Pregnant Delivery
-
ఏసీ వార్డు కోసం రచ్చ.. కయ్యానికి దిగిన వియ్యంకులు
లక్నో: యూపీలోని బారాబంకిలో నెలలు నిండిన తమ బిడ్డ డెలివరీకి ఏసీ వార్డులో చేర్పించలేదని కోపంతో ఓ గర్భవతి తల్లిదండ్రులు ఆమె అత్తమామలను చితక బాదారు. ఈ వీడియోని అక్కడున్నవారిలో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. తమ బిడ్డకు నెలలు నిండడంతో డెలివరీ నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించినట్టు తెలుసుకుని బిడ్డను చూసేందుకు ఆత్రుతతో హాస్పిటల్ కు వెళ్లారు గర్భవతి తల్లిదండ్రులు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఏసీ వార్డులో కాకుండా నాన్ ఏసీ వార్డులో ఉన్న తమ బిడ్డను చూసి వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మొదట మాటల యుద్ధానికి తెరతీసిన వారు మెల్లగా ముష్టియుద్ధానికి తెగబడ్డారు. వియ్యంకుడు రామ్ కుమార్ తోపాటు అతని భార్యని ఇద్దరు పిల్లలను పట్టుకుని చితకొట్టేశారు. వారు కూడా తిరగబడటంతో గొడవ మరీ పెద్దదైంది. రోడ్డు మీద నలుగురు చూస్తుండగానే ఈ వీరంగమంతా జరగడంతో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది వీడియో ఎక్కడెక్కడో చక్కెర్లు కొడుతోంది. #Barabanki में बहू के लिए अस्पताल में AC रूम न बुक करने पर मायके वालों ने की ससुराल पक्ष के लोगों की पिटाई, विडियो वायरल। pic.twitter.com/bfuKZ5j4uA — Priya singh (@priyarajputlive) July 5, 2023 ఇది కూడా చదవండి: కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం.. -
వాట్సాప్ కాల్ సాయంతో ప్రసవం
శ్రీనగర్: నొప్పులతో విలవిల్లాడుతున్న గర్భిణికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) సిబ్బంది వాట్సాప్ కాల్ సాయంతో సురక్షితంగా ప్రసవం చేసిన సంఘటన జమ్మూకశ్మీర్‌లో జరిగింది. కుప్వారా జిల్లాలోని కెరాన్ పీహెచ్‌సీకి నెలలు నిండి, నొప్పులు మొదలైన గర్భిణిని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి తీసుకొచ్చారు. ఎక్లామ్‌ప్సియా, ఎపిసియోటోమీతో బాధపడుతున్న ఆమెకు ప్రసవం జరగడం కష్టతరంగా మారింది. తీవ్రంగా మంచు కురుస్తుండడంతో హెలికాప్టర్లో జిల్లా ఆసుపత్రికి తరలించడం వీలు కాలేదు. దీంతో కెరాన్ పీహెచ్సీ డాక్టర్లు క్రాల్పొరాలోని జిల్లా ఉప ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. ఆఆసుపత్రి వైద్యుడు డాక్టర్ పర్వేజ్ వాట్సాప్ కాల్లో సూచనలు ఇస్తుండగా, కెరాన్ పీహెచ్సీ వైద్యులు మహిళకు విజయవంతంగా ప్రసవం చేశారు. ఆడ శిశువు జన్మించిందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. -
కదులుతోన్న రైలులో గర్భిణి ప్రసవం
విజయనగరం టౌన్: బిహార్ రాష్ట్రం ఆనందపూర్‌కి చెందిన బిందుకుమారి అనే గర్భిణి ‘అలెప్పీ–ధనబాద్ రైలు (13352)లో కేరళ నుంచి ధనబాద్‌కు పుట్టింటికి వెళ్తోంది. విశాఖ దాటిన తర్వాత ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. తోటి ప్రయాణికుల సాయంతో కదులుతోన్న రైలులోనే విజయనగరం సమీపంలో వాష్ రూంలో మగబిడ్డను ప్రసవించింది. విజయనగరం రైల్వే స్టేషన్లో మెడికల్, ఆర్పీఎఫ్, కమర్షియల్, ఆపరేటింగ్ ఉద్యోగులు, సిబ్బంది జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న ఆమె వద్దకు చేరుకున్నారు. రైల్వే వైద్యురాలు జ్యోతిప్రియ ప్రాథమిక చికిత్స చేసి అనంతరం 108లో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ కేఎస్ రత్నం, హెచ్‌సీ వి.అరుణ, కానిస్టేబుల్ ఎ.నాయుడు, సీటీఐ రెడ్డి, అప్పలరాజు, టీపీ బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. వాళ్లకు ‘నడక’యాతన తప్పట్లేదు
రాయగడ( భువనేశ్వర్): ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా రాయగడ జిల్లాకు ఒరిగిందేమీ లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మారుమూల గ్రామాలే కాకుండా జిల్లా కేంద్రానికి సమీప గ్రామాలు కూడా కనీసం రహదారి సదుపాయానికి నోచుకోలేదని వాపోతున్నారు. జిల్లాను ఎవరు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మారుమూల గ్రామాల నుంచి గర్భిణులను మంచాలపై మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకువస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. నిండు గర్భిణినైనా రెండు కిలోమీటర్ల నడవాల్సిందే ఈ క్రమంలో నిండు గర్భిణిని రెండు కిలోమీటర్ల దూరం నడిపించుకుంటూ తీసుకువెళ్లిన సంఘటన గురువారం జరిగింది. అయితే అదేదో మారుమూల కుగ్రామం అనుకుంటే పొరబడినట్లే. జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ సంఘటన సంభవించడంతో అధికారులు సైతం ముక్కున వేలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి సమీప తడమ పంచాయతీ పరిధి హులుకి గ్రామానికి చెందిన కైలాస కడ్రక భార్య సంజిత కడ్రక పురిటినొప్పులతో బాధపడుతుండడంతో సమాచారం మేరకు అంబులెన్స్ వచ్చి సరైన రహదారి లేక హులుకి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని జరఫా గ్రామంలో ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కైలాస కడ్రక, వదిన మోతికడ్రక, మరో యువతి సహాయంతో కలిసి గర్భిణి సంజిత కడ్రకను ముళ్ల పొదల మీదనుంచి అతి కష్టం మీద నడిపించుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా అక్కడ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అంబులెన్స్ వరకు డోలీలో తీసుకువెళ్లేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితిలో నడిపించుకుని తీసుకువెళ్లాల్సి వచ్చిందని భర్త కైలాస కడ్రక తెలియజేశాడు. -
అప్పుడే పుట్టిన శిశువుకు పాజిటివ్.. తల్లికేమో నెగెటివ్, షాక్‌లో వైద్యులు
లక్నో: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను ఇబ్బంది పెడుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరినుంచి ఈ మహమ్మారి సోకుతుందో అనే భయం. ఈ నేపథ్యంలో తల్లి కడపులో నుంచి ఓ ఆడ శిశువు కరోనా పాజిటివ్‌తో ప్రపంచంలోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. శిశువు తల్లికి మాత్రం నెగెటివ్ రావడంతో వైద్యులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన యూపీలోని వారణాసిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మే 24న పురిటి నొప్పులతో సుప్రియ అనే మహిళ వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) లోని ఎస్.ఎస్. ఆసుపత్రిలో చేరింది. ప్రసవానికి ముందు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌గా నిర్థారణ అయ్యింది. డెలివరీ చేసిన వైద్యులు మర్నాడు ఆమెకు పుట్టిన పాపకు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యసిబ్బందితో పాటు సుప్రియ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై సుప్రియ భర్త మాట్లాడుతూ.. ఇది వింతగా ఉంది. కరోనా పరీక్షల ఫలితాన్ని చూసి మా కుటుంబ సభ్యులందరిలోను గందరగోళం నెలకొంది. ఒక వేళ పరీక్ష ఫలితాలు తప్పుగా ఉన్నాయో లేదో మాకు అర్థం కాలేదు. వీటి గురించి తెలుసుకోవడానికి ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ కాల్స్ చేయగా ఆయన స్పందించడంలేదని ఆమె భర్త తెలిపాడు. అయితే, శిశువుకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యినట్లు బీహెచ్‌యూ రిజిస్ట్రార్ నీరజ్ త్రిపాఠి ధృవీకరించారు. ప్రస్తుతం తల్లి ,బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని ఆయన వెల్లడించారు. చదవండి: తుఫాన్ వస్తుంటే బయటకొచ్చావ్ ఏంటి.. రిప్లై ఏంటో తెలుసా -
పేరుకే పే..ద్ద ఆస్పత్రి
* రిమ్స్‌లో సకాలంలో అందని వైద్యం * నేలపైనే గర్భిణి ప్రసవం * అరగంటకుపైగా నరకయాతన * వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపాటు ఆదిలాబాద్ రిమ్స్ : కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రిమ్స్ ఆస్పత్రికి అధునాతన వైద్యం అందుతుందనే ఆశతో రోగులు వస్తే నిరాశే ఎదురవుతోంది. అసలే సౌకర్యాలు లేని ఈ ఆస్పత్రికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం తోడవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రినే దేవాలయంలా భావించి ఇక్కడికి వచ్చే ప్రజల పట్ల మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో రిమ్స్ అభాసుపాలవుతోంది. శనివారం రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నిండుచూలాలు నేలపైనే ప్రసవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉండగా.. ఆ పరిస్థితిలో ఆమె అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. తమ బాధ్యతను విస్మరించిన వైద్యులు, సిబ్బంది ఏం పట్టనట్లుగా వ్యవహరించడంపై స్థానికులు మండిపడ్డారు. నిండు చూలాలి నరకయాతన.. తలమడుగు మండలం దేవాపూర్ గ్రామానికి చెందిన గోరిబి తన కూతురు రిజ్వానను ఆస్పత్రికి తీసుకొచ్చింది. నిండు చూలాలైన ఆమెను రిమ్స్‌కు తీసుకురాగానే ఓపీ విభాగంలో పేరు నమోదు చేయించింది. రశీదు తీసుకున్న అనంతరం సంబంధిత వైద్యుని వద్దకు వెళ్లారు. అక్కడ ఆ వైద్యుడు చూడకుండానే రశీదును చూసి తన కేసు కాదని.. మరో వైద్యుని వద్దకు వెళ్లాలని పంపించాడు. దీంతో సదరు వైద్యుడి గది తెలియక తన కూతురును పట్టుకుని తల్లి గోరిబి ఆస్పత్రి అంతా తిరిగింది. అప్పటికే నొప్పులు రావడంతో ఓపీ విభాగంలోని పై అంతస్థులో గల ఏఆర్టీ సెంటర్ వద్ద ఆ గర్భిణి పడిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఎన్నో అవస్థలు పడి నేలపైనే ప్రసవించింది. అరగంటకు పైగా నరకయాతన అనుభవించి ఓ పాపకు జన్మనిచ్చింది. ఇంతటి ఘోరం జరుగుతున్నా అక్కడి సిబ్బందికి, వైద్యులకు సమాచారం లేకపోవడం గమనార్హం. ఆస్పత్రికి వచ్చిన కొంత మంది స్థానికులు రిమ్స్ ఆర్ఎంవో వినాయక్కుమార్కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి సిబ్బంది పంపించాడు. తల్లీబిడ్డలను మెటర్నిటీ వార్డుకు తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. రిమ్స్‌కు వస్తే బిక్కుబిక్కే.. జిల్లా రిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చే వారిలో సగానికిపైగా గ్రామీణ పేద ప్రజలే. ఇక్కడికి వచ్చే వారిలో చాలా మందికి ఆస్పత్రిలో ఎక్కడికి పోతే వైద్యం అందుతుందో తెలియదు. ఆస్పత్రికి వచ్చిన తర్వాత వైద్య పరీక్షల కోసం గంటల తరబడి తిరగాల్సిందే. ఇక నిరాక్షరాస్యులు ఆస్పత్రికి వస్తే అంతే సంగతి. ఒక రోజులో వారికి వైద్యం అందడం గగనమే. ఇలాంటి వారి కోసం ఆస్పత్రిలో విచారణ కౌంటర్ ఏర్పాటు చేసి ఆస్పత్రి సమాచారం చెప్పేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలి. ఎలాంటి సమాచారం కావాలన్నా రోగులు ఇక్కడ అడిగి తెలుసుకునే వీలుంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో రిమ్స్‌లో సరైన సమాచారం అందించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం, ఉన్న వారు సైతం సహకరించకపోవడంతో నిత్యం ఆస్పత్రికి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. ఓపీ చిట్టి తీసుకుంది మొదలు వైద్యుడి వద్దకు వెళ్లాలంటే కచ్చితంగా ఆస్పత్రి అంతా తిరగాల్సిన పరిస్థితి రోగులకు నిత్యం ఎదురవుతోంది. ఒకవేళ సంబంధిత వైద్యుడికి చూపించిన తర్వాత అదే రోజు రక్త పరీక్షలు, ఎక్స్‌రేల పేరిట చికిత్స చేయరు. వాటి రిపోర్టులు రావాలంటే రెండు రోజులు పట్టాల్సిందే. అసలే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి మూడు రోజులపాటు ఆస్పత్రి చుట్టూ తిరిగడం వల్ల ఇటు ఆర్థిక భారంతోపాటు, అటు ఉపాధి కూలీ కూడా కోల్పోతున్నారు. దీనంతటికి కారణం ఆస్పత్రికి వచ్చే వారికి సరైన సమాచారం అందకపోవడమే. -
రైల్వేస్టేషన్లో గర్భిణి ప్రసవం
పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్: మానవత్వం పరిమళించింది. నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని తోటి ప్రయూణికులు ఆదుకున్నా రు. ఒడిశాలోని రాయగడ జిల్లా తెరవళికి చెందిన తట్టికోట సింహాచలం, గర్భిణి అయిన తన భార్య రమను పార్వతీపురంలోని ఏరియూ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వచ్చే దుర్గ్ పాసిం జర్‌లో తీసుకువస్తుండగా..కూనేరు రైల్వేస్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి నొప్పులు ఎక్కువయ్యూయి. వెంటనే తోటి ప్రయూణికులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పార్వతీ పురం టౌన్ స్టేషన్‌కు వచ్చే సరికి నొప్పులు అధికం కావడంతో అప్పటికే అక్కడకు వచ్చిన 108 సిబ్బంది ఈఎంటీ జి.చిన్నంనాయుడు, పైలట్ బి.అప్పారావు మహిళా ప్రయాకుల సహాయంతో స్టేషన్లోనే చీరలు అడ్డు పెట్టి ప్రసవం చేయించారు. అనంతరం 108 వాహనం లో తల్లీ, బిడ్డలను ఏరియూ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.