ఒకప్పుడు నిరుద్యోగి... నేడు కోటీశ్వరుడు
పెళ్లాం చెబితే వినాలి
భార్య ఇచ్చిన యాభై వేల రూపాయలతో అంధేరిలో ‘ఎలైట్ క్లాస్’ పేరుతో గ్యారేజ్ ప్రారంభించాడు. ఇది బాగానే నడిచింది. ఆ తరువాత వాహనాలకు కావలసిన విడి వస్తువులను విక్రయించే ‘వి-లింక్ ఆటోమోటివ్ సర్వీస్ ప్రయివెట్ లిమిటెడ్’ను ప్రారంభించాడు. ఇది కూడా విజయవంతం అయింది.
‘‘మీ భర్త ఏ ఉద్యోగం చేస్తుంటారు?’’ అని ఎవరైనా అడిగినప్పుడు శ్రీమతి నీరజ్ ఇబ్బంది పడేవారు. ఎందుకంటే ఆమె భర్త నీరజ్ గుప్త ఎలాంటి ఉద్యోగమూ చేయడం లేదు. ముంబాయిలోని మిత్లీబాయి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఆయన అయిదు సంవత్సరాల పాటు ఖాళీగా ఉన్నాడు. భార్య మాత్రం జెట్ ఎయిర్ వేస్‌లో ఉద్యోగం చేసేది.
‘‘ఎయిర్ పోర్ట్ నుంచి రోజు మా ఆవిడను తీసుకురావడమే ఆరోజుల్లో నా ఉద్యోగం’’ అని గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు నీరజ్.
‘‘ఎన్ని రోజులు ఇలా? వ్యాపారమో ఉద్యోగమో ఏదో ఒకటి చేయండి’’ అని చెప్పింది ఆమె.
‘భార్య చెబితి వినాలి కదా!’ అలాగే చేశాడు నీరజ్. వ్యాపారం చేయాలని నిర్ణయంచుకున్నాడు.
భార్య ఇచ్చిన యాభైవేల రూపాయలతో అంధేరిలో ‘ఎలైట్ క్లాస్’ పేరుతో గ్యారేజ్ ప్రారంభించాడు. ఇది బాగానే నడిచింది. ఆ తరువాత వాహనాలకు కావలసిన విడి పరికరాలను విక్రయించే ‘వి-లింక్ ఆటోమోటివ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్’ను ప్రారంభించాడు. ఇది కూడా విజయవంతం అయింది.
కొంత కాలం తరువాత ‘మెరు క్యాబ్’ మొదలు పెట్టడంతో ఇక నీరజ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. ఒకప్పటి నిరుద్యోగి నీరజ్ గుప్తా ఇప్పుడు 450 కోట్ల వ్యాపారానికి రారాజు.
‘‘ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైంది’’ అంటున్నాడు నీరజ్.
అక్షరాల నిజమే కదా!