
ఇష్టపడుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి.. వారిని ప్రేమిస్తున్నట్లు చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. కానీ ఒక్క సారి అలా ధైర్యం తెచ్చుకుని ప్రయత్నిస్తే.. ప్రేమ, ఆనందం మీ సొంతం అవుతాయంటున్నారు ట్విటర్ యూజర్ రిలే. అందుకు తనే మంచి ఉదాహరణ అంటూ తన స్టోరిని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ స్టోరి విపరీతంగా వైరలవడమే కాక ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
రిలే తన స్టోరి చెప్తూ.. ‘‘పబ్లిక్ స్పీకింగ్’ క్లాస్‌లో తొలిసారి ఆ అబ్బాయిని చూశాను. మొదటి చూపులోనే అతని మీద ఇష్టం కలిగింది. నెలలు గడుస్తున్న కొద్ది.. ఆ ఇష్టం ఇంకా పెరిగిపోయింది. ఓ రోజు ధైర్యం చేసి ఫేస్‌బుక్‌లో నా ప్రేమ గురించి తెలుపుతూ.. తనకు మెసేజ్ చేశాను. ఇది జరిగి ఓ సంవత్సరం గడిచింది. ప్రస్తుతం మేమిద్దరం చాలా సంతోషంగా కలిసి ఉన్నాం. అమ్మాయిలు ధైర్యం చేయ్యండి’ అంటూ రిలే చేసిన ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
After crushing on “the cute guy from public speaking” for months, I made the most impulsive decision I have ever made & messaged him on Facebook 😂
— Riłëy (@rileyy__daviss) May 3, 2019
1 year later, we are happily dating & have been talking every day since.
Moral is: don’t be afraid to shoot your shot, ladies (; pic.twitter.com/5vxD49XtZE
ఈ స్టోరి చూశాక చాలా మంది తాము కూడా ఇలానే ధైర్యం చేసి ప్రపోజ్ చేశామని.. ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నామంటూ తమ కథలను కూడా షేర్ చేయడం ప్రారంభించారు. ఇప్పటికే రిలే ట్వీట్‌ను దాదాపు 9 వేల మంది రీట్వీట్ చేయగా.. 97 వేల మంది లైక్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment