
వారం తరువాత ఓకే అన్నాడు
నా లవ్ ప్రపోజల్‌కు వారం తరువాత ఓకే చెప్పాడు అన్నారు నటి ప్రియమణి. పరుత్తివీరన్ చిత్రంతో కోలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న నటి ప్రియమణి. అంతకు ముందు మాతృభాష మలయాళంలోనూ, ఆ తరువాత తెలుగులోనూ కథానాయికగా ఒక రౌండ్ కొట్టిన ఈ బ్యూటీకి ప్రస్తుతం అవకాశాలు అంతగా లేవు. తమిళంలో బొత్తిగా లేవు. దీంతో అమ్మడు పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు సిగ్నల్‌గా తన ప్రేమ వ్యవహారాన్ని లీక్ చేసినట్లు సినీ వర్గాల సమాచారం.ఆ మధ్య హిందీ చిత్రం చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో సింగిల్‌కు ఆడి పాడేశారు. దాంతో అక్కడ అవకాశాలు వస్తాయని ఆశించారు.
అప్పుడే కాదు అంతకు ముందు మణిరత్నం రావణ్ చిత్రంలో నటించినప్పుడూ ప్రియమణి ఆశలు నెరవేరలేదు. ఇక లాభంలేదని ప్రియుడి విషయాన్ని బయటపెట్టారు.ఆ విధంగా మరోసారి వార్తల్లోకెక్కారు. ఇంతకూ ప్రియమణి ప్రియుడెవరన్న విషయాన్ని చెప్పలేదు కదూ అదేదో ఆమె మాటల్లోనే విందాం. నిజమే నేను పేమలో పడ్డాను. నా ప్రియుడి పేరు ముస్తఫారాజ్. ముంబైకి చెందిన తను ఒక టీవీ రియాలిటీ షో కార్యక్రమంలో పరిచయం అయ్యారు.
ఆ పరిచయం స్నేహంగా మారింది. అయితే మొదట తనకు పేమ ప్రపోజల్ నేనే చేశాను. ఐ లైక్ యూ అంటూ మెసేజ్ పెట్టాను. ఆయన నుంచి వెంటనే సమాధానం రాలేదు. నాది నిజమైన ప్రేమేనని అర్థం చేసుకొని సరిగ్గా వారం తరువాత ఓకే అన్నారు. అలా నాలుగు సంవత్సరాల మా ప్రేమకు ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించారు. ప్రస్తుతం నేను చిత్రాలతో బిజీగా ఉన్నాను.త్వరలోనే మా పెళ్లి ఎప్పుడన్నది వెల్లడిస్తాను.