బట్టలు విప్పి మరీ కొట్టారు... | Horrifying moment a girl is kicked by a group of teen bullies | Sakshi
Sakshi News home page

బట్టలు విప్పి మరీ కొట్టారు...

Published Tue, Jan 19 2016 5:38 PM | Last Updated on Mon, Apr 8 2019 6:20 PM

Horrifying moment a girl is kicked by a group of teen bullies

చైనాలో హయినన్ ప్రావిన్స్లోని లింగావో ప్రాంతంలోని ఓ టీనేజ్ అమ్మాయిల గ్రూప్ రెచ్చిపోయింది. పదిహేనేళ్ల అమ్మాయిని అందరూ చూస్తుండగానే చితక్కొట్టారు. ఈ సంఘటనతో చైనాలో టీనేజ్ గ్రూపుల ఆకృత్యాలు మరో సారి బయటకు వచ్చినట్టయింది. స్కూలు దుస్తుల్లో ఉన్న ఓ బాలికను కొందరు టీనేజర్లు పట్టుకొని అతి కిరాతకంగా కొట్టారు. ఆ అమ్మాయిని రోడ్డుపై పడేసి జట్టు పట్టుకుని లాగుతూ.. కాళ్లతో తన్నుతూ అందరూ చూస్తుండగానే బట్టలు విప్పి మరీ చితక్కొట్టారు.



అయితే వారి దాడి నుంచి తప్పించుకోవడానికి  ప్రయత్నించిన ఆ బాలికను వెంబడించి మరోసారి చేయి చేసుకున్నారు. అయితే ఈ దుశ్చర్య జరుగుతున్న సమయంలో  కొందరు బాలికలు అక్కడే ఉన్నా... రెచ్చిపోతున్న టీనేజర్ల ఆగడాలను  ఆపేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు దీన్నంతా వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టారు. దీంతో ప్రస్తుతం చైనాలో టీనేజర్ల ఆగడాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఏ కారణంతో బాలికను కొట్టారన్న విషయం తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement