Searching Porn On The Internet In Uttar Pradesh? Uttar Pradesh Police Will Now Monitor And Send Messages To Internet Users - Sakshi
Sakshi News home page

పోర్న్‌ చూస్తున్నారా?.. మెసేజ్‌ వస్తుంది!

Published Wed, Feb 17 2021 5:59 PM | Last Updated on Wed, Feb 17 2021 9:39 PM

Police To Monitor People Internet Search History To Know Who Watching Obscene Videos - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో : ఇంటర్‌నెట్‌లో పోర్న్‌ వీడియోలు చూసే వారిపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు నిఘా పెట్టనున్నారు. ఇకపై ఎవరైనా పోర్న్‌కు సంబంధించిన విషయాలను ఇంటర్‌నెట్‌లో సెర్చ్‌ చేస్తే ‘యూపీ ఉమెన్‌ పవర్‌లైన్‌ 1090’కు అలర్ట్‌ వెళ్లిపోతుంది. దీంతో 1090నుంచి సదరు వ్యక్తికి అవగాహాన కల్పించే విధంగా ఓ మెసేజ్‌ వస్తుంది. ఆరు జిల్లాల్లో విజయవంతమైన ఈ ప్రాజెక్టుకు ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ( దిశ రవికి మద్దతుగా యువత వినూత్న నిరసన )

దీనిపై ఏడీజీ నీరా రావత్‌ మాట్లాడుతూ.. ‘‘ ఇంటర్‌నెట్‌ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో మహిళలపై నేరాలు అరికట్టడానికి 1090 దోహదపడుతుంది. డేటా యూసేజ్‌ ఆధారంగా ప్రజలు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారన్న దానిపై ఓ కన్నేసి ఉంచుతున్నాం. ఎవరైనా పోర్న్‌కు సంబంధించిన విషయాలు సెర్చ్‌ చేస్తే 1090కు సమాచారం అందుతుంది. వారికి అవగాహన కల్పించే విధంగా ఓ మెసేజ్‌ వెళుతుంది. వారి డేటా పోలీసులు, 1090 వద్ద నిక్షిప్తమై ఉంటుంది‌’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement