Garage
-
ఇది కదా.. ఇంజినీరింగ్ అంటే
-
గుడివాడ బస్టాండ్ డిపో గ్యారేజ్ ప్రారంభం
-
ఆ చిన్నారి వెంటనే స్పందించకపోయి ఉంటే.. పాపం ఆ తల్లి...
అనుకోని ప్రమాదంలో పడితే పిల్లలను తల్లిదండ్రులు కాపాడుకోవడం అనేది సర్వసాధారణం. కానీ పెద్దలే అనుకోని ప్రమాదం భారిన పడి..నిస్సహాయ స్థితిలో ఉంటే ఆ సమయంలో పిల్లలు తమకు తోచిన విధంగా చేసి తల్లిదండ్రులను కాపాడటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అబ్బా మనల్ని రక్షించేంత పెద్దవాళ్ల అయిపోయారంటూ తెగ మురిసిపోతాం. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఇక్కడొక తల్లి ఒక నిచ్చెనపై నుంచుని గ్యారేజీ తలుపును రిపైర్ చేస్తోంది. ఐతే అనుకోకుండా నిచ్చెన అకస్మాత్తుగా కింద పడిపోతుంది. దీంతో తల్లి ఆ గ్యారెజ్ తలుపుకు వేలాడుతూ ఉంటుంది. పాపాం హెల్ప్ ..హెల్ప్ అంటూ అరుస్తుంది. పక్కనే ఉన్న చిన్నారి వెంటనే అక్కడ ఉన్న నిచ్చెనను ఏదో రకంగా తన చిట్టి చేతులతో లేపేందుకు ప్రయత్నించి తన తల్లి వేలాడుతున్న దగ్గర పెడతాదు. దీంతో ఆ తల్లి నిచ్చెన సాయంతో నెమ్మదిగా దిగిపోతుంది. అందుకు సంబంధించిన ఘటనను ఐపీఎస్ ఆఫీసర్ దీపాంషు కబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: బ్రహ్మపుత్ర నదిలో ఈత కొడుతూ వస్తున్న పులి..షాక్‌లో ప్రజలు) माँ गैराज का दरवाज़ा रिपेयर कर रहीं थी कि तभी उनकी सीढ़ी गिर गयी. माँ ऊपर लटके देख नन्हे जांबाज़ ने पूरी जान लगाकर सीढ़ी को वापस लगाकर उनक़ी मदद क़ी... इस छोटे बच्चे क़ी सूझ-बूझ और हिम्मत क़ी जितनी प्रशांसा क़ी जाए कम है. pic.twitter.com/GjX6Ol3pid — Dipanshu Kabra (@ipskabra) December 23, 2022 -
ఇల్లు లేక గ్యారేజీలో నిద్రించిన ప్రపంచ కోటీశ్వరుడి తల్లి
లండన్: టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓ, ప్రపంచ కుబేరుడు అయిన ఎలాన్ మస్క్ తల్లి మే మస్క్(74) ఇటీవల ఒక గ్యారేజీలో నిద్రించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె ‘ద సండే టైమ్స్’ పత్రికతో పంచుకున్నారు. కుమారుడు ఎలాన్ మస్క్‌ను కలిసేందుకు స్పేస్ ఎక్స్ ప్రధాన కార్యాలయం ఉన్న అమెరికాలోని టెక్సాస్‌కు వెళ్లాలని, అక్కడికి సమీపంలోని ఇల్లేమీ లేదని, అందుకే ఒక గ్యారేజీలో నిద్రించానని తెలిపారు. అంగారక గ్రహంపైకి వెళ్లాలన్న కోరిక తనకు లేదని పేర్కొన్నారు. తనకు సొంత ఇల్లు లేదని ఎలాన్ మస్క్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: (పాక్ వరదలకు మరో 119 మంది బలి) -
బుల్లెట్ గ్యారేజ్.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును!
సాక్షి,విజయనగరం: నీ బుల్లెట్ బండెక్కి వచ్చేతప్పా.. డుగ్గు.. డుగ్గు...డుగ్గు.. డుగ్గని.. అందాల దునీయాను చూపించప్పా.. చిక్కుచిక్కు చిక్కుని.. చిక్కుబుక్కని.. అంటూ ఇటీవల అందరినీ అలరించిన ఈ పాట వింటే చాలు గుర్తుకు వచ్చేది రోయల్ ఎన్ఫీల్డ్ బండి. రెండు దశాబ్దాలకు పూర్వం స్టేటస్ సింబల్‌గా భావించే ఈ రెండు చక్రాల వాహనం డుగ్గు... డుగ్గు అంటూ నడిపితే ఆ రాజసమే వేరు. పూర్వం గ్రామాల్లో సర్పంచ్‌లు.. నాయుడులు వాడే ఈ వాహనం అన్ని వర్గాల ప్రజల మనుసుదోచుకుంటుంది. ఇంతటి చరిత్ర ఉన్న బుల్లెట్ బండికి రిపేర్వస్తే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఠక్కున గుర్తుకు వచ్చేది ఈశ్వరరావు పేరే. చిన్నపాటి మరమ్మతు నుంచి ఇంజిన్రిపేర్ వరకు ఆయన చేయి పడనిదే బండి రోడెక్కెని పరిస్థితి. అందుకే.. విజయనగరం నడిబొడ్డున గల మహాకవి గురజాడ అప్పారావు కూడలిలోని ఆయన చిన్నపాటి చెక్కబడ్డీ ముందు బుల్లెట్ బైక్‌లు క్యూ కడతాయి. అన్నీ సర్వీసింగ్ కోసమే వచ్చినవే. వాటిని రిపేర్ చేసే వ్యక్తి మాత్రం 7వ తరగతి వరకే చదివి.. మెకానిక్‌లో ఇంజినీరింగ్ ప్రావీణ్యం సంపాదించిన కోరాడ వీధికి చెందిన గొలుసు ఈశ్వరరావు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన చిన్నతనంలో బైక్ మైకానిక్ వృత్తిని ఎంచుకున్నారు. మొదటిగా బ్రహ్మాజీ అనే గురువు వద్ద ద్విచక్ర వాహనాల మరమ్మతులు చేయడంలో శిక్షణ పొందారు. అనంతరం గాంధీ గురువు వద్ద రోయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లు రిపేర్లు చేయడం నేర్చుకున్నారు. నమ్మిన వృత్తిని ఇష్టంగా భావించిన ఆయన ఆ రంగంలో తనకు వేరెవ్వరు సాటిలేరన్నంత నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు ఆయన గ్యారేజ్ వద్ద పదుల సంఖ్యలో ఎన్ఫీల్డ్ వాహనాలకు రిపేర్లు చేస్తూ వాహన చోదకుల మన్ననలు పొందుతున్నారు. శబ్దాన్నిబట్టి సమస్యను గుర్తించేంత నైపుణ్యం.. ఈశ్వరరావు తన గురువు గాంధీ వద్ద నేర్చుకున్న బుల్లెట్ వాహనాల రిపేర్ల వృత్తిని వ్యక్తిగత ఉపాధిగా మలచుకున్నారు. 2000 సంవత్సరం నుంచి చిన్నపాటి గ్యారేజీ ప్రారంభించి బుల్లెట్లకు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎన్ఫీల్డ్ బైక్‌లు అరకొరగా ఉన్న రోజుల్లో... మేడిన్ ఇంగ్లాడ్ పేరిట అప్పట్లో వాడే 1965, 1975, 1985 మోడల్ వాహనాలకు రిపేర్ చేయడంలో మంచి పరిణితి పొందిన మెకానిక్‌గా గుర్తింపు సాధించారు. బుల్లెట్ శబ్దాన్ని బట్టి సమస్యను గుర్తించేంత విజ్ఞానం ఈశ్వరరావు సొంతం. అందుకే.. బుల్లెట్లో ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా ఆయన గ్యారేజ్‌కు తెస్తారు. ఎన్ఫీల్డ్ వాహనంలో మార్పులు చోటు చేసుకుని నేటితరాన్ని ఆకట్టుకునే మోడళ్లు రావడం, వాహనాల సంఖ్య పెరగడంతో ఆయనకు ప్రతిరోజూ చేతినిండా పనిదొరుకుతోంది. మరో నలుగురు కుర్రాళ్లకు ఉపాధి చూపుతున్నారు. నా గురువులు బ్రాహ్మాజీ, గాంధీలు నేర్పించిన విద్యతో నేడు నేను ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురు కుర్రాళ్లకి ఉపాధి కల్పిస్తున్నాను. అప్పట్లో ఊరికో ఎన్ఫీల్డ్ బండి ఉండేది. రోజుకో, రెండు రోజులుకో ఒక బండి షెడ్‌కి వచ్చేది. దానికి మరమ్మతులు చేసే వాడిని. ప్రస్తుతం రోయల్ ఎన్ఫీల్డ్ వాహనాల సంఖ్య పెరిగింది. రోజుకు పదుల సంఖ్యలో వాహనాలు షెడ్‌కు వస్తున్నాయి. జనరల్ సర్వీసు అయితే గంటలో చేసిస్తాం. అదే ఇంజిన్ మరమ్మతులు అయితే రెండు, మూడు రోజుల సమయం తీసుకుంటాం. – గొలుసు ఈశ్వరరావు, రోయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్, విజయనగరం చదవండి: నిర్మల ఆత్మహత్య చేసుకుందా.. లేక హత్య చేశారా? -
బెజవాడలో ఫేమస్.. రామకృష్ణ బుల్లెట్ గ్యారేజ్
‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డూ.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండూ..’, ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గని’.. ఇటీవల బాగా ట్రెండ్ అయిన ఈ పాటలు యువతనే కాదు.. వృద్ధులను సైతం ఉర్రూతలూగించాయి. బుల్లెట్టు బండిపై ఉన్న క్రేజ్‌ను రచయితలు అలా తమ పాటలలో వినియోగించుకున్నారు. గతంలో రాయల్ ఎన్ఫీల్డ్æ ఇంటిముందు ఉంటే అదో స్టేటస్ సింబల్. దానిని నడిపే వారు రాజసంగా ఫీలయ్యేవారు. మరి అలాంటి బండికి సుస్తీ చేస్తే.. అదేనండి రిపేరు వస్తే! వాటి యజమానులకు ఠక్కున గుర్తుకొచ్చేది బెజవాడ రామకృష్ణ పేరే. ఆయన తర్వాతే మరే మెకానిక్ అయినా. ఒకటి కాదు, రెండు కాదు ఐదు దశాబ్దాలకు పైగా ‘బుల్లెట్ డాక్టర్’గా ఎన్నో బండ్లకు కొత్త ఊపిరి పోశారు. గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): బందరు లాకుల సెంటర్.. రోడ్డు పక్కన రెండు గదులుండే చిన్నపాటి రేకుల షెడ్డు.. దాని ముందు ఓ తాటాకుల పాక.. అందులో పదుల సంఖ్యలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు. అదేదో బుల్లెట్ బండ్ల షోరూం కాదు. ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ అంతకన్నా కాదు. 63 ఏళ్ల పెద్దాయన నడిపే గ్యారేజి అది. 54 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉంటూ.. అనేకమందికి తర్ఫీదునిస్తూ బుల్లెట్ మరమ్మతులకు కేరాఫ్‌గా మారారు పి. రామకృష్ణ. రామకృష్ణ.. కేరాఫ్ కంకిపాడు కంకిపాడుకు చెందిన రామకృష్ణ 1968లో గవర్నర్‌పేట గోపాల్‌రెడ్డి రోడ్డులోని ఓ గ్యారేజిలో మెకానిక్‌గా జీవితం ప్రారంభించారు. 1977లో సొంతంగా తానే బందరు లాకుల వద్ద షెడ్డు నెలకొల్పారు. అప్పటి నుంచి నేటి వరకు అదే పాకలో పనిచేస్తున్నారు. బుల్లెట్ వాహనాలకు మాత్రమే మరమ్మతులు, సర్వీసింగ్ చేయడం ఆయన ప్రత్యేకత. ఆ విధంగా రామకృష్ణ ‘బుల్లెట్ వైద్యుడు’గా పేరు తెచ్చుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాడే వారికి రామకృష్ణ సుపరిచితులే. తమ బండికి ఆయన మరమ్మతు చేస్తే నిశ్చింతగా ఉండొచ్చని వాటి యజమానుల నమ్మకం. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా వాహనాలను రామకృష్ణ వద్దకు పంపుతారు. ఈయన వద్ద వందలాది మంది బుల్లెట్ మెకానిజం నేర్చుకున్నారు. ఆయన వద్ద నలభై ఏళ్లకు పైగా పనిచేస్తున్న మెకానిక్‌లు ఉన్నారు. ఏడేళ్ల వయసులో బుల్లెట్ సౌండ్ విని.. ‘ఏడేళ్ల వయసులో బుల్లెట్ సౌండ్ విన్నాను. ప్రొద్దుటూరుకు చెందిన జంపారెడ్డి అనే ఉపాధ్యాయుడు కంకిపాడుకు బుల్లెట్‌పై వచ్చి కాఫీ తాగి, పేపర్ చదివి వెళ్లేవారు. ఆయన బుల్లెట్ స్టార్ట్ చేయడం, కిక్ కొట్టడం చూసి ఎంతో ముచ్చట పడేవాడిని. ఆ విధంగా బుల్లెట్ అంటే ప్రేమ పెరిగింది. బుల్లెట్ మెకానిక్ అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నా. పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగా’ అని రామకృష్ణ గతాన్ని నెమరు వేసుకున్నారు. ఏపీడబ్ల్యూ 6988 నంబర్‌తో 1964లో రిజిస్టర్ అయిన బుల్లెట్, ఏపీడబ్ల్యూ 9332 నంబర్‌తో 1968లో రిజిస్టరైన మరో బుల్లెట్ రామకృష్ణ సొంతం. ఆ రెండు బుల్లెట్లు ఇప్పటికీ కండిషన్లో ఉన్నాయి. 1971 నాటి మోడల్ కేబీఆర్ 99 కస్టమర్ బుల్లెట్‌కు ఇప్పటికీ ఆయనే సర్వీస్, మరమ్మతులు చేస్తున్నారు. ఇవికాక 1959 నాటి రాయల్ ఎన్ఫీల్డ్ను ఎంతో సుందరంగా తీర్చిదిద్దినట్లు రామకృష్ణ తెలిపారు. తాము చేసేది రిపేర్ కాదని, వాహనానికి ప్రాణం పోస్తామని రామకృష్ణ చెప్పారు. -
ఆరంకెల జీతం వదిలి.. మెకానిక్‌గా మారిన మహిళ
కేబిన్‌లో కూచుని చేసే ఉద్యోగంఆమెకు బోర్ కొట్టింది. కొన్నాళ్లు బండి మీద దేశం తిరిగింది. కొన్నాళ్లు బండ్లు రిపేర్ చేసే ఆటోమొబైల్ రంగంలోపని చేసింది. ఇప్పుడు ఆమె సొంత గ్యారేజ్ తెరిచింది. స్త్రీలు మెకానిక్ గ్యారేజ్‌లు నడపడం అరుదు. కాని చెన్నైకి చెందిన అఫునిసా చౌదరి ఇప్పుడు ‘కారు ఆమె చేతుల్లో పెడితే దిగుల్లేదు’ అనే పేరు సంపాదించుకుంది. కొత్తగా ఏదైనా చేస్తే ఇలాగే పేరొస్తుంది. సాధారణంగా ఏ గ్యారేజ్‌లో అయినా అడ్మినిస్ట్రేషన్‌లో మహిళా ఉద్యోగులు కనిపిస్తుంటారు. గ్యారేజ్ లోపల మాత్రం మగవారిదే రాజ్యం. కాని చెన్నై నీలాంకరి ఏరియాలో ఉన్న ‘మోటర్హెడ్స్’ గ్యారేజ్‌లోకి వెళ్లినప్పుడు మాత్రం గ్యారేజ్ లోపల అఫునిసా చౌదరి మెకానిక్ యూనిఫామ్‌లో కనిపిస్తుంది. ఆమె యూనిఫామ్‌లో లేనప్పుడు మొదటిసారి వచ్చిన కస్టమర్ ఆమెను రిసెప్షనిస్ట్ అని పొరపడుతుంటాడు. ‘నా కారు టెస్ట్ డ్రైవ్‌కి మెకానిక్‌ని పిలుస్తారా’ అన్నప్పుడు ‘పదండి నేనే వస్తాను’ అని అఫునిసా అంటుంది. మోటర్హెడ్స్కు ఆమే అధినేత. అందులో ఆమే మెకానిక్ కూడా. ఉద్యోగం బోర్‌కొట్టి నలభై ఏళ్ల అఫునిసా చౌదరి గతంలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ ర్యాంక్‌లో పని చేసింది. ఆపరేషన్స్ విభాగం చూసేది. క్యాబిన్, దర్జా, మంచి జీతం అన్నీ నడిచేవి. కాని ఆమెకు ఆ ఉద్యోగం బోర్ కొట్టింది. ఆమెకు ఆటోమొబైల్ రంగం అంటే ఇష్టం. ఆమె దగ్గర కొన్ని పాత టూ వీలర్లల కలెక్షన్ ఉంది. ‘బాబీ’ సినిమాలో కనిపించే స్కూటర్ మొదలు ఇప్పుడు కనిపించకుండా పోయిన యమహా ఆర్.ఎక్స్ 135 లాంటి బండ్లు కూడా ఉన్నాయి. యమహా మీద ఆమె తరచూ దూరప్రయాణాలు కూడా చేస్తుంటుంది. ఉన్నచోటే ఉండిపోవడం నా వల్ల కాదు అని పదేళ్ల క్రితం 2010లో ఆ ఉద్యోగం మానేసింది. ఏం చేస్తావు అని ఆ కంపెనీ వాళ్లు అడిగితే కార్ల గురించి తెలుసుకుంటా అని చెప్పిందామె. పదేళ్లు ఆటోమొబైల్ రంగంలో... దేశంలో కార్ల రంగం బాగా వృద్ధి చెందింది. ఒక కొత్త మోడల్ వచ్చేలోపు ఇంకో కొత్త మోడల్ రిలీజ్ అవుతోంది. అన్ని కంపెనీలకు ఆథరైజ్డ్ సర్వీస్ స్టేషన్స్ ఉంటాయి. కాని ఆథరైజ్డ్ సర్వీస్ స్టేషన్లో పెద్దగా చర్చలకు తావుండదు. వారు చెప్పిన ధరలకు చెప్పిన సర్వీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ధరలు ఒక్కోసారి ఎక్కువగా ఉంటాయి కూడా. మారుతి నుంచి మొదలెట్టి బి.ఎం.డబ్లు్య వరకు అన్ని కార్ల యజమానులు మంచి గ్యారేజ్ ఉంటే ఆ వైపు చూడటానికే ఇష్టపడతారు. ‘నా గ్యారేజ్ అలా ఉండాలని నేను పదేళ్లు గ్రౌండ్ వర్క్ చేశాను’ అంటుంది అఫునిసా చౌదరి. ‘పదేళ్లు నేను చాలా గ్యారేజ్‌లను పరిశీలించడంలో గడిపాను. రిపేర్లు, స్పేర్‌పార్ట్‌లు, ఏ కారుకు ఎంత రిపేర్ అవసరం వంటి వివరాలన్నీ తెలుసుకున్నాను. ఇక కారులోని ఎలక్ట్రానిక్స్ది ఒక కీలకవ్యవస్థ. ఆ ఎలక్ట్రానిక్స్ రిపేర్లను చేయడంలో తగిన శిక్షణ కలిగిన మెకానిక్‌లు ఉండాలని తెలుసుకున్నాను. అన్ని సౌకర్యాలను సిద్ధం చేసుకుని మల్టీబ్రాండ్ గ్యారేజ్‌ను 2020లో ప్రారంభించాను’ అంటుంది అఫునిసా. లాక్డౌన్ సవాలు గ్యారేజ్ తెరిచిన వెంటనే అఫునిసాకు ఎదురు దెబ్బ తగిలింది. కరోనా వల్ల చెన్నైలో లాక్డౌన్ వచ్చి మూడు నెలల పాటు మూసేయాల్సి వచ్చింది. ‘ఇది కూడా ఒక విధంగా మంచిదే అయ్యింది. ఉపాధి పొందలేని వర్గాల నుంచి కొంత మంది కుర్రాళ్లను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చేందుకు మేము నిశ్చయించుకున్నాం’ అని అఫునిసా అంటుంది. ఆమెకు ఈ గ్యారేజ్ స్థాపన వెనుక ఒక లక్ష్యం ఉంది. కేవలం దీనిని ఆదాయ వనరుగా కాక దిగువ వర్గాల యువతీ యువకులకు పని నేర్పించి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయాలనేది ఆమె భావన. ‘మేము పని నేర్పించి వారు జీవితంలో స్థిరపడటానికి కావాల్సిన సహాయం కూడా చేస్తాం’ అని అఫునిసా అంది. నోటిమాట ప్రచారం మొదటి లాక్డౌన్ ముగిసి రెండో లాక్డౌన్ వచ్చేలోపు నోటి మాట మీదుగా అఫునిసా గ్యారేజ్ ప్రచారం పొందింది. కస్టమర్లు ఆమె గ్యారేజ్ సేవలను విశ్వసిస్తున్నారు. అన్నింటికి మించి మహిళలను అరుదుగా కనిపించే ఈ రంగంలో ఆమె సమర్థంగా నిలదొక్కుకోవడం వెనుక ఆమెకు ఆ రంగం పట్ల ఉన్న ఆసక్తి, విశేష అనుభవం కారణం అని అర్థం చేసుకున్నారు. ‘క్యాబిన్లో కూచుని చేసే ఉద్యోగంలో లేని థ్రిల్లు ఒక కారులో కనిపించే జటిలమైన సమస్యను రిపేర్ చేసినప్పుడు కలుగుతుంది.’ అంటుంది అఫునిసా. వైట్‌కాలర్ కెరీర్లు చాలానే ఉంటాయి.కాని చేతులకు గ్రీజ్ పూసుకొని పెట్రోల్ వాసనల మధ్య పని చేయడంలో ఒక గొప్ప ఉత్సాహాన్ని పొందుతోంది అఫునిసా. ఆమె కొత్త పనిని ఎంచుకుంది. అందుకే మీరిక్కడ ఆమె గురించి చదువుతున్నారు.కేబిన్‌లో కూచుని అందరిలా ఉద్యోగం చేస్తే ఎందుకు రాస్తారంట. -
రికార్డు కోసం కాదు నా పిల్లల కోసం..
అనిత పుట్టింది పెరిగింది కరీంనగర్లో. ఎనిమిదవ తరగతి నుంచి హైదరాబాద్‌లో అమ్మమ్మగారింట్లో ఉండి చదువుకుంది. ఐటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఆరేళ్ల పాటు ఉద్యోగం చేసింది. రెండవ బిడ్డ పుట్టినప్పుడు కెరీర్లో కొంత విరామం. ఇప్పుడు సొంత గ్యారేజ్ తో కొత్త కెరీర్లో అడుగుపెట్టింది. గ్యారేజ్ అనగానే టైర్లు, రెంచ్‌లు, గ్రీజు అంటిన దుస్తులతో మగవాళ్లు కళ్లముందు మెదలుతారు. మహిళలు ప్రవేశించని రంగం అనడం కంటే మహిళలు పెద్దగా ఇష్టపడని రంగం అనే చెప్పాలి. భుజబలంతో చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. భౌతిక శక్తి సామర్థ్యాలకు పరీక్ష పెట్టే ఈ రంగంలో అడుగుపెట్టడం నిజంగా ఒక సాహసమే. ఆ సాహసాన్ని ఒక సవాల్‌గా స్వీకరించింది అనిత వ్యాల. ఇల్లు అమ్మేశాం! ‘‘విక్టరీ 4 వీల్స్ గ్యారేజ్‌ని 2018లో తమ్ముడు, నేను కలిసి మొదలుపెట్టాం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నాను. యాభై లక్షలతో పూర్తవుతుందని దిగాం. కానీ మేము అనుకున్న స్వరూపం వచ్చేటప్పటికి 90 లక్షలైంది. లోన్ కోసం నెలలపాటు బ్యాంకు చుట్టూ తిరిగి చివరికి మా ఫ్లాట్స్ అమ్మేసి గ్యారేజ్ పెట్టాం. నలుగురు ఉద్యోగులతో మొదలైన గ్యారేజ్‌లో ఇప్పుడు నాతో కలిసి పన్నెండు మందిమి పని చేస్తున్నాం. మహిళ అయిన కారణంగా ఎదురయ్యే ఇబ్బందులేమీ లేవు. కానీ వర్కర్స్ జాప్యం చేస్తున్నట్లు, మహిళను కావడంతోనే పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారేమో అనిపించేది. అయితే వాళ్ల సమాధానం విన్న తర్వాత పని ఆలస్యం కావడానికి కారణం సహేతుకంగానే అనిపించేది. పాప లక్ష్యం మెడిసిన్ పిల్లల కోసం సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసిన తరవాత గ్యారేజ్ పెట్టడానికి మధ్య కొంతకాలం ట్యూషన్లు చెప్పాను. ట్యూషన్లతో వచ్చే రాబడితో హాయిగానే ఉండేది. అయితే మా పాప లక్ష్యం మెడిసిన్. సీటు తెచ్చుకోవడం ఆమె లక్ష్యం. ఫీజులు కట్టడానికి తగినట్లు నా ఇన్‌కమ్‌ను పెంచుకోవడం నా లక్ష్యం అయింది. అందుకే పని చేయగలిగిన వయసులోనే కన్‌స్ట్రక్టివ్‌గా ఏదో ఒక బిజినెస్‌లోకి అడుగుపెట్టి స్థిరపడాలనుకున్నాను. అంతే తప్ప నేను రికార్డు సాధించడం కోసం పిల్లల భవిష్యత్తు మీద ప్రయోగం చేసే పరిస్థితి కాదు. తమ్ముడి సూచన మా తమ్ముడికి టాటా డీలర్షిప్ వర్క్‌షాపులో పదహారేళ్ల అనుభవం ఉంది. మల్టీ బ్రాండ్ కార్ సర్వీసింగ్ సెంటర్‡గురించి చెప్పాడు. అలా ఈ రంగంలోకి వచ్చాను. ఇందులో ప్రతిదీ పనిలోకి దిగిన తర్వాత నేర్చుకున్నదే. కారు డీప్ ఇంటీరియర్ క్లీనింగ్, ఇన్సైడ్ వ్యాక్యూమింగ్, కెమికల్ క్లీనింగ్, ఫోమ్ వాషింగ్, ఫాగ్ మెషీన్ శానిటైజేషన్ వంటి పనులన్నీ చేస్తాను. సమస్యలుంటాయని చెప్పడానికి... ‘దిగితేనే లోతు తెలుస్తుంది’ అంటారు. నేనయితే ‘దిగితే ఈత దానంతట అదే వస్తుంది’ అంటాను. ఇందులో పదిమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఒకసారి మా గ్యారేజ్‌కి వచ్చిన కస్టమర్లు ఆ తర్వాత నుంచి కొనసాగుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే మహిళల విషయంలో కారు సర్వీస్‌కి కూడా వాళ్లే రావాల్సి ఉంటుంది. మగవాళ్లు నిర్వహించే గ్యారేజ్‌లో కంటే మా దగ్గర సౌకర్యంగా ఫీలవుతున్నారు మహిళలు. నేను ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు గ్యారేజ్‌లో ఉంటాను. ఒక్కోసారి అర్జంట్‌గా పని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పన్నెండు గంటల వరకు కూడా గ్యారేజ్‌లో ఉండాల్సి వస్తుంది. అమ్మాయిలూ రెంచ్ పట్టుకోండి! ఒకప్పుడు మెకానిక్ అంటే సమాజం తక్కువ గా చూసేది. అలా చూడడం వల్లనే కావచ్చు ఇప్పుడు ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. పైగా ఇప్పుడు మెకానిక్ వృత్తికి గౌరవం పెరిగింది కూడా. కాబట్టి అమ్మాయిలకు ఇది మంచి అవకాశం. ఈ రంగంలో కెరీర్ డెవలప్ చేసుకోవాలనుకునే అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి నిపుణులుగా తయారు చేస్తాను. ఈ కాలంలో టూ వీలర్ నడిపే అమ్మాయిలు, కారు నడిపే మహిళల సంఖ్య బాగా పెరిగింది. వాళ్లు గ్యారేజ్‌కి వచ్చినప్పుడు గ్యారేజ్‌లో పని చేసే వాళ్లలో అమ్మాయిలు కనిపిస్తే భరోసాగా ఫీలవుతారు. ఇది మంచి కెరీర్ ఆప్షన్. ఎప్పటికీ ఆదరణ తగ్గని మంచి రంగం అవుతుంది’’ అన్నది అనిత. కష్టం... వద్దన్నా వచ్చే అతిథి సింగిల్æమదర్‌ల మీద ఉండే బాధ్యతల బరువు నాకు తెలుసు. అందుకే సింగిల్ మదర్లు ఈ పని నేర్చుకోవడానికి ముందుకొస్తే వారికి సహకరిస్తాను.ఎవరూ కోరి కష్టాలు తెచ్చుకోరు. అనుకోని అతిథిలా కష్టం దానంతట అదే వచ్చి తిష్టవేస్తుంది. కష్టం వచ్చిందని భయపడి పిల్లలతోపాటు ఆత్మహత్యలకు పాల్పడే తల్లుల గురించి తెలిసినప్పుడు బాధ కలుగుతుంటుంది. ఒక్క క్షణం ఆలోచించండి. పరిస్థితులకు మనం బాధితులమైనప్పటికీ మన పిల్లలను బాధితులను చేయకూడదు. అలాగని అమ్మానాన్నల మీద వాలిపోకూడదు. వాళ్లు కష్టకాలంలో అండగా భుజాన్ని ఇవ్వగలుగుతారు. కానీ బరువు మోసే శక్తి వాళ్లకు ఉండదు. మీకు వచ్చిన పని చేయండి, నచ్చిన పనిని నేర్చుకోండి. – అనిత వ్యాల, ఎం.డీ. ఆమె తాను ఎంచుకున్న రంగంతో మహిళలకు స్ఫూర్తినివ్వడంతోపాటు కొత్తతరానికి స్వాగతం పలుకుతోంది కూడా. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Roohani Maryam: కార్లపై యాసిడ్ పోసి బెదిరించేవాళ్లు
ఈశాన్య ఇరాన్ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామం అఘ్మజర్ .. యుక్త వయసు రాగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, వాళ్లను పెద్దచేయడమే అక్కడి అమ్మాయిల జీవితంలో ముఖ్యమైన అంశం. ఇలాంటి సమాజంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మరియం రుహానీ తండ్రి ప్రోత్సాహంతో సమాజాన్ని కూడా ఎదిరించి తను అనుకున్న రంగంలో దూసుకుపోతూ ‘మిస్ డీటెయిలర్’గా ఎంతోమంది మన్నలను పొందుతోంది రుహానీది మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండేవి. దీంతో తండ్రికి సాయం చేసేందుకు బ్యూటీషియన్ కోర్సు చేసి హెయిర్ డ్రెస్సర్‌గా, మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసేది. తనలోని ఆర్టిస్టును మాత్రం కార్లను కొత్తగా,అందంగా తీర్చిదిద్దాలనే కోరిక ఎప్పుడూ తొలుస్తూ ఉండేది. దీంతో తన కలను నిజం చేసుకునేందుకు మరియం తాను కష్టపడి పొదుపు చేసి దాచుకున్న డబ్బుతో పాత కార్లు కొని వాటిలోని లోపాలను సరిచేసి, కొత్త వాటిలాగా తీర్చిదిద్ది కొంత లాభానికి విక్రయించడం ప్రారంభించింది. తండ్రి ప్రోత్సాహంతో.. చుట్టూ ఉన్న సమాజం, బంధువులు వేలెత్తి చూపినప్పటికీ తండ్రి ప్రోత్సహించడంతో.. పెళ్లికి సంబంధించి తమ సమాజపు నియమాలను పక్కన పెట్టి మరీ కార్ పాలిషింగ్ కోర్సు చదవాలని నిర్ణయించుకుంది మరియం. అయితే ఇరాన్ లో ఎక్కడా కార్ పాలిషింగ్ కోర్సు నేర్పే సంస్థలు లేవు. దీంతో ఆమె టర్కీ వెళ్లి కార్ పాలిషింగ్ కోర్సు నేర్చుకుని సర్టిఫికెట్ సంపాదించింది. సర్టిఫికెట్ చేతికి రాగానే, ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కొద్దిపాటి స్థలాన్ని అద్దెకు తీసుకుని మరియం గ్యారేజిని ప్రారంభించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి కస్టమర్లంతా మరియం గ్యారేజికి క్యూ కట్టేవారు. అమ్మాయి నడిపిస్తోన్న మొదటి గ్యారేజ్, ‘తొలి ఫిమేల్ కార్ డీటెయిలర్’ అంటూ కస్టమర్లు మరియం గ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేవారు. అలా...అలా ఆమె గ్యారేజ్ గురించి ఎంతో మందికి తెలిసింది. ప్రస్తుతం ఇరాన్లో మరియంను‘‘మిస్ డీటెయిలర్’’ అని పిలుస్తున్నారు. అయితే ఈ ఆనందం వెనుక ఎన్నో కష్టనష్టాలు కూడా ఉన్నాయి. స్త్రీల హక్కులు, అభిప్రాయాలకు అంతగా విలువివ్వని సమాజం అది. అందుకే ప్రారంభంలో వేరే గ్యారేజీల వాళ్లు మరియంను చాలా చులకనగా చూసేవారు. కొన్నిసార్లైతే ఆమె గ్యారేజ్‌కు వచ్చిన కార్లపై యాసిడ్ పోసి తనని బెదిరించేవాళ్లు. చేసేదేమీ లేక మరియం గ్యారేజిని మూసేసింది. సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ ఆటో కంపెనీ ఒకటి మరియంకు ఉద్యోగం ఇస్తాననడంతో అక్కడ ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూ తనలాగా ఆసక్తి ఉన్న మరికొంత మంది అమ్మాయిలకు కార్ పాలిషింగ్, వాషింగ్లలో శిక్షణ నిస్తోంది. ‘‘ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ దేశం దిగుమతుల్ని ఆపేయడంతో.. కార్ల ధరలు మూడు రెట్లు పెరిగాయి. ఆర్థిక సంక్షోభం, మరోపక్క కోవిడ్–19 మహమ్మారి కారణంగా వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ గ్యారేజీ పెట్టే అవకాశంలేదు. అయినా సరే,‘‘నేను భవిష్యత్‌లో యూరప్‌లో ఒక గ్యారేజిని పెడతాను’’ అని ధీమాగా చెబుతోంది మరియం. చదవండి: Matrimonial Fraud: జాగ్రత్తగా చేరుకున్నావా డియర్! -
ఎంతటి వాహనాన్నిఐనా రిపేర్ చేస్తున్న:ఆదిలక్ష్మి గ్యారేజ్
-
ఉద్యోగ భద్రతకు ముప్పులేదు
సాక్షి, మదనపల్లె అర్బన్ : గ్యారేజ్ మెయింటెనెన్స్ విధానంలో మార్పులతో కార్మికుల ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పులేదని ఏపీఎస్ ఆర్టీసీ చిత్తూరు రీజియన్ డెప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ నరసింహులు తెలిపారు. ఆయన శనివారం మదనపల్లె 1, 2 డిపోల్లో గ్యారేజ్ మెయింటెనెన్స్ కొత్త విధానం గురించి మెకానిక్‌లకు వివరించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి గ్యారేజ్ మెయింటెనెన్స్‌పై కొత్త విధానాన్ని యాజమాన్యం అమలులోకి తెచ్చిందన్నారు. బస్సుల సాంకేతికతలో అత్యాధునిక మార్పులు వచ్చినందున రోజువారీ తనిఖీలు అవసరం లేదని యాజమాన్యం భావిస్తోందన్నారు. బస్సు నడిపేటప్పుడు డ్రైవరు గుర్తించిన లోపాలను గ్యారేజీలో నివేదిస్తే ఆ మేరకు మరమ్మతులు చేపడతారన్నారు. కొత్త విధానంతో మెకానిక్‌లకు ఉద్యోగ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు. కార్మికులకు పని సులభతరం అవుతుందన్నారు. పాత విధానంలో ప్రతి రోజూ బస్సును క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉండేదన్నారు. ఇప్పుడు బస్సు నడుపుతున్న డ్రైవర్ చెప్పిన లోపాల్ని సరిచేస్తే సరిపోతుందన్నారు. కార్మికునికి పనిభారం తగ్గుతుందని, బస్సులు కండీషన్లో ఉంటాయని చెప్పారు. కొత్త విధానాన్ని కార్మికులు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలని, గుడ్డిగా వ్యతిరేకించవద్దని కోరారు. డిపో మేనేజర్లు రాజా గజలక్ష్మి, పెద్దన్నశెట్టి, ఎంఎఫ్‌లు నిరంజన్, ఎంవీఆర్ రెడ్డి, మెకానిక్‌లు, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
80లక్షల మినీ బస్సు దగ్ధం
షాద్‌నగర్‌రూరల్ : షాద్‌నగర్ పట్టణంలో మహరాజా దాబా వెనుక ఉన్న ఓ మెకానిక్ గ్యారేజీలో సోమవారం తెల్లవారు జామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో లక్షల రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. బాధితుడు, స్థానికు ల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వెంకటేష్ గత కొంతకాలంగా మహరాజా దాబా వెను క ఉన్న షెడ్లో వాహనాల రిపేరింగ్ గ్యారేజీని నిర్వహిస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే ఆదివారం రాత్రి పనులు ముగించుకున్న అనంతరం గ్యారేజీకి తాళం వెసి వెంకటేష్ ఇంటికి వెళ్లాడు. సోమ వారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు ఎసిగిపడ్డాయి. ప్రమాదంలో మరమ్మతుల కోసం వచ్చిన ప్రైవేట్ మినీ బస్సు దగ్ధమైంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదు పు చేశారు. పోలీసులు ఘటన స్ధలాన్ని సందర్శిం చి వివరాలు నమోదు చేసుకున్నారు. గ్యారేజీలో వాహనాలకు సంబంధించిన విలువైన ఇంజన్లు, గేర్ బాక్సులు, ఆయిల్ పూర్తిగా కాలిపోయాయని, వాటి విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు వాపోయారు. అత్యాధునిక మినీ బస్సు.. కొత్తూరులోని ప్యాపరస్ పోర్టు రిసార్టు నిర్వాహకులకు చెందిన మినీ బస్సును గత ఆరు నెలల క్రితం మరమ్మతుల కోసం గ్యారేజీకి తీసుకొచ్చినట్లు గ్యారేజీ నిర్వాహకుడు వెంకటేష్ తెలిపారు. మరమ్మతులు చేసినా బస్సు యజమానులు వాహనాన్ని తీసుకెళ్ల లేదని, దీంతో ఆరు నెలలుగా బస్సు గ్యారేజీలోనే ఉందన్నారు. అగ్ని ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయిందని, బస్సు సుమారు రూ. 80లక్షల వరకు ఉండవచ్చని, బస్సుల్లో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ శ్రీవర్ధన్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడిని పరామర్శించారు. -
మైక్రోసాఫ్ట్ విస్తరణ: భారీ ఉద్యోగాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో గ్యారేజ్‌ని ప్రారంభించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలపై ఉద్యోగులు పనిచేసేందుకు, ఉత్పత్తుల పరిష్కరణ వంటి వాటి కోసం ఈ గ్యారేజీ పనిచేస్తుంది. సోమవారమిక్కడ గ్యారేజీని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నగరంలోని మైక్రోసాఫ్ట్ క్యాంపస్ విస్తరణ చేయనుందని.. దీంతో కొత్తగా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలొస్తాయని’’ తెలిపారు. 8 వేల చ.అ. విస్తీర్ణంలో ఉన్న ఈ గ్యారేజ్ దేశంలోనే మొదటిది. ఇలాంటి సెంటర్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని రెండ్మౌండ్లోనూ ఉంది. దేశంలో 2014 నుంచి గ్యారేజ్ కార్యక్రమాలున్నప్పటికీ ప్రత్యేకంగా గ్యారేజ్ కోసం స్థలం కేటాయించడం ఇదే తొలిసారని మైక్రోసాఫ్ట్ గ్యారేజ్ ఇండియా డైరెక్టర్ రీనా దయాళ్ తెలిపారు. -
తారా కారు!
సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన కాలంలో తారలు వాడిన కార్లు ఇవి. ప్రస్తుతం గ్యారేజీలకు మాత్రమే పరిమితమైన ఈ వాహనాలు అలనాటి తారావైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. * ఈ షెవర్లే కారులోనే అలనాటి అందాల తార జమున అప్పట్లో షికారు చేసేవారు. ఇప్పుడిది వాడుకలో లేదు. అయినా ఈ వాహనంపై జమునకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే, ఇప్పటికీ దానిని అమూల్యంగా చూసుకుంటున్నారు. * ఇక ఈ అంబాసిడర్ కారు ‘అన్నగారు’ ఎన్టీఆర్ వాడినది. తాతగారి జ్ఞాపకంగా కళ్యాణ్‌రామ్ తన ఇంట్లో దీనిని అపురూపంగా భద్రపరచుకున్నారు. * టొయోటా కారేమో మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో ముచ్చటపడి కొనుక్కున్న వాహనం. దీనికి ఏరికోరి ఫ్యాన్సీ నంబర్ ‘1’ ఎంచుకున్నారు. దానికి తగ్గట్టే చిరంజీవి కూడా అనతికాలంలోనే టాలీవుడ్లో నంబర్ 1 స్థానానికి ఎదిగారు. -
అక్రమ నిర్మాణాన్ని తొలగించిన హీరో వెంకటేశ్
హైదరాబాద్: సినీ హీరో వెంకటేశ్ హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నంబర్-1లో తన ప్లాట్‌లో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్డును శనివారం స్వయంగా ఆయనే కూలీలను నియమించుకొని కూల్చివేయించారు. ఫిలింనగర్‌లోని ప్లాట్ నంబర్-3లో వెంకటేశ్‌కు ఫ్లాట్ ఉంది. గత కొద్ది రోజులుగా ఈ ఫ్లాట్‌లో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతుండటంతో రెండు వారాల క్రితం జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. పక్షం రోజుల్లో వాటిని కూల్చివేయకపోతే తామే కూల్చివేస్తామని నోటీసులో హెచ్చరించారు. దీనికి స్పందించిన వెంకటేశ్ నోటీసు గడువుకు ఒక రోజు ముందే ఆక్రమణలను నేలమట్టం చేయించారు. నిర్మాణాలు కూల్చివేసిన ప్రాంతాన్ని ఫొటోలు తీయించి జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు అందించారు. -
ఆపదలో 108
ఆదిలాబాద్ రిమ్స్ : కుయ్.. కుయ్.. కుయ్ అంటూ రోగులను అత్యవసర సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడే అపర సంజీవనికి ఆపద వచ్చింది. జిల్లాలో 108 సేవలకు గ్రహణం పట్టింది. తరచూ ఇంధన కొరత.. వాహనాలు రిపేర్‌కు రావడం.. వెరసి ప్రజలకు సేవలందించలేకపోతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 108 రాక.. ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజు వారీగా వందల సంఖ్యలో ప్రాణాలు కాపాడుతున్న ఈ వాహనాల రాకపోకలు నిలిచిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇంధనం కొరత.. జిల్లాలో 2006 ఆగస్టులో ఆదిలాబాద్, మంచిర్యాలలో ఒక్కో వాహనంతో 108 సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంవత్సర కాలంలో విడుతల వారీగా 30 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. వీటిలో డీజిల్ ఇంధనం లేకపోవడంతో తరచూ సేవలు నిలిచిపోతున్నాయి. పది రోజులుగా డీజిల్ కొరతతో దాదాపు 20కి పైగా వాహనాల సేవలు ఆగిపోయాయి. శనివారం జిల్లా కేంద్రంలో సైతం డిజిల్ లేదని నాలుగు వాహనాలను సిబ్బంది నిలిపివేశారు. దీంతో 108 సేవల కోసం ఫోన్‌చేసే వారికి డీజిల్ లేదని.. వాహనం నడవడం లేదని సమాధానం చెప్తున్నారు. ఇలా ప్రతి రోజూ ఒక్కో వాహనానికి 20 నుంచి 30 ఫోన్‌కాల్స్ వస్తుంటాయి. ఎంతో అత్యవసర సమయం అయితే కానీ 108కు ఫోన్ చేయరు. అలాంటిది ఫోన్ చేసినా వాహనం రాకపోవడంతో పలువురు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి రోగులను ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్‌ను అరువుగా పోయించుకుంటున్నా వాటి బకాయిలు పెరిగిపోయింది. దీంతో బంక్ యజమానులు ఇంధనం పోయడం నిలిపివేశారు. కొన్నిచోట్ల మాత్రం ఇంకా అరువుగా ఇంధనం పోయించుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో వాహనానికి నెలకు రూ.20 వేల చొప్పున ఇంధన బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. మూడు నెలలుగా ఈ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఫలితంగా ఆదిలాబాద్, జైనథ్, తాంసి, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, నార్నూర్, జైనూర్‌తోపాటు చాలా ప్రాంతాలకు ఇప్పటికే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరమ్మతుకు నోచుకోని వాహనాలు.. తొమ్మిది సంవత్సరాలుగా అవే వాహనాలు నడిపిస్తుండడంతో అవి కండీషన్ కోల్పోయి మూలనపడుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కో వాహనం సుమారు 3 లక్షల నుంచి 5 లక్షల కిలోమీటర్ల వరకు తిరిగాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 లక్షల కిలోమీటర్ల వరకు తిరిగిన వాహనాలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి అందించాలి. కానీ.. ఇప్పటి కీ కొత్తవి మంజూరు లేక అవే వాహనాలను వినియోగిస్తున్నారు. దీంతో వాహనాలు తప్పుపట్టి తరచూ ఏదో ఒక సమస్యతో గ్యారేజీకి తరలుతున్నాయి. వాటికి మరమ్మతులు చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. అయితే జిల్లాలో వాహనాల మరమ్మతుల కోసం చేసిన బిల్లులు కూడా 6 నెలలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి. 15 మంది మెకానిక్‌లకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వాహనాలు మెకానిక్ షెడ్‌కు వెళ్లినప్పుడు బిల్లులు ఇవ్వలేడం లేదంటూ.. ఆ వాహనాలను రోజుల తరబడి షెడ్డులోనే పెట్టుకుంటున్నారు. వాహనాల్లో పరికరాల కొరత.. 108 వాహనాల్లో పరికరాల కొరత తీవ్రంగా ఉంది. తొమ్మిదేళ్లుగా అవే పరికరాలు వాడుతుండడంతో సరిగా పనిచేయడం లేదు. కొన్ని పరికరాలు పూర్తిగా చెడిపోయాయి. రోగులకు ప్రథమ చికిత్సకు చేయాల్సిన పరికరాలు సైతం అందుబాటులో లేక వాహనాల్లో రోగులను తీసుకొచ్చే సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్ని వాహనాల్లో బీపీ ఆపరేటర్స్, పల్స్‌మిషన్, స్టెతస్కోప్, తర్మామీటర్, మానిటర్, వెంటిలేటర్, నెఫ్లేజర్, గ్లూకోమీటర్లు కూడా లేని దుస్థితి నెలకొంది. తుప్పుపట్టి వాహనాల్లో పరికరాలు లేకుండానే బాధితులను తరలిస్తున్నామని సిబ్బంది పేర్కొనడం గమనార్హం. ఇందులో పనిచేసే 180 మంది సిబ్బందికి కూడా రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సేవల నిర్వహణకు నయాపైసా విడుదల కాలేదు. ఇటు ఇంధన, పరికరాల కొరత, అటు మరమ్మతు సమస్య వేధిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చర్యలు చేపడుతాం.. - శాంతిసాగర్, 108 జిల్లా కోఆర్డినేటర్ 108 వాహనాల్లో డిజిల్ కొరత లేకుండా చర్యలు చేపడుతున్నాం. మూడు నెలల నుంచి బిల్లులు అందకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. ఇటీవల ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లాం. త్వరలోనే పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించి వాహనాలు నిలిచిపోకుండా చూస్తాం. -
ఒకప్పుడు నిరుద్యోగి... నేడు కోటీశ్వరుడు
పెళ్లాం చెబితే వినాలి భార్య ఇచ్చిన యాభై వేల రూపాయలతో అంధేరిలో ‘ఎలైట్ క్లాస్’ పేరుతో గ్యారేజ్ ప్రారంభించాడు. ఇది బాగానే నడిచింది. ఆ తరువాత వాహనాలకు కావలసిన విడి వస్తువులను విక్రయించే ‘వి-లింక్ ఆటోమోటివ్ సర్వీస్ ప్రయివెట్ లిమిటెడ్’ను ప్రారంభించాడు. ఇది కూడా విజయవంతం అయింది. ‘‘మీ భర్త ఏ ఉద్యోగం చేస్తుంటారు?’’ అని ఎవరైనా అడిగినప్పుడు శ్రీమతి నీరజ్ ఇబ్బంది పడేవారు. ఎందుకంటే ఆమె భర్త నీరజ్ గుప్త ఎలాంటి ఉద్యోగమూ చేయడం లేదు. ముంబాయిలోని మిత్లీబాయి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఆయన అయిదు సంవత్సరాల పాటు ఖాళీగా ఉన్నాడు. భార్య మాత్రం జెట్ ఎయిర్ వేస్‌లో ఉద్యోగం చేసేది. ‘‘ఎయిర్ పోర్ట్ నుంచి రోజు మా ఆవిడను తీసుకురావడమే ఆరోజుల్లో నా ఉద్యోగం’’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు నీరజ్. ‘‘ఎన్ని రోజులు ఇలా? వ్యాపారమో ఉద్యోగమో ఏదో ఒకటి చేయండి’’ అని చెప్పింది ఆమె. ‘భార్య చెబితి వినాలి కదా!’ అలాగే చేశాడు నీరజ్. వ్యాపారం చేయాలని నిర్ణయంచుకున్నాడు. భార్య ఇచ్చిన యాభైవేల రూపాయలతో అంధేరిలో ‘ఎలైట్ క్లాస్’ పేరుతో గ్యారేజ్ ప్రారంభించాడు. ఇది బాగానే నడిచింది. ఆ తరువాత వాహనాలకు కావలసిన విడి పరికరాలను విక్రయించే ‘వి-లింక్ ఆటోమోటివ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్’ను ప్రారంభించాడు. ఇది కూడా విజయవంతం అయింది. కొంత కాలం తరువాత ‘మెరు క్యాబ్’ మొదలు పెట్టడంతో ఇక నీరజ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. ఒకప్పటి నిరుద్యోగి నీరజ్ గుప్తా ఇప్పుడు 450 కోట్ల వ్యాపారానికి రారాజు. ‘‘ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది’’ అంటున్నాడు నీరజ్. అక్షరాల నిజమే కదా! -
విస్తరణ సాధ్యమేనా..?
సహకార రంగంలోని గోవాడ చక్కెర మిల్లు విస్తరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సామర్థ్యాన్ని ఏకంగా రెట్టింపు చేస్తామంటూ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. విస్తరణ పక్రియ మంచి దే అయినప్పటికీ ఒకే సారి 8వేల టన్నుల క్రషింగ్ కెపాసిటీని పెంచడం ఏమేరకు సాధ్యమన్న వాదన వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ ఆదాయం, ఇతర వనరులు, అదనపు సామర్థ్యం పెంపు నకు సరిపోతాయా అన్నన్నది అంతుచిక్కని ప్రశ్న అవుతోంది. చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని 1961లో 1250టన్నుల కెపాసిటీతో నిర్మించారు. ఆ తర్వాత 1600టన్నులకు,1987-88లో 2500టన్నులకు విస్తరించారు. 2001లో నాలుగు వేల టన్నుల సామర్థంతో బాయిలర్ హౌస్‌ను ఏర్పాటు చేశారు. 12 మెగావాట్ల కో-జనరేషన్ ప్లాంట్ ఏర్పాటయింది. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల నుంచి ఈ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా అవుతుంది. 23,844 మంది సభ్యరైతులు ఉన్నారు. పదెకరాలకు మించి చెరకు పండించేది కేవలం 200మందే . మిగతా వారంతా చిన్న, సన్నకారు రైతులే. మిల్లు పరిధిలోని రైతులు ఏటా 25వేల ఎకరాల్లో సుమారు 6లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నారు. కెపాసిటీ మేరకు సీజన్లో 5 నుంచి 5.2లక్షల టన్నుల వరకు గానుగాడుతున్నారు. మిగతాది పక్కజిల్లాలోని ప్రైవేటు ఫ్యాక్టరీలకు తరలిపోతోంది. మరో 20వేల ఎకరాల్లో పండుతున్న చెరకు బెల్లంగా తయారు చేసి అనకాపల్లి మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రాంత రైతులు సనాతన పద్ధతుల్లోనే గెడలు విధానంలో నాట్లు చేపడుతున్నారు. డ్రిప్ పద్ధతిని కేవలం 10శాతం మందే ఆచరిస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే పల్లపు ప్రాంతాల్లో ఎకరాకు 35-40టన్నులు, మెట్ట, వర్షాధారపు భూముల్లో 25-30టన్నుల చెరకు దిగుబడి వస్తోంది. మిల్లు రోజువారీ క్రషింగ్ సామర్థ్యం 4వేల టన్నులు. ఒక్కసారిగా సామర్థ్యాన్ని 8వేలకు పెంచితే..బెల్లం తయారీకి కాకుండా మిల్లుకు చెరకు సరఫరా అవుతుందా అన్నది అనుమానం. లేదంటే అదనంగా మరో 20వేల ఎకరాల్లో చెరకు పండించాలి. లక్ష్యం మేరకు చెరకు సాగుకు రైతుల్లో చైతన్యం రావాలి. దీనికి కొంత సమయం పడుతుంది. ఆ పని ఇప్పట్లో జరిగేది కాదన్న భావన ఎక్కువ మంది రైతుల్లో వ్యక్తమవుతోంది. ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు గానుగాడుతారు. మొలాసిస్ ట్యాంక్‌లు, పంచదార నిల్వలు చేసే గోడౌన్లు సరిపడినన్ని లేవు. దీనివల్ల ప్రైవేటు గోడౌన్లను అద్దెకు తీసుకుంటున్నారు. వీటినీ అదనంగా ఏర్పాటుచేయాల్సి ఉంది. అన్నీ అనుమానాలే.. ఒకే సారి 8వేల టన్నుల కెపాసిటీకి పెంచడానికి రూ.160కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. క్రషింగ్ మిషనరీ సామర్థ్యం పెంచడం, కో-జనరేషన్, ఇథనాయిల్ కర్మాగారం, మొలాసిస్, పంచదార నిల్వల గోడౌన్లు అదనంగా ఏర్పాటు, బిందుసేద్యం, ఆధునిక పద్ధతిలో చెరకు సాగు వంటివి ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు తెలిసింది. ఈ డబ్బు ప్రభుత్వం ఇస్తుందా?.. లేక అప్పుగా ఫ్యాక్టరీకి ఇస్తుందా అన్నది శేష ప్రశ్న. అప్పుగా ఇస్తే ఇన్ని కోట్లకు వడ్డీ చెల్లింపు యాజమాన్యానికి భారమవుతుంది. ఇప్పుడున్న మిషనరీ కాకుండా గ్యారేజీ వెనుక భాగంలోని పాత మిల్లుహౌస్లో కొత్త యూనిట్‌ను ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ రానున్న సీజన్‌కు విఘాతం కలగకుండా చేస్తారా? అన్‌సీజన్‌లో చేస్తారా అన్నదీ అంతుచిక్కని ప్రశ్న.