బర్రెను చూసి సింహం తుర్రుమంది!
అడవికి ఓ న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ప్రకారం అడవికి రాజు సింహం. దానిని చూసి అన్నీ జంతువులు భయపడాల్సిందే. ఎదైనా జంతువు ఎదురుతిరిగి నువ్వెంత అని కొమ్ములు ఎగరేస్తే.. సింహం తన పంజా విసురుతుంది. ఎదురుగా జంతువు కనిపిస్తేనే దానికి ఆహారంగా మారిపోతుంది. అలాంటిది ఎదురుతిరిగితే బతికి బయటపడగలదా? కానీ ఇక్కడ మాత్రం ఆటవిక న్యాయం తిరగబడింది.
బర్రె (గెదే)ను చూసి ఆడ సింహం ఒకటి భయపడింది. గెదే మీదకు ఉరికొస్తుంటే.. సింహం బెదిరి పోరిపోయింది. ఆ సింహాన్ని వెంటాడి మరీ గెదే తరిమేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని గిర్ అడవిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన నాటకీయ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
#WACTH Law of the jungle turns - dramatic visuals of a buffalo chasing a lioness into the wild in Gir Forest (Guj)https://t.co/JuKJnQPG4X
— ANI (@ANI_news) June 5, 2016