kicked
-
ప్రియుడిని తన్నిన యువతి
-
ప్రపోజల్ మిస్‌ఫైర్.. తంతే నీళ్లలో పడ్డాడు
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. ప్రపోజ్ చేయడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ప్రియురాలికి చేతికి ఉంగరం తొడిగాడు.. ఆమె కూడా సంతోషంగా ఒప్పకుంది. కానీ వెంటనే అతడిని కాలితో తన్నింది. యాక్సెప్ట్ చేసింది కదా.. మరి ఇదేంటి అంటే పాపం ఆ యువతి కావాలని అలా చేయలేదు. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన వల్ల జీవితాంతం గుర్తుండిపోవాల్సిన సందర్భం కాస్త ఇలా నాశనం అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఓ జంట డేట్‌కి వెళ్లింది. దానిలో భాగంగా యువతి బోటులో షికారుకు బయలు దేరింది. కొద్దిసేపటికి వ్యక్తి చేతిలో ఉంగరం తీసుకుని మరో బోటులో యువతి దగ్గరకి వెళ్లాడు. రెండింటిని దగ్గరకు కలిపాడు. తన బోటు అంచు మీద నిలబడి ప్రియురాలికి ప్రపోజ్ చేసి.. ఆమె చేతికి ఉంగరం తొడిగాడు. యువతికి కూడా ఈ సర్ప్రైజ్ తెగ నచ్చింది. పెళ్లికి అంగీకరించింది. (చదవండి: వైరల్: గున్న ఏనుగు చిలిపి స్నానం) అంతా బాగానే ఉంది అనుకుంటుండగా.. అలల తాకిడికి యువతి కూర్చున్న బోటు ముందుకు కదిలింది. దాంతో ఆమె కిందపడటం.. గాల్లోకి లేచిన ఆమె కాలు ప్రియుడి ముఖానికి తాకడం క్షణాల్లో జరిగిపోయాయి. దాంతో అతడు నీళ్లలో పడ్డాడు. అదృష్టం ఇద్దరికి పెద్దగా గాయాలేం కాలేదు. పాపం జీవితాంతం మధుర జ్ఞాపకంగా గుర్తుంచుకోవాల్సిన ప్రపొజల్ డే కాస్త ఇలా పాడవ్వడంతో ఇద్దరూ నిరాశ చెందారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోది. ఇప్పటికే దీన్ని 1.4లక్షల మంది చూశారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. -
గుజరాత్లో బీజేపీ ఎమ్మెల్యే దాష్టీకం
ఆహ్మదాబాద్: పట్టపగలు, నడిరోడ్డు మీద ఒక మహిళ అని చూడకుండా బీజేపీ ఎమ్మెల్యే ఒకరు దాష్టీకానికి పాల్పడ్డారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. ముఖాన్ని బూటు కాలుతో తొక్కారు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటంటే తమ ప్రాంతానికి నీటి సరఫరా ఎప్పట్నుంచి పునరుద్ధరిస్తారని ప్రశ్నించడమే. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్షమాపణలు చెప్పాడు. గుజరాత్‌లోని నరోదా పట్టణంలో స్థానిక ఎన్సీపీ మహిళా నేత తేజ్‌వని తమ సమస్యపై తొలుత అక్కడి కార్పొరేటర్, బీజేపీ ఎమ్మెల్యే బలరామ్ థావాని సోదరుడు కిశోర్ థావానీని సంప్రదించారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఆయన పట్టించుకోలేదు. పైగా దుర్భాషలాడారు. ఐదారు రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో తేజ్‌వని అహ్మదాబాద్‌లో మేఘాని నగర్లో ఉన్న ఎమ్మెల్యే ఇంటికి తమ ప్రాంతంలోని ఇతర మహిళలతో కలసి వెళ్లారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఆఫీసులో లేరు. అయితే ఆయన మద్దతుదారులు వారిని దుర్భాషలాడటంతో మహిళలు కిశోర్ థావానీకి వ్యతిరేకంగా నినాదాలు మొదలు పెట్టారు. ఇంతలో ఎమ్మెల్యే బలరామ్ వచ్చారు. ‘వస్తూ వస్తూనే ఆవేశంగా నా చేతిలో మొబైల్ ఫోన్ లాక్కున్నాడు. నా కడుపులో తన్నాడు. నేను కింద పడిపోతే కాళ్లతో నా ముఖం మీద కొట్టడం మొదలు పెట్టాడు. చివరికి కర్రతో కూడా కొట్టాడు. నా భర్త అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతని అనుచులు ఆయనను అక్కడ నుంచి గెంటేశారు‘‘అని తేజ్‌వని వివరించారు. ఈ ఘటన వీడియో యూ ట్యూబ్‌లో వైరల్‌గా మారింది. దీనిపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. దీంతో ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. కాగా ఎమ్మెల్యేని వెంటనే అరెస్ట్ చేయాలని ఎన్సీపీ డిమాండ్ చేసింది. -
'నేనెలాగో చావాలి..'
సాక్షి, భోపాల్ : అకారణంగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని చంపేశాడు. నడుస్తున్న రైలులో నుంచి ముక్కు ముఖం తెలియని వ్యక్తి మరో వ్యక్తిని కిందికి తోసి హత్య చేశాడు. అతడిని చంపడానికి ముందు 'నేను ఎలాగో చనిపోతున్నాను.. నిన్ను కూడా చంపేస్తా' అని కేకలు పెడుతూ వచ్చి అసలు తనకు పరిచయం లేని వ్యక్తిని కిందపడేసి చంపేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం .. ఆదివారం మధ్యప్రదేశ్‌లో కామాయని ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కోచ్‌లో రితేజ్ అనే వ్యక్తి డోర్‌పక్కనే కూర్చున్నాడు. ఆ సమయంలో రితేష్ పక్కనే అతడి సోదరుడు సుమిత్ సింగ్, రైల్వే పోలీసులు కూడా ఉన్నారు. ఆ సమయంలో రజ్మల్ పాల్ అకా రజ్జు అనే వ్యక్తి నేరుగా రితేష్ వద్దకు వచ్చి తాను ఎలాగో చస్తున్నానని, అందుకు నిన్ను కూడా చంపేస్తానంటూ రితేష్‌ను అమాంతం రైలులో పడేశాడు. ఈ సంఘటన భోపాల్ శివారులో ఉన్న సుఖి సెవానియా రైల్వేస్టేషన్‌కు సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడు, నిందితుడు ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు తెలియదు. పైగా వారిద్దరి మధ్య రైలులో ఎలాంటి గొడవ జరగలేదు. టాయిలెట్లో నుంచి బయటకు వచ్చిన నిందితుడు రజ్మల్ నేరుగా రితేశ్ వద్దకు వచ్చి ఇలా చేశాడు. దీంతో ప్రస్తుతం అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదా కావాలనే ఇలా చేశాడా అని ఆరా తీస్తున్నారు. -
బట్టలు విప్పి మరీ కొట్టారు...
చైనాలో హయినన్ ప్రావిన్స్‌లోని లింగావో ప్రాంతంలోని ఓ టీనేజ్ అమ్మాయిల గ్రూప్ రెచ్చిపోయింది. పదిహేనేళ్ల అమ్మాయిని అందరూ చూస్తుండగానే చితక్కొట్టారు. ఈ సంఘటనతో చైనాలో టీనేజ్ గ్రూపుల ఆకృత్యాలు మరో సారి బయటకు వచ్చినట్టయింది. స్కూలు దుస్తుల్లో ఉన్న ఓ బాలికను కొందరు టీనేజర్లు పట్టుకొని అతి కిరాతకంగా కొట్టారు. ఆ అమ్మాయిని రోడ్డుపై పడేసి జట్టు పట్టుకుని లాగుతూ.. కాళ్లతో తన్నుతూ అందరూ చూస్తుండగానే బట్టలు విప్పి మరీ చితక్కొట్టారు. అయితే వారి దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆ బాలికను వెంబడించి మరోసారి చేయి చేసుకున్నారు. అయితే ఈ దుశ్చర్య జరుగుతున్న సమయంలో కొందరు బాలికలు అక్కడే ఉన్నా... రెచ్చిపోతున్న టీనేజర్ల ఆగడాలను ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు దీన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టారు. దీంతో ప్రస్తుతం చైనాలో టీనేజర్ల ఆగడాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఏ కారణంతో బాలికను కొట్టారన్న విషయం తెలియరాలేదు.