రవిశంకర్‌కు సీఎం వీడియోకాల్ | kcr invites ravishankar for yagam through video call | Sakshi
Sakshi News home page

రవిశంకర్‌కు సీఎం వీడియోకాల్

Published Wed, Dec 16 2015 2:23 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

రవిశంకర్‌కు సీఎం వీడియోకాల్ - Sakshi

రవిశంకర్‌కు సీఎం వీడియోకాల్

చండీయాగానికి రావాలంటూ ఆహ్వానం

 సాక్షి, హైదరాబాద్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను అయుత చండీ మహాయాగానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. షిల్లాంగ్‌లో ఉన్న రవిశంకర్‌తో ముఖ్యమంత్రి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఈనెల 23 నుంచి 27 వరకు జరిగే చండీ యాగానికి వచ్చి ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. దీనికి రవిశంకర్ సానుకూలంగా స్పందించారు. 

 నేడు శృంగేరీ మఠానికి సీఎం: శృంగేరీ మఠాధిపతిని చండీయాగానికి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కర్ణాటకలోని శృంగేరికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు  ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శృంగేరీ మఠానికి చేరుకుంటారు. భారతీ తీర్థ స్వామి, విధుశేఖర భారతీస్వామిని కలసి చండీ యాగానికి ఆహ్వానిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుగుపయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement