sagar left canel
-
సాగర్ కాల్వ నుంచి స్కార్పియో వెలికితీత
-
సాగర్ కాల్వ నుంచి స్కార్పియో వెలికితీత
సాక్షి, సూర్యాపేట: ప్రమాదవశాత్తూ నాగార్జున సాగర్ ఎడుమ కాల్వలో దూసుకుపోయిన స్కార్పియో వాహనాన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎనిమిది గంటల పాటు శ్రమించి శనివారం మధ్యాహ్నం వెలికితీశారు. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల వద్ద స్కార్పియో వాహహం అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా వెలికితీసిన వాహనంలోనే ఆరు మృతదేహాలు కూడా ఉండటంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా భోరున విలపించారు. దాంతో ఘటనా స్థలంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా ఈసీఐఎల్‌లోని అంకుర ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్ వివాహానికి శుక్రవారం ఉదయం వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. మృతులు అబ్దుల్ అజిత్ (45), రాజేష్ 29), జాన్సన్ (33), సంతోష్ కుమార్ (23),నగేష్ (35) పవన్ కుమార్ (23)గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చదవండి: సాగర్‌లోకి స్కార్పియో..ఆరుగురు గల్లంతు -
సాగర్‌లోకి దూసుకెళ్లిన స్కార్పియో..
-
సాగర్‌లోకి స్కార్పియో..ఆరుగురు గల్లంతు
సాక్షి, సూర్యాపేట: కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం (ఏపీ31 బిపి 338) అదుపుతప్పి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో కి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు హైదరాబాద్ వాసులు గల్లంతయ్యారు. ఆస్పత్రిలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న విమలకొండ మహేశ్ వివాహానికి శుక్రవారం ఉదయం వీరంతా రెండు వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా స్కార్పియో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గల్లంతయిన వారంతా ఈసీఐఎల్‌లోని అంకుర ఆస్పత్రి ఉద్యోగులు అని తెలిసింది. గల్లంతయినవారిలో అబ్దుల్ అజిత్ (45), రాజేష్ 29), జాన్సన్ (33), సంతోష్ కుమార్ (23),నగేష్ (35) పవన్ కుమార్ (23) ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకుని పోలీసులు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గల్లంతయినవారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంకుర ఆస్పత్రి వద్ద విషాదఛాయలు దుర్ఘటన విషయం తెలుసుకుని గల్లంతయిన వారి కుటుంబ సభ్యులు ఆందోళనగా ఆస్పత్రికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం వారంతా హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. స్నేహితులు చూస్తుండగానే.. అదుపుతప్పిన స్కార్పియో వాహనం వెనకున్న ఇన్నోవా వాహనంలో ఆస్పత్రిలో పనిచేస్తున్న మరో నలుగురు సహోద్యోగులు ఉన్నారు. వీరంతా చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో స్కార్పియో వాహనం అదుపుతప్పి కాల్వలో పడిపోయినట్లు వారు ఆస్పత్రికి సమాచారం అందించారు. ఈ సమయంలో భారీ వర్షం పడుతుందని తెలిపారు. -
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తుమ్మల
నేలకొండపల్లి(ఖమ్మం): ఖమ్మం జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పాలేరు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం- జక్కిపల్లి గ్రామాల మధ్య సాగర్ ఎడమ కాలువ పై రూ. 60 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జీని మంత్రి తుమ్మల ప్రారంభించారు. అనంతరం మోటపల్లిలో 3500 ఎకరాలు సాగుబడి అయ్యే అయితు ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్‌బాబు ఉన్నారు.