పంది ఆకారంలో పుట్టిన దూడ
సాక్షి, సిరిసిల్లఅర్బన్: రాజన్న సిరిసిల్లా జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. సిరిసిల్ల పరిధిలోని చిన్నబోనాలలో గేదె(బర్రె) కడుపులో పంది ఆకారంలో జంతువు జన్మించింది. దీంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోసుకుల మల్లయ్య అనే రైతు ఆదివారం పశువుల అంగడిలో బాలమల్లు అనే రైతు వద్ద గేదెను కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజే పంది ఆకారంలో ఉన్న దూడకు గేదె జన్మనిచ్చింది. వింత ఆకారంలో ఉన్న దూడను చూసేందుకు జనం తరలివచ్చారు. నెలలు నిండకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని గ్రామస్తులు చర్చించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment