మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు! | Buffalo Swallowed Gold Mangalsutra Worth Rs 1.5 Lakh, Know How It Was Recovered After Surgery - Sakshi
Sakshi News home page

Buffalo Swallowed Mangalsutra: మంగళసూత్రం మింగిన గేదె

Published Mon, Oct 2 2023 12:21 PM | Last Updated on Mon, Oct 2 2023 2:28 PM

buffalo swallowed gold mangalsutra - Sakshi

మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక గేదె రూ. 15 లక్షల విలువైన మంగళసూత్రం మింగేసింది. పశువైద్యులు ఆ గేదె కడుపులోని మంగళ సూత్రం తీసేందుకు దాని కడుపును కోశారు. మంగళసూత్రం బయటకు తీశాక ఆ గేదెకు 65 కుట్లు వేశారు. 

జిల్లాలోని సార్సీ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. రామ్‌హరీ అనే రైతు భార్య స్నానం చేసే ముందు తన మంగళ సూత్రాన్ని తీసి, సోయాబీన్‌ తొక్కలు ఉన్న ఒక పాత్రలో పెట్టింది. స్నానం పూర్తయ్యాక, ఆ ప్లేట్‌ను తమ పశువులశాల లోని గేదె ముందు ఉంచి, ఇంటిపనులలో మునిగిపోయింది.

రెండు గంటల తరువాత తన మెడలో మంగళ సూత్రం లేని విషయాన్ని ఆమె గమనించింది. కొద్దిసేపు ఇటునటు వెదికాక తాను ఆ మంగళ సూత్రాన్ని సోయా తొక్కలున్న ప్లేట్‌లో పెట్టినట్లు గుర్తుకు తెచ్చు​​కుంది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ పశువులశాలలోకి వెళ్లి చూసింది. గేదె తన మంగళసూత్రం మింగేసిందని గ్రహించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. 

రైతు రామ్‌హరీ ఈ విషయాన్ని ఫోనులో పశువైద్యాధికారి బాలాసాహెబ్‌కు తెలియజేశాడు. అతని సూచన మేరకు ఆ రైతు తన గేదెను వాశింలోని పశువైద్యశాలకు తీసుకు వెళ్లాడు. అక్కడ పశువైద్యాధికారి మెటల్‌ డిటెక్టర్‌తో ఆ గెదె కడుపులో మంగళసూత్రం ఉన్నదని నిర్ధారించారు. తరువాత దానికి ఆపరేషన్‌ చేసి, మంగళ సూత్రాన్ని బయటకు తీశారు. ఈ ఆపరేషన్‌ 2 గంటలపాటు సాగింది. తరువాత వైద్యుదు ఆ గేదెకు 65 కుట్లు వేశారు. కాగా తన మంగళసూత్రాన్ని గేదె కడుపు నుంచి వెలికి తీసి, తన ఐదోతనం కాపాడారంటూ ఆ రైతు భార్య వైద్యునికి కృతజ్ఞతలు తెలియజేసింది. 
ఇది కూడా చూడండి: పాక్‌ ప్రధాని జీతం ఎంత? అదనపు సౌకర్యాలు ఏముంటాయి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement