పక్కింటి చిలుక గోల తట్టుకోలేకపోతున్న కాపాడండి సార్‌! | 72 Year Old Pune Man Files Police Complaint On Neighbour Parrot | Sakshi
Sakshi News home page

వృద్ధుడికి చికాకు చెప్పించిన చిలుక.. యజమానిపై కేసు!

Published Sun, Aug 7 2022 7:25 PM | Last Updated on Sun, Aug 7 2022 7:25 PM

72 Year Old Pune Man Files Police Complaint On Neighbour Parrot - Sakshi

ముంబై: రామ చిలుక అంటే ఎవరైనా ఇష్టపడతారు. వీలుంటే దానిని ఒకసారి చేతిలోకి తీసుకుని ముద్దాడాలని అనుకుంటారు. కొందరు వాటిని ఇళ్లల్లో పెంచుకుంటారు. ఎంతో గారాబంగా చూసుకుంటారు. దాని అరుపులు, చేష్టలకు మురిసిపోతుంటారు. కానీ, ఓ వృద్ధుడికి అదే నచ్చలేదు. రామ చిలుక అరుపులు తనకు చికాకు తెప్పించాయి. పక్కింటి రామ చిలుక గోల తట్టుకోలేకపోతున్న కాపాడండి సార్‌.. అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. 

పుణెలోని శివాజీనగర్‌ ప్రాంతంలోని ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్నారు సురేశ్‌ షిండే అనే 72 ఏళ్ల వ్యక్తి. ఆయన పక్కింట్లో అంటున్న అక్బర్‌ అమ్జద్ ఖాన్‌ అనే వ్యక్తి రామ చిలుకను పెంచుకుంటున్నాడు. అది ఎప్పుడూ అరుస్తూనే ఉందని, అది వృద్ధుడికి చికాకు తెప్పించినట్లు పోలీసులు తెలిపారు. ‘షిండే ఫిర్యాదుతో చిలుక యజమానిపై మనశ్సాంతి లేకుండా చేయటం, బెదిరింపుల వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. నిబంధనల ప్రకారం ఈ కేసు దర్యాప్తు చేపడతాం.’ అని ఖడ్కి పోలీస్‌ స్టేషన్‌ అధికారి తెలిపారు.

ఇదీ చదవండి: Viral Video: ఏనుగులతో సెల్ఫీ అంటే... అట్లుంటది మరీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement