గేదెను చంపారని గోరక్షకుల దాడి | cattle trader arrest | Sakshi
Sakshi News home page

గేదెను చంపారని గోరక్షకుల దాడి

Published Sat, May 13 2017 2:21 AM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

గేదెను చంపారంటూ ఐదుగురిపై గోరక్షకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది.

అలీగఢ్‌: గేదెను చంపారంటూ ఐదుగురిపై గోరక్షకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. పన్నా గంజ్‌కు చెందిన కాలూ బాఘేల్‌ అనే వ్యక్తి తన డెయిరీలోని వట్టిపోయిన ఒక గేదెను ఇమ్రాన్‌ అనే పశువుల వ్యాపారికి అమ్మాడు.

దాన్ని కాలూ డెయిరీలోనే వధించేలా ఒప్పందం కుదిరింది. ఇమ్రాన్, మరో నలుగురు గేదెను వధిస్తుండగా రక్తం డెయిరీ గేటు బయటికి ప్రవహించింది. దీంతో గోరక్షకులతోపాటు పలువురు డెయిరీలోకి చొరబడి ఇమ్రాన్‌ బృందంపై దాడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు గేదెను అక్రమంగా చంపినందుకు ఇమ్రాన్‌ బృందంతోపాటు డెయిరీ యజమానిని కూడా అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement