Youngest Mountaineer to Climb Mount Everest: ముంబైకి చెందిన రిథమ్ మమానియా అనే 10 ఏళ్ల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఈ నెల ప్రారంభంలో ఉత్కంఠభరితమైన ఫీట్ సాధించిన భారతీయ పర్వతారోహకులలో ఒకరిగా ఆ బాలిక నిలిచింది. ఆమె సబర్బన్ బాంద్రాలోని ఎంఈటీ రిషికుల్ విద్యాలయంలో ఐదవ తరగతి చదువుతోంది. రిథమ్ మే 6న సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న నేపాల్‌లోని సౌత్ బేస్ క్యాంప్‌కు చేరుకుంది.
11 రోజుల పాటు సాగిన యాత్ర బేస్‌క్యాంప్‌కు చేరుకోవడంతో విజయవంతంగా పూర్తయింది. అత్యంత కష్టతరమైన దుర్భేద్యమైన పర్వతమే కాకుండా కఠినతరమైన వాతవరణ పరిస్థితులు తట్టుకుని అధిరోహించే సాహసయాత్ర అయినప్పటికీ ఇవేమి ఆమె లక్ష్యాన్ని నిలువరించలేకపోయాయి. ఐతే రిథమ్ బేస్‌క్యాంప్‌కి చేరుకున్న తర్వాత ఆమెతోపాటు పాల్గొన్న ఇతర సభ్యలు విమానంలో తిరిగి వెళ్లేలని నిర్ణయించుకుంటే ఆమె మాత్రం నడచే వెళ్తానని పట్టుబట్టడం విశేషం.
ఈ మేరకు ఆమె మాట్లాడుతూ... "తొలిసారిగా కాలినడకన దూద్ సాగర్ ట్రెక్కింగ్‌ని విజయవంతం పూర్తి చేశాను. తదనంతరం సహ్యాద్రి పర్వత శ్రేణులలో కర్నాలా, లోహగడ్, మహులి కోటలతో సహా కొన్ని శిఖరాలను అధిరోహించాను. అంతేకాదు ఈ ట్రెక్కింగ్ బాధ్యయుతమైన ట్రెక్కర్‌గా పర్వత వ్యర్థాల నిర్వహణ సమస్యను పరిష్కరించడం ఎంత ముఖ్యమో నేర్పింది" అంటూ చెప్పుకొచ్చింది.
(చదవండి: మోదీని సర్‌ప్రైజ్ చేసిన బాలుడు.. ఆశ్యర్యపోయిన ప్రధాని)
Comments
Please login to add a commentAdd a comment