scarpio
-
వాజే టార్గెట్ వంద కోట్లు
-
అంబానీ ఇంటి వద్ద కలకలం: కేసులో పురోగతి
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఎస్యూవీ పట్టుబడిన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి ఎన్ఐఏ అధికారులు మాజీ పోలీసు సచిన్ వాజేను తీసుకుని అంబానీ నివాసం వద్దకు వెళ్లారు. ఆ రోడ్డును అరగంటపాటు దిగ్బంధించి వాజే చెప్పిన వివరాల ప్రకారం సంఘటనల క్రమాన్ని రిక్రియేట్ చేశారు. అక్కడ ఎస్‌యూవీని ఉంచిన ప్రాంతం వద్ద తెల్లటి కుర్తా ధరించిన వాజేను అటూఇటూ నడిపించి, మొత్తం ఈ కార్యక్రమాన్ని రికార్డు చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన బహుళ అంతస్తుల అంబానీ నివాసం అంటిలియా వద్ద వద్ద పేలుడు వాహనంతోపాటు అందులో హెచ్చరికతో కూడిన ఉత్తరం లభ్యమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో రికార్డయిన సీసీ ఫుటేజీలో కనిపించిన తెల్ల కుర్తా వ్యక్తి ముంబై అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజేనే అని ఎన్ఐఏ అనుమానిస్తోంది. అయితే, ఈ విషయం ధ్రువీకరించుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా, థానేకు చెందిన వ్యాపారి, స్కార్పియో యజమాని అయిన మన్సుఖ్ హిరేన్ ఈ నెల 5వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మన్సుఖ్ మృతికి సచిన వాజే కారణమంటూ అతని భార్య ఆరోపించారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక బృందం(ఏటీఎస్) దర్యాప్తు చేస్తున్న ఈ కేసును కూడా కేంద్ర హోం శాఖ శనివారం ఎన్ఐఏకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారుల కస్టడీలో ఉన్న వజేను మహారాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇలా ఉండగా, అంబానీ నివాసం వద్ద వాహనంలో లభించిన 20 జిలెటిన్ స్టిక్స్ పేలుడు తీవ్రత తక్కువగా ఉంటుందనీ, వీటివల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశాలు చాలా తక్కువని ముంబైలోని కలినాలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) అధికారులు తెలిపారు. జిలెటిన్ స్టిక్స్‌లోని అమోనియాను విశ్లేషించాక ఈ అంచనాకు వచ్చామన్నారు. ఇలాంటి పేలుడు పదార్థాలను బావులు తవ్వడానికి, రోడ్డు నిర్మాణ పనులు వంటి వాటిలోనే వినియోగిస్తారన్నారు. తమ నివేదికను రెండు రోజుల్లో ఎన్ఐఏకు అందిస్తామన్నారు. దీంతోపాటు, స్కార్పియో వాస్తవ ఛాసిస్ నంబర్‌ను కనిపెట్టి, ఆ వాహనం ఎవరి పేరిట రిజిస్టరయి ఉందో త్వరలోనే తెలుసుకుంటామన్నారు. వాహనంలోపల రక్తం, వెంట్రుకలు తదితర ఆధారాల కోసం పూర్తిస్థాయిలో శోధిస్తా మన్నారు. వీటి ఆధారంగా ఘటనా సమయంలో ఆ వాహనంలో ఎవరెవరు ప్రయాణించారు? దానిని నడిపిందెవరు? వంటి వివరాలను కూడా తెలుసుకుంటామన్నారు. చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం: మళ్లీ అక్కడే మరో మృతదేహం అంబానీ ఇంటి వద్ద కలకలం: వాజే టార్గెట్ వంద కోట్లు -
వాజే టార్గెట్ వంద కోట్లు
సాక్షి, ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలోని శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్‌సింగ్ ఏకంగా రాష్ట్ర హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై ఆయన ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎనిమిది పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. పేలుడు పదార్థాల కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను మంత్రి వాడుకున్నారని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పురమాయించారంటూ పరంబీర్ బాంబు పేల్చారు. ఈ సొమ్మును సీఎం ఠాక్రే పేరిట జమ చేయాలన్నారని చెప్పారు. అనిల్ అవినీతి కార్యకలాపాల గురించి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఉపముఖ్యమంత్రి అజిత్‌లకు తెలిపానని పరంబీర్ పేర్కొన్నారు. ‘మంత్రి అనిల్ ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్ వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. నిధులు సమకూర్చేందుకు సాయపడాలంటూ ఆయన్ను పదేపదే మంత్రి కోరారు. రూ.100 కోట్ల ఫండ్ కలెక్ట్ ఎలా చేయాలో కూడా సచిన్ వాజేకు చెప్పారు. ముంబైలో 1750 బార్లు, రెస్టారెంట్లు, తదితరాలున్నాయి. ఒక్కో బార్, రెస్టారెంటు నుంచి రూ.2–3 లక్షలు వసూలు చేస్తే నెలకు రూ.40 నుంచి రూ.50 కోట్లు సులభంగా జమ అవుతాయి. ఇతర వనరుల ద్వారా మిగతా మొత్తం అందేలా చూడాలని మంత్రి కోరారు. ఆ సమయంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పలాండే తదితరులు అక్కడే ఉన్నారు’ అని ఆ లేఖలో పరంబీర్ సింగ్ పేర్కొన్నారు. తనతోపాటు సీనియర్ అధికారులకు తెలియకుండా ఇలా వారిని నివాసానికి పిలిపించుకోవడం, డబ్బులు వసూళ్లు చేసేందుకు టార్గెట్ ఇవ్వడం చేస్తుండేవారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనేక కేసుల విచారణలో ఆయన జోక్యం చేసుకునేవారని ఆరోపించారు. అదేవిధంగా అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి కార్యకలాపాలు అనేకం పోలీసు అధికారుల దృష్టికి కూడా వచ్చాయన్నారు. ముంబైలో ఆత్మహత్య చేసుకున్న దాద్రానగర్ హవేలీ ఎంపీ మెహన్ దేల్కర్ తన సూసైడ్ నోట్లో అక్కడి అధికారుల తీరుపై పలు ఆరోపణలు చేసినప్పటికీ ఆ కేసును కూడా ముంబై పోలీసులకే అప్పగిస్తూ హోం మంత్రి నిర్ణయం తీసుకోవడాన్ని పరంబీర్ సింగ్ తప్పుబట్టారు. ముకేశ్ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో వాహనం పట్టుబడటం, వ్యాపారి మన్సుఖ్ అనుమానాస్పద మృతి, పోలీస్ ఇన్స్పెక్టర్ వాజే అరెస్టు పరిణామాల నేపథ్యంలో పరంబీర్‌ను అప్రాధాన్యంగా భావించే హోంగార్డుల విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. మంత్రి దేశ్‌ముఖ్ ఏమన్నారు? అవినీతి విషయం ఫిబ్రవరిలోనే తెలిసిన పరంబీర్‌సింగ్ ఇప్పటి వరకు మౌనంగా ఎందుకు ఉన్నారంటూ మంత్రి అనిల్ ప్రశ్నించారు. ఆయనపై పరువు నష్టం కేసు వేస్తానని తెలిపారు. తనను తాను కాపాడుకునేందుకే పరంబీర్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘వాహనం కేసు, మన్సుఖ్ హత్య కేసులతో వాజేకు సంబంధాలున్నట్లు ఇప్పటికే రుజువైంది. ఇక మిగిలింది పరంబీర్. ఇవన్నీ చివరికి ఆయనకే చుట్టుకుంటాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది కదా’అని పేర్కొన్నారు. -
అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన స్కార్పియో ఓనర్ మృతి
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నివాసం 'యాంటిలియా' దగ్గర పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనాన్ని నిలిపి ఉంచడం తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తాజాగా మరో షాకింగ్ వార్త వెలుగు చూసింది. అంబానీ ఇంటి ముందు నిలిపిన పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఓనర్ మరణించాడు. ముంబైకి సమీపంలోని చిన్న కాలువ దగ్గర అతడి మృత దేహం లభ్యమయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేశారు. గత నెల 26న ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియోని నిలిపి ఉంచిన సంగతి తెలిసిందే. వాహనం లోపల ఒక బ్యాగును, లేఖను కనుగొన్నారు పోలీసులు. ‘ముఖేశ్ భయ్యా, నీతా బాబీ ఇదొక ట్రైలర్ మాత్రమే’’ అని లేఖలో రాసినట్టు సమాచారం. అయితే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన తరువాత యాంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా రెండు వాహనాలను ఆపి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ఇక దుండగులు వాడిన స్కార్పియోను విఖ్రోలి ప్రాంతం నుంచి దొంగిలించినట్లు దర్యాప్తులో. తాజాగా దాని ఓనర్ మరణించడం సంచలనం సృష్టిస్తోంది. చదవండి: అంబానీ ఇంటి దగ్గర కలకలం.. ఇది ట్రైలర్ మాత్రమే అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు : మరో ట్విస్టు -
వైఎస్సార్ జిల్లాలో కారు ప్రమాదం
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: ఆల్విన్ ఫ్యాక్టరీ సమీపంలో బర్రెను ఢీకొని స్కార్పియో వాహనం పల్టీ కొట్టింది. ఆదోని నుంచి తిరుమలకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నారు. వీరిలో ఒకరు దుర్మరణం చెందారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పొద్దుపొద్దున్నే ఛేజింగ్, కాల్పులు -
సాగర్ కాల్వ నుంచి స్కార్పియో వెలికితీత
సాక్షి, సూర్యాపేట: ప్రమాదవశాత్తూ నాగార్జున సాగర్ ఎడుమ కాల్వలో దూసుకుపోయిన స్కార్పియో వాహనాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎనిమిది గంటల పాటు శ్రమించి శనివారం మధ్యాహ్నం వెలికితీశారు. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల వద్ద స్కార్పియో వాహహం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా వెలికితీసిన వాహనంలోనే ఆరు మృతదేహాలు కూడా ఉండటంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా భోరున విలపించారు. దాంతో ఘటనా స్థలంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఈసీఐఎల్‌లోని అంకుర ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్ వివాహానికి శుక్రవారం ఉదయం వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. మృతులు అబ్దుల్ అజిత్ (45), రాజేష్ 29), జాన్సన్ (33), సంతోష్ కుమార్ (23),నగేష్ (35) పవన్ కుమార్ (23)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: సాగర్‌లోకి స్కార్పియో..ఆరుగురు గల్లంతు -
ఆర్టీసీ బస్సు, స్కార్పియో ఢీ
– మహిళ మృతి – నలుగురికి తీవ్ర గాయాలు –నుజ్జునుజ్జు అయిన స్కార్పియో కల్లూరు : ఆర్టీసీ బస్సు, స్పార్పియో ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. మరో నలుగరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన పులిచెర్ల మండలం కల్లూరు ఘాట్ రోడ్డులో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన నారప్ప భార్య కోనేటి వెంకటమ్మ (50), వారి మేనళ్లుడు మేకల చంటి (24) కొన్నేళ్లుగా కువైట్‌లో ఉంటున్నారు. వారు గురువారం చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చారు. వారిని ఇంటికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు స్కార్పియోలో చెన్నై వెళ్లారు. తిరిగి వస్తుండగా కల్లూరు ఘాట్ రోడ్డులో వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న కోనేటి వెంకటమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రెడ్డివారిపల్లెకు చెందిన మేకల చంటి, మేకల వెంకట్రమణ (45), మేకల లక్ష్మిదేవి (40), డ్రైవర్ షేక్ మాబు (45) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం నుజ్జునుజ్జు అయింది. వెంకటమ్మ మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన వెంకటమ్మ సంతోషంగా స్వగ్రామానికి వస్తూ మార్గమధ్యంలో మృతిచెందడతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కల్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.