ఎర్రవల్లి ఫాంహౌస్లో రేపు కేసీఆర్ ప్రెస్ మీట్ | cm kcr press meet tomorrow On ayuta chandiyagam | Sakshi
Sakshi News home page

ఎర్రవల్లి ఫాంహౌస్లో రేపు కేసీఆర్ ప్రెస్ మీట్

Published Thu, Dec 17 2015 8:30 PM | Last Updated on Thu, Jul 11 2019 7:45 PM

cm kcr press meet tomorrow On  ayuta chandiyagam

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుక్రవారం మధ్యాహ్నం ఎర్రవల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన అయుత చండీయాగం వివరాలను మీడియాకు వివరించనున్నారు. మెదక్‌ జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్ ఈ నెల 23 నుంచి 27 వరకు ఈ యాగాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

 

ఈ యాగాన్ని 1500 మంది రుత్వికుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శృంగేరీ పీఠం వేద పండితుల పర్యవేక్షణలో యాగం జరగనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు. అలాగే పలువురు ప్రముఖులతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఈ యాగానికి హాజరు అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement