు. యానిమేషన్ సినిమా ప్లే అవ్వసాగింది. అది చూసిన ఆమె... ఇదేంటి... స్లీపింగ్ బ్యూటీ సినిమా ఇలా ఉండదే... అనుకుంటూనే పరిశీలించి చూడసాగింది. స్తుతికి థియేటర్ స్క్రీన్ పై ఏం జరుగుతుందో అర్ధం కావడంలేదు. అయితే చంద్రుడిపై నిద్రపోతుంది.. తన ఆకారంతో ఉన్న క్యారక్టర్ అని గుర్తించింది. లవ్ ప్రపోజ్ చేసేందుకు వచ్చింది లీలోచ్లర్ అని గుర్తించి షాక్‌కు గురైంది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే లీలోచ్లర్ స్తుతి ఎదురుగా వచ్చి ఓ ఉంగరాన్ని తీసి మోకాళ్లపై నిల్చొని తన ప్రేమను వ్యక్తం చేశాడు. లిలోచ్లర్ అలాచేయగానే థియేటర్‌లో ఉన్న వారంతా కేకలు, విజిల్స్ వేశారు. ఏంటా అని వెనక్కి చూసిన స్తుతికి మరో షాక్ తగిలింది. థియేటర్‌కు వచ్చిన వారంతా అభిమానులు కాదు.. లీలోచ్లర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు. ఇలా థియేటర్‌లో జరిగిన సర్‌ప్రైజ్‌కు స్తుతి ఫిదా అయింది. వెంటనే లీలోచ్లర్ ప్రేమను ఒప్పకుంది. ఇలా థియేటర్‌లో జరిగిన మొత్తం ఇన్సిడెంట్‌ను ప్రియుడు లీలోచ్లర్ సీక్రెట్‌గా వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment