నిద్రిస్తుండగా వేటకొచ్చిన చిరుత..ఆ వీధి కుక్క అతడిని బతికిచ్చింది | Viral Video: Leopard Attacks Stray Dog As Man Sleeps Nearby, | Sakshi
Sakshi News home page

నిద్రిస్తుండగా వేటకొచ్చిన చిరుత..ఆ వీధి కుక్క అతడిని బతికిచ్చింది

Published Fri, May 19 2023 10:08 PM | Last Updated on Sat, May 20 2023 2:44 PM

Viral Video: Leopard Attacks Stray Dog As Man Sleeps Nearby,  - Sakshi

ఓ వ్యక్తి నిద్రిస్తుండగా సడెన్‌గా ఓ చిరుత వచ్చింది. ఇక ఆ వ్యక్తి వద్దకు వచ్చి అటాక్‌ చేస్తుందేమో అన్న సమయంలో సమీపంలో ఓ వీధి కుక్క కనిపించింది. అంతే సడెన్‌గా చిరుత దృష్టి దానిపై పడింది. దీంతో నేరుగా ఆ కుక్క వద్దకు వచ్చి దాడి చేసి ఈడ్చుకెళ్లిపోయింది. ఈ అలికిడికి మెలుకువ వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా బిక్కచచిపోతాడు. ఆ కుక్క గనుక అక్కడ లేకపోతే ఆ చిరుత నోట అతను ఉండేవాడు. అదృష్టం బావుంది కాబట్టి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఆ వ్యక్తి.

ఈ షాకింగ్‌ ఘటన పుణేలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి సుశాంత్‌ నంద సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. అటవీ ప్రాంతాలను అభివృద్ధి పేరుతో నాశనం చేయడంతో ఇలా వన్యమృగాలు మానవ ఆవాసాల్లోకి చొరబడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు పలువురు చెబుతున్నారు .

(చదవండి: ఇలా కూడా బరువు తగ్గొచ్చా! విమానంలో వెళ్లాలని..ట్వీట్‌ వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement