
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: ఆల్విన్ ఫ్యాక్టరీ సమీపంలో బర్రెను ఢీకొని స్కార్పియో వాహనం పల్టీ కొట్టింది. ఆదోని నుంచి తిరుమలకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నారు. వీరిలో ఒకరు దుర్మరణం చెందారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment