ఇలా ప్రపోజ్‌ చేస్తే.. ఎవరైనా ప్లాటే | Watch Video, Los Angeles Man Wins The Internet with Dreamy Sleeping Beauty Proposal For Girlfriend | Sakshi
Sakshi News home page

ఇలా ప్రపోజ్‌ చేస్తే.. ఎవరైనా ప్లాటే

Published Sat, Jan 11 2020 5:38 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

ప్రేమ అనేది ఓ గొప్ప అనుభూతి. మనలో చాలా మంది ప్రేమలో పడుతారు. కానీ ప్రేమను వ్యక్త పర్చడంలో వెనకడుగువేస్తారు. తమ ప్రేమ గురించి తెలియజేసేందుకు ధైర్యం చాలక వాటిని మనసులోనే దాచుకుని సతమతమవుతారు. ప్రియురాలికి ప్రియుడు ప్రపోజ్ చేయాలని, ప్రియురాలు ప్రియుడికి ప్రప్రోజ్ చేయాలని తెగ ఊగిసలాడుతుంటారు. అందుకే  ప్రపోజ్ చేయడానికి ఏ ప్రదేశాలకు తీసుకెళ్లాలి. ప్రేమను ఎక్కడ, ఎలా వ్యక్తపరిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంటారు.  అలా ఆలోచించిన ఓ ప్రేమికుడు.. అందరిలా కాకుండా కొంచె వెరైటీగా.. జీవితాంతం గర్తుండిపోయేలా ప్రపోజ్‌ చేసి ప్రేయసి మనసు గెలుచుకున్నాడు.

ఇక వివరాల్లోకి వెళితే..అమెరికాలోని లాస్‌ ఎంజెల్స్‌కు చెందిన ఫిల్మ్ మేకర్, ఎడిటర్‌ అయిన లీలోచ్లర్.. స్తుతి అనే యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే అందరిలా కాకుండా కొంచెం వెరైటీగా స్తుతికి ప్రపోజ్‌ చేయాలనుకున్నాడు. డిస్నీ నిర్మాణంలో తెరకెక్కిన  స్లీపింగ్ బ్యూటీ సినిమా అంటే స్తుతికి చాలా ఇష్టమని తెలుసుకున్నాడు. ఆరు నెలల పాటూ కష్టపడి... స్లీపింగ్ బ్యూటీ యానిమేషన్‌ మూవీని తిరిగి స్వయంగా సృష్టించాడు. డిజైన్ చేసిన వీడియోను ఓ థియేటర్ లో ప్లే అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు.

ఓ రోజు స్లీపింగ్ బ్యూటీ సినిమా మళ్లీ థియేటర్‌లో ఆడుతోందని వెళ్దామా అంటూ స్తుతిని ముందుగా ప్లాన్‌ చేసుకున్న థియేటర్‌కు తీసుకెళ్లాడు. యానిమేషన్‌ సినిమా ప్లే అవ్వసాగింది. అది చూసిన ఆమె... ఇదేంటి... స్లీపింగ్ బ్యూటీ సినిమా ఇలా ఉండదే... అనుకుంటుంటే.. పరిశీలించి చూడసాగింది. స్తుతి థియేటర్ స్క్రీన్ పై ఏం జరుగుతుందో అర్ధం కావడంలేదు. అయితే చంద్రుడిపై నిద్రపోతున్న తన ఆకారంతో ఉన్న క్యారక్టర్ అని గుర్తించింది. లవ్ ప్రపోజ్ చేసేందుకు వచ్చింది లీలోచ్లర్ అని గుర్తించి షాక్ కు గురైంది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే లీలోచ్లర్ స్తుతి ఎదురుగా వచ్చి  ఓ ఉంగరాన్ని తీసి మొకాళ్లపై నిల్చొని తన ప్రేమను వ్యక్తం చేశాడు. లిలోచ్లర్‌ అలాచేయగానే థఙయేటర్‌లో ఉన్న వారంతా కేకలు, విజిల్స్‌ వేశారు. ఏంటా అని వెనక్కి చూసిన స్తుతికి మరో షాక్‌ తగిలింది. థియేటర్‌కు వచ్చిన వారంత అభిమానులు కాదు.. లీలోచ్లర్‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు. ఇలా థియేటర్‌లో జరిగిన సర్‌ప్రైజ్‌కు స్తుతి ఫిదా అయింది. వెంటనే లీలోచ్లర్‌ ప్రేమను ఒప్పకుంది.  ఇలా థియేటర్ జరిగిన మొత్తం ఇన్సిడెంట్ ను ప్రియుడు లీలోచ్లర్  సీక్రెట్ గా వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement