
పూణే: ఒకోసారి ప్రమాదం అనేది ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో అస్సలు ఊహించలేం. ఏమీ చెయ్యకుండా ఇంట్లోనే కూర్చున్నా కూడా అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలతో ఊహించని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక తాజాగా అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. దానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జుబేర్ షేక్ అనే వైద్యుడు తన భార్యతో కలిసి పూణేలోని ఖడ మార్కెట్ ప్రాంతంలో బైక్ మీద వెళ్తున్నాడు.
అదే సమయంలో అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి తన గేదెలను తీసుకెళ్లున్నాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ఊహించని ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. షాపింగ్ పూర్తి చేసుకుని బైక్‌పై వెళ్తున్న వైద్యుడిపైకి ఒక గేదె దూసుకెళ్లి తన కొమ్ములతో దాడి చేసింది. దీంతో బైక్‌పై నుంచి భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు.
ఈ ఘటనలో వైద్యుడు జుబైర్ చేతి వేళ్లు విరిగిపోయాయి. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇదే విషయంపై జుబైర్ దంపతులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆదారంగా విచారణ కొనసాగించారు. రద్దీ ప్రాంతంలోకి గేదెలను తీసుకొచ్చి ప్రమాదానికి కారణమయ్యారంటూ రజాక్, అతడి సోదరులు సదాకత్, నదాఫత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ దంపతులకు నష్ట పరిహారం చెల్లించాలని పోలీసులు రజాక్ మరియు అతని సోదరులకు తెలిపారు. ఇక ఈ సంఘటణకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment