ఓ సింహం. దున్నపోతును వెంటాడింది. దాని నుంచి తప్పించుకోవడానికి ఆ దున్న పరుగెత్తుతూ.. నీటికుంటలోకి దూకింది. హమ్మయ్యా! ప్రాణాలు గట్టెక్కినట్టే అనుకొని ప్రశాంతంగా ఈదసాగింది. కానీ గాశారం బాగలేకుంటే అరటిపండు తిన్నా.. పళ్లు ఇరుగుతాయన్నట్లు.. ఆ దున్నకు మరో జఠిల సమస్య ఎదురైంది. సింహం నుంచి గట్టెక్కాంరా! నాయనా! అనుకుంటే మొసళ్లు దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇదెక్కడి గోలరో నాయనా! అనుకుంటు ఆ దున్న వాటితో పోరాటం చేసింది. వాటిపైకి తిరగబడింది. ‘దీనమ్మా జీవితం... ఈ నీళ్ల కుంట కన్నా ఆ భూమి మీదికి వెళ్లడమే నయంరా! బాబూ..’ అనుకుంటూ ఎలాగోలా అందులో నుంచి బయటపడింది. కానీ అక్కడ సీన్ రివర్స్.. ఒక్క సింహం.. కాస్త రెండు, మూడు, నాలుగు సింహాలు ఇలా.. పెద్ద గుంపే అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు.. కొద్ది సేపు ఆగి.. ‘ఇక లాభం లేదు.. తిరగబడాల్సిందే’ అనుకుంది ఆ సింహాలపై ఎదురు దాడికి దిగింది. వాటిని కొద్ది దూరం పరుగెత్తించింది. ఈ గ్యాప్‌లో పరుగు లక్కించుకొని.. ఐకమత్యమే మహాబలం అన్నట్లు.. తన మిత్రులను గుంపు గుంపులుగా తీసుకొచ్చింది. సింహాలు వర్సెస్ దున్నలు అన్నట్లు సీన్ మారింది. దున్నల గుంపులను చూసిన సింహాలు భయంతో పరుగు లంకించుకున్నాయి..! సమస్పూర్తితో పోరాటం చేసి ఆ దున్న ప్రాణాలను కాపాడుకుంది. ఈ వీడియో చూడటానికి ఎంతో స్పూర్తిదాయకంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
తిరగబడిన దున్నపోతు.!
Published Wed, Apr 17 2019 3:43 PM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM
Advertisement
Advertisement
Advertisement