ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇటీవల పశువుల ప్రదర్శన (సంత) నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు యూపీతో పాటు నాలుగు రాష్ట్రాల నుంచి పశువులు ముజఫర్ నగర్‌లోని సంతకు చేరుకున్నాయి. అయితే ఈ సంతలో అందరి చూపు ఓ దున్నపోతుపై పడింది. అక్కడ జరగుతున్న సంతలో ప్రధాన ఆకర్షణగా అదే నిలిచింది. సంతకు హాజరైన ప్రతీ ఒక్కరూ దానితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇంతకీ ఆ దున్నపోతు ఎందుకంత ప్రత్యేకమంటే?
దీని ధర రూ.10 కోట్లు
సంతలో అందరి చూపును ఆకట్టుకున్న ఈ దున్నపోతు పేరు ఘోలు. బాహుబలి సినిమాలో ఉండే ఎద్దుకి ఏ మాత్రం తీసిపోన్నట్లు కనిపిస్తుంది. గురువారం జరిగిన జంతు సంతలో పానిపట్ నుంచి తీసుకొచ్చిన ఈ దున్నపోతు ముర్రా జాతికి చెందినది. ఈ ప్రత్యేక జాతి దున్నపోతు ధర రూ.10 కోట్లు పలుకుతోందట.
16 క్వింటాళ్ల బరువున్న దీన్ని హర్యానాలోని పానిపట్ నుంచి ముజఫర్‌నగర్‌లోని పశువుల సంతకు తీసుకొచ్చారు. ఇది పద్మశ్రీ అవార్డు పొందిన పానిపట్‌లోని దిద్వాడి గ్రామ నివాసి నరేంద్ర సింగ్‌కు చెందినది. ఘోలుకు రోజుకు 10 కిలోల వరకు మేత తింటుందట. ముజఫర్ నగర్ పశువుల ప్రదర్శనకు చేరిన ఈ దున్నపోతు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ దున్నపోతు యజమాని దీని ఆహారంతో పాటు, దాని ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment