నిద్రలో ఉండగా ఇంట్లో ఐదుగురిని తొక్కిచంపింది | 5 of a family trampled to death by wild elephant | Sakshi
Sakshi News home page

నిద్రలో ఉండగా ఇంట్లో ఐదుగురిని తొక్కిచంపింది

Published Tue, Apr 5 2016 7:22 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

నిద్రలో ఉండగా ఇంట్లో ఐదుగురిని తొక్కిచంపింది

నిద్రలో ఉండగా ఇంట్లో ఐదుగురిని తొక్కిచంపింది

తేజ్పూర్: అసోంలో ఓ ఏనుగు భీభత్సం సృష్టించింది. నిద్రలో ఉండగా ఒకే కుటుంబంలో ఐదుగురుని తొక్కి చంపింది. వీరిలో తొమ్మిది నెలల బాలుడు కూడా ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని విశ్వనాథ్ చారియలి జిల్లాలోగల బెమారీ అనే గ్రామంలో గత రాత్రి ఓ కుటుంబంలోని ఆరుగురు గాఢ నిద్రలో ఉన్నారు.

అదే సమయంలో బిహాలీ రిజర్వ్ ఫారెస్ట్లో నుంచి ఓ ఏనుగు తప్పించుకొని వచ్చి ఆఇంటిపై దాడికి దిగింది. ఆ కుటుంబంలోని ఐదుగురిని తొక్కిపడేసింది. గ్రామస్తులంతా అక్కడికి రావడంతో ఆ ఇంట్లోని మూడేళ్ల పాప ఏనుగు బారిన పడకుండా సురక్షితంగా బయటపడింది. కాగా, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే ఈ దుర్ఘటన జరిగందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులంతా ఈ రోజు ఉదయం బెహాలీ జాతీయ రహదారిని దిగ్బంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement