Anu Emmanuel Netizen Marriage Comments Viral On Social Media - Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ అను ఇమాన్యుయేల్‌కు నెటిజన్‌ వెరైటీ లవ్‌ ప్రపోజల్‌

Published Thu, May 20 2021 8:50 PM | Last Updated on Fri, May 21 2021 5:36 PM

Variety Love Proposal To Anu Emmanuel In Instagram Post Viral  - Sakshi

నాచురల్‌ స్టార్‌ నాని సరసన మజ్ను మూవీతో  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమాన్యుయేల్‌ ఆ తర్వాత అల్లు అర్జున్‌, పవన్‌కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టినా ఈ అమ్మడికి పెద్దగా కలిసిరాలేదు. కెరీర్‌తో ఇంతరకు ఆశించిన స్థాయిలో హిట్‌ పడలేదు. అయితే ఈ మధ్య కుర్రహీరో అల్లు శిరీష్‌తో లవ్‌ ట్రాక్‌ కొనసాగిస్తుందంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తోడు ఇప్పటివరకు ఏ హీరోయిన్‌తోనూ రూమర్స్‌ రాని శిరీష్‌ ఈ మధ్యకాలంలో అను ఇమాన్యుయేల్‌తో క్లోజ్‌ అయినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రూమర్స్‌పై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించకపోవడంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడటం లేదు.

ఇక ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫోటో షూట్‌లతో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తుంటుంది. తాజాగా లాంగ్‌ వైట్‌ కలర్‌ షర్ట్‌ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను షేర్‌ చేయగా ఓ నెటిజన్‌ నుంచి ఊహించని విధంగా రియక‌్షన్‌ వచ్చింది. మీరు నన్ను పెళ్లిచేసుకుంటారా? నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. గార్డెన్‌తో కూడిన ఓ అందమైన ఇళ్లు ఉంది. అలాగే ఓ స్కూటర్‌ కూడా ఉంది. వీటన్నింటికి మించి మీపై బోలెడంత ప్రేమ ఉంది అంటూ లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. దీంతో ఈ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. 

చదవండి : కొన్నాళ్లుగా హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న అల్లు శిరీష్‌!
అను ఇమాన్యుయేల్‌తో అల్లు శిరీష్‌ చాట్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement