వైరల్‌ : అడ్డుతప్పుకున్న ఆడ సింహం..! | Lioness And Her Cubs Give A Way To Biker At Gir Sanctuary In Gujarat | Sakshi
Sakshi News home page

వైరల్‌ : అడ్డుతప్పుకున్న ఆడ సింహం..!

Published Mon, Feb 3 2020 5:16 PM | Last Updated on Mon, Feb 3 2020 6:16 PM

Lioness And Her Cubs Give A Way To Biker At Gir Sanctuary In Gujarat - Sakshi

అహ్మదాబాద్‌ : మనిషికి జంతువులకు ఉన్న ప్రధాన తేడా విచక్షణ..! అందువల్లే ఏది మంచి, ఏది చెడు అని మనుషులు ఆలోచించగలుగుతారు. కానీ, నేటి (అ)నాగరిక పోకడలు మనిషి ప్రవర్తన పశువులా మారిందనడానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. నేరాలు-ఘోరాల సంగతి అంటుంచితే.. కనీసం రోడ్డు భద్రతా నియమాలు కూడా మనకు బరువేనని రుజువు చేస్తాయి. అయితే, గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో వెలుగుచూసిన ఓ అరుదైన దృశ్యం మాత్రం క్రూర జంతువులు కూడా విచక్షణతో మసలుకుంటాయని నిరూపించింది.

రెండు పిల్లలతో కలిసి అడవిలో వెళ్తున్న ఓ ఆడ సింహం.. అదే తోవలో బైక్‌పై ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తికి అడ్డు తప్పుకుని దారిచ్చింది. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రాజ్యసభ ఎంపీ పరిమల్‌ నాథ్వాని దీని గురించి చెప్తూ.. ‘ఈ వైరల్‌ వీడియో చూడండి. పిల్లలతో కలిసి అడవిలో వెళ్తున్న ఓ ఆడసింహం.. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై రావడంతో దారి ఇచ్చింది. మనుషుల జీవన విధానానికి జంతువులెప్పుడూ ప్రాధాన్యం ఇస్తాయి. ఇదెంతో అద్భుతంగా ఉంది ’అని క్యాప్షన్‌ జోడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement