అహ్మదాబాద్ : బోన్‌లో ఉన్న సింహాం దగ్గరకు వెళ్లాలంటేనే గజ్జున వణుకుతాం.. అలాంటిది ఓ వ్యక్తి ఆ సింహాతోనే ఓ ఆట ఆడాడు. ఇంట్లో పెంపుడు కుక్కతో ఆడుకున్నట్టు సదరు వ్యక్తి సింహంతో ఆడుకున్నాడు. పైగా అదేమన్న పెంపుడు సింహామా అంటే అదికాదు.. సింహాలకు కేరాఫ్ అడ్రసైన గుజరాత్ గిర్ ఫారెస్ట్ మృగరాజది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి ఏంచక్కా కుర్చీలో కూర్చోని.. చేతిలో ఓ కోడిపిల్లను పట్టుకోని.. సింహానికి ఎరగా ఆశ చూపిస్తూ.. వెనక్కు ముందు జరుపుతూ.. ఓ ఆట ఆడాడు. ఆకలితో ఉన్న ఆ మృగరాజు ఆ వ్యక్తి చేతిలో కోడిని లటుక్కునందుకోని గుటుక్కుమంది. ఇక ఇలాంటి ఘటనలు ఇదే తొలిసారేం కాదు. ఇదే తరహా వీడియో గతంలో కూడా వైరల్ అయింది. అప్పట్లో ఆ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దానికి సంబంధించిన ఏడుగురిపై చర్యలు కూడా తీసుకున్నారు.
ఇక గతనెలలో గిర్ అడవుల్లో వైరస్ సోకి 23 సింహాలు మరణించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో మేలుకున్న ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి. ఆనారోగ్యానికి గురైన సింహాలను గుర్తించి చికిత్స అందిస్తున్నాయి. ఈ వ్యవహారంపై గుజరాత్ హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: సీడీవీ వైరస్‌తోనే గిర్ సింహాల మృతి)
Comments
Please login to add a commentAdd a comment