ప్రపోజల్‌ మిస్‌ఫైర్‌.. తంతే నీళ్లలో పడ్డాడు | Man Gets Kicked In The Face Falls Into Water In Proposal | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో.. ప్రియుడిని తన్నిన యువతి

Published Mon, Sep 28 2020 3:11 PM | Last Updated on Mon, Sep 28 2020 3:20 PM

Man Gets Kicked In The Face Falls Into Water In Proposal - Sakshi

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. ప్రపోజ్‌ చేయడానికి ప్లాన్‌ సిద్ధం చేసుకున్నాడు. ప్రియురాలికి చేతికి ఉంగరం తొడిగాడు.. ఆమె కూడా సంతోషంగా ఒప్పకుంది. కానీ వెంటనే అతడిని కాలితో తన్నింది. యాక్సెప్ట్‌ చేసింది కదా.. మరి ఇదేంటి అంటే పాపం ఆ యువతి కావాలని అలా చేయలేదు. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్ల జీవితాంతం గుర్తుండిపోవాల్సిన సందర్భం కాస్త ఇలా నాశనం అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఓ జంట డేట్‌కి వెళ్లింది. దానిలో భాగంగా యువతి బోటులో షికారుకు బయలు దేరింది. కొద్దిసేపటికి వ్యక్తి చేతిలో ఉంగరం తీసుకుని మరో బోటులో యువతి దగ్గరకి వెళ్లాడు. రెండింటిని దగ్గరకు కలిపాడు. తన బోటు అంచు మీద నిలబడి ప్రియురాలికి ప్రపోజ్‌ చేసి.. ఆమె చేతికి ఉంగరం తొడిగాడు‌. యువతికి కూడా ఈ సర్‌ప్రైజ్‌ తెగ నచ్చింది. పెళ్లికి అంగీకరించింది. (చదవండి: వైరల్‌: గున్న ఏనుగు చిలిపి స్నానం)

అంతా బాగానే ఉంది అనుకుంటుండగా.. అలల తాకిడికి యువతి కూర్చున్న బోటు ముందుకు కదిలింది. దాంతో ఆమె కిందపడటం.. గాల్లోకి లేచిన ఆమె కాలు ప్రియుడి ముఖానికి తాకడం క్షణాల్లో జరిగిపోయాయి. దాంతో అతడు నీళ్లలో పడ్డాడు. అదృష్టం ఇద్దరికి పెద్దగా గాయాలేం కాలేదు. పాపం జీవితాంతం మధుర జ్ఞాపకంగా గుర్తుంచుకోవాల్సిన ప్రపొజల్‌ డే కాస్త ఇలా పాడవ్వడంతో ఇద్దరూ నిరాశ చెందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోది. ఇప్పటికే దీన్ని 1.4లక్షల మంది చూశారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement