పిడుగుపాటుకు రెండు గేదెల మృతి | Two buffalos died with thender stone | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు రెండు గేదెల మృతి

Published Sat, Jul 30 2016 8:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

పిడుగుపాటుకు రెండు గేదెల మృతి

పిడుగుపాటుకు రెండు గేదెల మృతి

రేవనపల్లి(భూదాన్‌పోచంపల్లి)
 పిడుగుపాటుకు రెండు గెదెలు మృతిచెందాయి. ఈ ఘటన మండలంలోని రేవనపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన రైతు మైల నర్సింహ రోజుమాదిరిగా శుక్రవారం సాయంత్రం గ్రామసమీపంలోని వ్యవసాయ బావి వద్ద గేదెలను కట్టేసి ఇంటికి వచ్చాడు.రాత్రి వర్షంతో పాటు పిడుగు పడింది. శనివారం ఉదయం బావి వద్దకు వచ్చి చూడగా చెట్టుకు కట్టేసి ఉన్న రెండు ముర్రాజాతి గేదెలు మృతిచెంది ఉన్నాయి. వీటి విలువ రూ. 1.30 లక్షలు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. సమాచారం అందుకొన్న ఆర్‌ఐ నిర్మల, మండల పశువైద్యాధికారి రాంచంద్రారెడ్డి, వీఆర్వో సుదర్శన్‌రావు, సర్పంచ్‌ గోదాసు శశిరేఖజంగయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి నుంచి  వివరాలను అడిగి తెలుసుకొని పంచానామా నిర్వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement