
సితాపూర్(ఉత‍్తరప్రదేశ్):
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఓ మహిళను, ఆమె నలుగురు కూతుళ్లను నడుస్తున్న ట్రెయిన్ నుంచి బయటకు తోసేశాడు. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు చిన్నారులు చనిపోగా మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలివీ.. బిహార్‌లోని మోతిహరీకి చెందిన ఇద్దు, ఇక్బాల్ అనే ఇద్దరు సోదరులు పంజాబ్‌కు పనుల కోసం వలస వెళ్లారు. ఇద్దుకు భార్య అఫ్రీన్, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
వీరంతా కలిసి అమృత్‌సర్- సహర్సా జన్ సేవా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే, ఇద్దు, ఇక్బాల్ ఇద్దరూ మద్యం మత్తులో ఉండి గొడవపడుతున్నారు. ఆ సమయంలో రైలు లఖింపూర్ జిల్లా మైగల్‌గంజ్ ప్రాంతంలో ఉంది. మాటామాటా పెరిగి కోపంతో ఉన్న ఇక్బాల్.. పక్కనే ఉన్న అఫ్రీన్‌ను ఎత్తి బయటపడేశాడు. అనంతరం 12 ఏళ్లలోపు నలుగురు ఆడ పిల్లలు రబియా, అల్‌బుల్, సలీమా, మున్నిలను బయటకు విసిరేశాడు. వీరిలో అఫ్రీన్, రబియా, మున్ని తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోగా అల్‌బుల్(12), సలీమా(4) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దు, ఇక్బాల్‌లను మాత్రం పోలీసులు అరెస్ట్ చేయలేదు. బాధిత కుటుంబం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, విచారణ వేగవంతం చేసేందుకు మోతిహరి పోలీసులను సంప్రదిస్తున్నట్లు జీఆర్పీ సర్కిల్ ఆఫీసర్ ఏకే సింగ్ తెలిపారు.
తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక నుంచి సమాచారం సేకరిస్తున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment