సాక్షి, సూర్యాపేట: ప్రమాదవశాత్తూ నాగార్జున సాగర్ ఎడుమ కాల్వలో దూసుకుపోయిన స్కార్పియో వాహనాన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఎనిమిది గంటల పాటు శ్రమించి శనివారం మధ్యాహ్నం వెలికితీశారు. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల వద్ద స్కార్పియో వాహహం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా వెలికితీసిన వాహనంలోనే ఆరు మృతదేహాలు కూడా ఉండటంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా భోరున విలపించారు. దాంతో ఘటనా స్థలంలో తీవ్ర విషాదం నెలకొంది.
కాగా ఈసీఐఎల్‌లోని అంకుర ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్ వివాహానికి శుక్రవారం ఉదయం వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. మృతులు అబ్దుల్ అజిత్ (45), రాజేష్ 29), జాన్సన్ (33), సంతోష్ కుమార్ (23),నగేష్ (35) పవన్ కుమార్ (23)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
చదవండి: సాగర్‌లోకి స్కార్పియో..ఆరుగురు గల్లంతు
Comments
Please login to add a commentAdd a comment