లైవ్‌లోనే లవ్‌ ప్రపోజల్‌: ఓడిన ప్లేయర్‌కు షాకిచ్చిన కోచ్‌! | Tokyo Olympics: Coach Love Propose To Argentine Fencer In Live | Sakshi
Sakshi News home page

Tokyo Olympics: ఇన్నాళ్లు నీ వెంట నేనున్నా.. ఇకపై నా వెంట నువ్వుంటావా?

Published Tue, Jul 27 2021 3:13 PM | Last Updated on Tue, Jul 27 2021 6:44 PM

Tokyo Olympics: Coach Love Propose To Argentine Fencer In Live - Sakshi

టోక్యో (జపాన్‌): విశ్వ క్రీడా సంబరం జపాన్‌ రాజధాని టోక్యో నగరంలో జరుగుతోంది. ప్రపంచ దేశాల క్రీడాకారులు తమ ప్రతిభ నిరూపించుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందరూ గెలుపు కోసం ప్రయత్నిస్తారు. కానీ అందులో కొందరికీ మాత్రమే విజయం వరిస్తుంది. ఇక మిగిలిన వారు ఓటమి చెందుతారు. గెలుపోటములనేవి సమానంగా తీసుకోవాలి. ఈ విషయాన్ని గుర్తిస్తే ఆటలోనైనా.. జీవితంలోనైనా మానసికంగా సిద్ధమైతే ఏ పరిస్థితిని అయినా ఎదుర్కొనవచ్చు. అలా బాధలో ఉన్న ఓ ప్లేయర్‌కు ఆమె కోచ్‌ ఊహించని షాక్‌ ఇచ్చాడు. ఇన్నాళ్లు నీ వెంట నేనున్నా.. ఇకపై నా వెంట నువ్వుంటావా? అని మీడియా వేదికగా లవ్‌ ప్రపొజల్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

అర్జెంటీనా ఫెన్సర్‌ మారియా బెలెన్‌ పెరెజ్‌ మారిస్‌ టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొని తొలి రౌండ్‌లోనే పరాజయం పొంది నిరాశకు గురయ్యింది. తన ప్రదర్శనపై మీడియాతో మాట్లాడుతోంది. ఈ సమయంలో ఆమె కోచ్‌ లుకాస్‌ ససిడో వెంట నిలబడి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని వారి మాతృ భాషలో రాసిన ఒక పేపర్‌ పట్టుకుని నిలబడ్డారు. వీటిని చూసిన మీడియా ప్రతినిధులు గట్టిగా నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారో తెలియక ఆమె వెనకకు తిరిగి చూసింది. కోచ్‌ చేసిన ప్రేమ అభ్యర్థనను చూసి ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. వెంటనే అతడి ప్రేమ అభ్యర్థనను అంగీకరించింది.

బెలెన్‌ మూడుసార్లు ఒలింపిక్స్‌ పోటీల్లో పాల్గొంది. బెలెన్‌కు లుకాస్‌ కొన్నేళ్లుగా కోచ్‌గా ఉన్నారు. 2010లో పారిస్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌ షిప్‌ పోటీల్లోనూ కోచ్‌ లుకాస్‌ ఇదే విధంగా ప్రపోజ్‌ చేశాడు. అయితే అప్పుడు ‘నువ్వు జోక్‌ చేస్తున్నావా?’ అని చెప్పి లైట్‌గా తీసుకుంది. ఇప్పుడు 2021లో అదే విధంగా ప్రపోజ్‌ చేయడంతో ఆమె చివరకు లుకాస్‌ను అంగీకరించింది. తాము పెళ్లి చేసుకుంటామని మీడియా ముఖంగానే ప్రకటించారు. ఈ లైవ్‌ లవ్‌ ప్రపోజల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement