రైల్వేస్టేషన్‌లో గర్భిణి ప్రసవం | Pregnant Delivery railway station | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో గర్భిణి ప్రసవం

Published Sun, Dec 29 2013 4:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

Pregnant Delivery  railway station

పార్వతీపురం టౌన్, న్యూస్‌లైన్: మానవత్వం పరిమళించింది. నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని తోటి ప్రయూణికులు ఆదుకున్నా రు. ఒడిశాలోని రాయగడ జిల్లా తెరవళికి చెందిన తట్టికోట సింహాచలం, గర్భిణి అయిన తన భార్య రమను పార్వతీపురంలోని ఏరియూ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం రాయగడ నుంచి విశాఖపట్నం వైపు వచ్చే దుర్గ్ పాసిం జర్‌లో తీసుకువస్తుండగా..కూనేరు రైల్వేస్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి నొప్పులు ఎక్కువయ్యూయి. వెంటనే తోటి ప్రయూణికులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పార్వతీ పురం టౌన్ స్టేషన్‌కు వచ్చే సరికి నొప్పులు అధికం కావడంతో అప్పటికే అక్కడకు వచ్చిన 108 సిబ్బంది ఈఎంటీ జి.చిన్నంనాయుడు, పైలట్ బి.అప్పారావు మహిళా ప్రయాకుల సహాయంతో స్టేషన్‌లోనే చీరలు అడ్డు పెట్టి ప్రసవం చేయించారు. అనంతరం 108 వాహనం లో తల్లీ, బిడ్డలను ఏరియూ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement