ఇలా ప్రపోజ్‌ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే | Viral Video Of Man Proposes To Train Driving Girlfriend In Ireland | Sakshi
Sakshi News home page

ఇలా ప్రపోజ్‌ చేస్తే ఎవరైనా పడిపోవాల్సిందే

Dec 20 2020 1:11 PM | Updated on Dec 20 2020 3:29 PM

Viral Video Of Man Proposes To Train Driving Girlfriend In Ireland - Sakshi

డబ్లిన్‌‌ : నచ్చిన అమ్మాయికి ప్రేమను వ్యక్తం చేయడంలో కొందరు వినూత్నంగా ఆలోచిస్తారు. ఆ కోవకు చెందినవాడే ఐర్లాండ్‌కు చెందిన కొనోర్‌ ఓసులివన్‌.. డబ్లిన్‌ ప్రాంతానికి చెందిన కొనోర్‌ ట్రైన్‌ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాను ప్రేమిస్తున్న అమ్మాయి పౌలా కార్బోజియా కూడా ట్రైన్‌ డ్రైవర్‌గానే పనిచేస్తుంది. కొనోర్‌ పౌలాకు ఎలాగైనా తన ప్రేమను వ్యక్తం చేయాలని.. అందుకు తాను పనిచేస్తున్న రైల్వే స్టేషనైతేనే బాగుంటుదనుకున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో స్టేషన్‌కు వెళ్లిన కొనోర్‌.. ఫ్లాట్‌ఫామ్‌పై విల్‌ యూ మ్యారీ మీ అనే అక్షరాలను ఒక్కో బోర్డుపై ఏర్పాటు చేశాడు. 

ఇక కొనోర్‌ చేతిలో బొకే, షాంపైన్‌ బాటిల్‌ పట్టుకొని.. 'మీ' అనే అక్షరం ఉన్న చివరి బోర్డు వద్ద తన ప్రేయసి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే పౌలా నడుపుతున్న ట్రైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ మీదకు ఎంటరైంది. ట్రైన్‌ నడుపుతున్న పౌలా.. ఫ్లాట్‌ఫామ్‌పై ఉ‍న్న బోర్డులను ఒక్కోటి చదువుకుంటూ చివరి బోర్డు వచ్చేసరికి అక్కడ ఉన్న కొనోర్‌ను చూసి ఆశ్చర్యానికి లోనైంది. వెంటనే ట్రైన్‌ ఆపి అతని దగ్గరకి వెళ్లింది. (చదవండి : టర్కీ వీధుల్లో అనుకోని అతిథుల హల్‌చల్‌)

అప్పటికే ఎదురుచూస్తున్న కొనోర్‌ పౌలా రాగానే మొకాళ్లపై నిల్చుని .. విల్‌ యూ మ్యారీ మీ.. అని ఆమెకు ప్రపోజ్‌ చేశాడు. తన కోసం ఇంతచేసిన కొనోర్‌ను ప్రేమను ఒప్పుకున్నట్లుగా పైకి లేపి గట్టిగా హత్తుకుంది. దీంతో అక్కడున్నవారు కేరింతలు కొడుతూ వారి ఆనందాన్ని మరింత రెట్టింపు చేశారు. ఈ అరుదైన సందర్భాన్ని క్లోడా మహెర్ అనే వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... ' పీల్సే స్టేషన్‌లో జరిగిన అద్భుతమైన ప్రపోజల్' అని రాసుకొచ్చాడు. చూడగానే ఆకట్టుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్​ అయింది. ఈ వీడియోపై నెజిటన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement