
Late Congress Leader Ahmed Patel Son Proposes To Heroine Ameesha Patel: బద్రి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ అమీషా పటేల్. నాని, నరసింహుడు చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన ఈమె గత కొంతకాలంగా ఈమె దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్‌తో ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తమ ప్రేమ బంధంపై వీరిద్దరు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఫైజల్ 41వ బర్త్‌డే సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.
'హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్ యు..అంటూ అమీషా సైతం ట్విట్టర్‌లో ప్రియుడికి బర్త్‌డే విషెస్ తెలిపింది. దీనికి ఫైజల్ మాత్రం ఆసక్తికరంగా స్పందించాడు. థ్యాంక్యూ అమీషా పటేల్. ఈ సందర్భంగా పబ్లిక్‌గా నీకు ప్రపోజ్ చేస్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ సోషల్ మీడియాలో పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. అయితే కాసేపటికే ఫైజల్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు.
కానీ అప్పటికే నెటిజన్లు ఈ చాట్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. కాగా గతంలో ఫైజల్ జైనాబ్ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. కానీ గుండెపోటుతో ఈమె 2016లో చనిపోయింది. అనంతరం ఫైజల్ అమీషా ప్రేమలో పడ్డాడు. ఫైజల్ కంటే అమీషా పటేల్ నాలుగేళ్లు పెద్దది.