జమ్మల మడుగు, కోవెలకుంట్ల మధ్య భారీగా ట్రాఫిక్ జాం | heavy traffic jam between jammala madugu- kovelakuntla in ysr district | Sakshi
Sakshi News home page

జమ్మల మడుగు, కోవెలకుంట్ల మధ్య భారీగా ట్రాఫిక్ జాం

Published Sat, Sep 26 2015 9:12 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

heavy traffic jam between jammala madugu- kovelakuntla in ysr district

వైఎస్ఆర్ జిల్లా: కడప జిల్లా జమ్మల మడుగు, కోవెలకుంట్ల రహదారిలో మాయలూరు గ్రామం వద్ద శనివారం ఉదయం భారీగా ట్రాఫీక్ జాం అయింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో రెండు గంటలనుంచి ఎక్కడ నిలిచిన వాహనాలు అక్కడే ఉన్నాయి.


కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఆ ప్రాంతంలో గత పదేళ్లనుంచి ఇంతగా వర్షం పడలేదని...ఇలా ట్రాఫిక్ జాం అవ్వడం ఇంతకు ముందెప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. రెండు గంటల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ఇంకా అధికారులెవరు అక్కడికి రాలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement