కదులుతోన్న రైలులో గర్భిణి ప్రసవం | A pregnant woman given birth on a moving train | Sakshi
Sakshi News home page

కదులుతోన్న రైలులో గర్భిణి ప్రసవం

Published Fri, Jan 27 2023 5:16 AM | Last Updated on Fri, Jan 27 2023 4:09 PM

A pregnant woman given birth on a moving train - Sakshi

తల్లీబిడ్డలను ప్రభుత్వాస్పత్రికి తరలించేందుకు సిద్ధమైన అధికారులు

విజయనగరం టౌన్‌: బిహార్‌ రాష్ట్రం ఆనందపూర్‌కి చెందిన బిందుకుమారి అనే గర్భిణి ‘అలెప్పీ–ధనబాద్‌ రైలు (13352)లో కేరళ నుంచి ధనబాద్‌కు పుట్టింటికి వెళ్తోంది. విశాఖ దాటిన తర్వాత ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. తోటి ప్రయాణికుల సాయంతో కదులుతోన్న రైలులోనే విజయనగరం సమీపంలో వాష్‌ రూంలో మగబిడ్డను ప్రసవించింది.  

విజయనగరం రైల్వే స్టేషన్‌లో మెడికల్, ఆర్‌పీఎఫ్, కమర్షియల్, ఆపరేటింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది జనరల్‌ బోగీలో ప్రయాణిస్తున్న ఆమె వద్దకు చేరుకున్నారు. రైల్వే వైద్యురాలు జ్యోతిప్రియ ప్రాథమిక చికిత్స చేసి అనంతరం 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.  ఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ కేఎస్‌ రత్నం, హెచ్‌సీ వి.అరుణ, కానిస్టేబుల్‌ ఎ.నాయుడు, సీటీఐ రెడ్డి, అప్పలరాజు, టీపీ బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement