వైరల్‌.. ఆకతాయిలపై గేదె ప్రతీకారం! | Viral Video Buffalo Exacts Revenge On Miscreants | Sakshi
Sakshi News home page

వైరల్‌.. ఆకతాయిలపై గేదె ప్రతీకారం!

Published Mon, May 25 2020 2:06 PM | Last Updated on Mon, May 25 2020 2:39 PM

Viral Video Buffalo Exacts Revenge On Miscreants - Sakshi

మూగ జీవాలు అని కూడా చూడకుండా క్రూరంగా ప్రవర్తించిన ఆకతాయిలకు ఓ గేదె తగిన బుద్ధి చెప్పింది. కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై రెండు బండ్లకు గేదెలను కట్టి పోటీ పడ్డారు. సామర్థ్యానికి మించి బండ్లపై ప్రయాణిస్తూ వాటిని హింసించారు. వేగంగా వెళ్లే క్రమంలో వాటిని అతి దారుణంగా కొట్టారు. అయితే కొద్దిదూరం వెళ్లాక.. అందులో ఓ గేదె బండిని డివైడర్‌కు తగిలేలా చేయడంతో అది కాస్తా బోల్తా పడింది. దీంతో అందులోని ఆకతాయిలు కిందపడిపోయారు. దీంతో ఆ బర్రె అక్కడి నుంచి వెళ్లిపోయింది. 

ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కస్వాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.‘గేదె ప్రతీకారం.. జంతువులను గుర్తించండి’ అని పేర్కొన్నారు. ప్రవీణ్‌ కస్వాన్‌ ఆ వీడియో షేర్‌ చేసిన కొద్దిసేపటికే అది వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు.. అటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు చోటుచేసుకుందనే దానిపై స్పష్టత లేదు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement