JAM
-
గులాబీ రేకులతో స్వీట్ : బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు
గులాబీ పువ్వులు సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కంద్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేదం చెబుతోంది.గుల్కంద్ అనే పదం గుల్ నుండి వచ్చింది. దీని అర్థం పెర్షియన్ భాషలో 'పువ్వు' అరబిక్‌లో 'కంద్' అంటే 'తీపి'. ముఖ్యంగా ఈ వేసవిలో గులాబీ రేకుల జామ్ లేదా గుల్కంద్ వల్ల ఒంటికి చలవ చేస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఫిట్‌గా ఉంచే అద్భుతమైన టానిక్‌లా పనిచేసే గుల్కంద్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు.. లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన గులాబీ రేకులు వెడల్పుమూత ఉన్న గాజు సీసా, లేదా జార్ యాలకులు గులాబీ రేకులను బాగా ఎండబెట్టాలి. ఎండిన వాటిని ఒక గాజు సీసాలో వేసి, దానికి కొద్దిగా చక్కెర, యాలకుల పొడి కలుపుకోవాలి. గాజు సీసాను ప్రతిరోజూ దాదాపు ఏడు గంటలపాటు ఎండలో ఉంచాలి. మళ్లీ రాత్రికి చెక్క స్పూన్‌తో లేదా తడిలేని గరిటెతో బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా దాదాపు నెల రోజుల పాటు ఇలా చేయాలి. దీంతో జామ్‌లాగా ఇది తయారవుతుంది. దీన్ని పలు రకాల స్వీట్లలో వాడతారు. అలాగే ఫ్రూడ్ సలాడ్లలో వాడవచ్చు. కాస్త చల్లటి పాలు తీసుకుని అందులో ఒక చెంచా గుల్కంద్ వేసి తాగవచ్చు. అలాగే దీన్ని నేరుగా లేదా తమలపాకులతో కూడా తినవచ్చు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఈ గులాబీ గుల్కంద్ ఆయుర్వేద ప్రకారం పిత్త దోషాలకు చాలా మంచిది. వేడిని పుట్టిస్తుంది. చల్లగా ఉండేలాగా కూడా పనిచేస్తుంది దద్దుర్లు, నొప్పులు ,నొప్పులు వంటి వేడి-సంబంధిత లక్షణాలను తగ్గిస్తుంది , అరికాళ్ళు అరచేతులలో ఏవైనా మంటలను తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇది కాలక్రమేణా కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. అందుకే దీన్ని తాంబూలంలో కూడా ఎక్కువగా వాడతారు. రక్తహీనతను నివారిస్తుంది, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి ఇది చాలా మంచిది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది కప్పు పాలలో వేసి రాత్రిపూట తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది చర్మం త్వరగా ముడతలు పడకుండా నివారిస్తుంది. మొటిమల మచ్చలను కూడా తగ్గిస్తుంది. గుల్కంద్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తీవ్రమైన అల్సర్లు, మలబద్ధకం, గుండె మంట సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. వేసవిలో గుల్కంద్ వాడటం వల్ల వడదెబ్బ, ముక్కు కారటం, తలతిరగడం వంటివి నివారించవచ్చు. బహిష్టు సమయంలో అధిక రక్తస్రావానికి గుల్కంద్ మంచిది. ముఖ్యంగా పీసీఓడీతో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచిది. థైరాయిడ్‌తో బాధపడేవారు కూడా ఈ జామ్ని చక్కగా తీసుకోవచ్చు -
చిలకలూరిపేట సభపై ఎల్లో మీడియా వక్రభాష్యం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంలోకి వెళుతున్నట్లుగా ఉంది. ఒకవైపు జనసేన, BJPలను బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్న ఆయన, వ్యవస్థలపై దృష్టి సారించినట్లుగా ఉంది. 58 నెలలపాటు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని నిత్యం కేసులు వేస్తూ , ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు కీలకమైన ఈ రెండు నెలలు తన మిత్రపక్షం బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి వీలైనంతమేర YSR కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అన్ని రాజకీయ పార్టీలకు ఈ రెండు నెలలు కీలకం అవుతాయి. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న కూటమి సభ విఫలం అవడంతో , ఆ నెపం మొత్తాన్ని పోలీసులపైన తోసేసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు ఆరంభించారు. DGPతో పాటు కొందరు IPS అధికారులను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముఖ్య అదికారి మీనాకు ఫిర్యాదు చేసింది. దానిపై జనసేన, BJP ప్రతినిధులు కూడా సంతకాలు చేసి ఆ పాపంలో పాలు పంచుకున్నారు. నిజంగా ప్రధాని మోడీ సభ అంత నాసిరకంగా జరగడానికి కారణం ఎవరు? నిర్వహణ బాధ్యతలన్నీ తెలుగుదేశం నేతలే తీసుకున్నారు కదా! అలాంటప్పుడు వైఫల్యానికి కూడా వారే బాద్యత వహించాలి కదా! దానిని కప్పిపుచ్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. (సభ ఏర్పాట్లను పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించిన లోకేష్) మిత్రపక్షంగా బిజెపి అయిందో లేదో, వెంటనే చంద్రబాబు నాయుడు తన మేనేజ్ మెంట్ స్కిల్ ఉపయోగించి ఎన్నికలను నెల రోజులు ఆలస్యంగా జరిగేలా చేశారన్నది ఎక్కువ మంది భావన. ఇక ఇప్పుడు ఎపిలో చిత్తశుద్దితో పనిచేస్తున్న పోలీసు అధికారులపై దాడి చేసి వారిని భయోత్పాతానికి గురి చేయడం ద్వారా లబ్ది పొందాలన్న కుట్రకు తెరలేపారు. అందుకే మోడీ సభకు సంబందించి టిడిపి ఫిర్యాదు చేసిందన్న భావన ఏర్పడింది. ఆ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్న అంశాలు చూడండి. తాము ముందస్తుగానే పోలీసులకు భద్రత ఏర్పాట్ల గురించి లేఖ రాసినా, అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, భద్రత ఏర్పాట్లలో లోపాలకు డిజిపి బాద్యుడని ఎన్నికల ముఖ్య అధికారికి టిడిపి రాసిన లేఖలో తెలిపింది. జన సమూహాన్ని నియంత్రించడం, ట్రాఫిక్‌ను క్రమబద్దం చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని టిడిపి ఆరోపణ. అందువల్లే కూటమి బహిరంగ సభలో ప్రజలు తోసుకుంటూ ముందుకు వచ్చారని, అలాగే మైక్ సౌండ్ సిస్టమ్ వైపు కూడా వచ్చారని టిడిపి పేర్కొంది. దానివల్ల మోడీ స్పీచ్ ఇస్తున్నప్పుడు పలుమార్లు మైక్ ఆగిపోయిందని ఆ పార్టీ ఫిర్యాదుగా ఉంది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని ఆ పార్టీ ఆరోపించింది. ప్రధాని పలుమార్లు టవర్ల నుంచి దిగాలని సభకు వచ్చినవారిని కోరినా, పోలీసులు చొరవ తీసుకోలేదని పార్టీ ఆరోపించింది. మోడీని సత్కరించడానికి తెచ్చిన పుష్పగుచ్చాన్ని కాని, శాలువాని కాని పోలీసులు అనుమతించలేదని చిత్రమైన ఫిర్యాదు చేసింది. ఇదంతా YSRCPతో పోలీసులు కుమ్మక్కయి కుట్ర చేశారని టిడిపి అభియోగం. ఇక సభకు వస్తున్న వాహనాలను జాతీయ రహదారిపై కావాలని ఆపేశారని మరో ఆరోపణ చేసింది. సభకు వచ్చిన వారి అత్యుత్సాహం వల్లే మైక్ సిస్టమ్ పని చేయకుండా నిలిచిపోయిందని మాత్రం టిడిపి అంగీకరించడం విశేషం. డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఐజి పాలరాజు, పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డిలపై ఆరోపణలు గుప్పిస్తూ టిడిపి ఈ లేఖ రాసింది. (సభలో పరిస్థితి) ఈ లేఖలోని ఆరోపణలపై జాగ్రత్తగా పరిశీలన చేసినా, విచారణ జరిపినా కొన్ని విషయాలు తేలికగా తెలిసిపోతాయి. లేఖ ఆసాంతం పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడుతుంది. ప్రధాని మోడీ పాల్గొన్న సభకు భద్రత ఏర్పాట్ల నిమిత్తం నాలుగువేల మంది పోలీసులను నియమించారు. అయినా తక్కువ మందిని పెట్టారని అసత్యపు ఆరోపణను కూటమి నేతలు చేశారు. కరెంటు పోయిందన్నది అబద్దమని చెబుతున్నారు. సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా విద్యుత్ లైనే లేదట. సభ అంతా జనరేటర్ పై ఆధారపడి ఏర్పాటు చేసుకున్నారట. అలాంటప్పుడు కరెంటు పోయే సమస్య ఎక్కడ నుంచి వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మైక్ సిస్టమ్ సరైనది ఎంపిక చేసుకునే బాధ్యత టిడిపి వారిదే కాని, పోలీసులకు ఏమి సంబంధం? చిలకలూరిపేట ప్రాంతంలో రికార్డింగ్ డాన్స్ లకు వాడే మైక్ సిస్టమ్‌ను తెలుగుదేశం నేతలు తీసుకురావడంతోనే ఈ సమస్య వచ్చిందన్నది స్థానికుల అభిప్రాయంగా ఉంది. ఒకసారి ప్రధాని భద్రత కోసం వచ్చే ప్రాంగణాన్ని SPG అధీనంలోకి తీసుకున్న తర్వాత స్థానిక పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉండవు. SPG అనుమతి ఇచ్చి ఉంటే ప్రధాని కోసం టిడిపి తెచ్చిన పుష్పగుచ్ఛం, శాలువాను స్థానిక పోలీసులు అనుమతించకుండా ఎలా ఉంటారు? (మోదీని సన్మానిస్తారని ప్రకటన చేయగా.. శాలువాలు, పూలబోకే లేక దిక్కులు చూస్తోన్న బాబు, పవన్) టిడిపి నేతలు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలని పోలీసు అధికారుల సంఘం నేతలు చెబుతున్నారు. పోలీసులకు రాజకీయ రంగు పులమడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సభ ఎజెండా ఖరారు చేసుకునేటప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయా ? లేదా? అన్నది చూసుకోవల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంటుంది. వారు వాటిని ఎందుకు చెక్ చేసుకోలేదు? ఇదే టైమ్ లో బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒక విగ్రహ జ్ఞాపికను వేదిక మీదకు ఎలా తీసుకు వెళ్లగలిగారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేతులూపుకుంటూ వెళ్లి కూర్చున్నారే కాని, ప్రధానిని సత్కరించడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి ఎందుకు ఆరా తీయలేదో తెలియదు. రోడ్లపై ట్రాఫిక్ ను రెగ్యులేట్ చేయలేదని ఇంకో తప్పుడు ఆరోపణ చేశారు. నిజానికి ఈ సభ కోసం భారీగా ఏమీ వాహనాలు రాలేదు. ఆ విషయం గమనించిన తెలుగుదేశం వారు రోడ్డుపై కొన్ని వాహనాలను అడ్డంగా నిలిపి, చాలా వాహనాలు ఆగిపోయినట్లు కలరింగ్ ఇస్తూ దానిని డ్రోన్ ద్వారా వీడియో తీశారు. కాని ఆ విషయం బయటపడిపోవడంతో ఈ దిక్కుమాలిన ఫిర్యాదు చేశారు. ఎప్పుడూ ఏదో ఒక అబద్దపు ప్రచారంతో నెట్టుకువచ్చే తెలుగుదేశం పార్టీ ఈ రకంగా కూడా ప్రజలను మోసం చేసే యత్నం చేసింది. RTC బస్ లు తగినన్ని ఇవ్వలేదని టిడిపి మీడియా ప్రచారం చేసింది. విషయం ఏమిటంటే 2500 RTC బస్‌లను రిజర్వు చేసుకున్న టిడిపి వాటిలో 1500 బస్ లను ఎందుకు కాన్సిల్ చేసిందో కూడా వివరించాలి కదా! అసలు రాష్ట్రంలో వారివల్ల ఎక్కడ ఏ తప్పు జరిగినా, ముందుగా ఎదుటివారిపై తోసేయడం చంద్రబాబు బృందానికి అలవాటేనన్నది రాజకీయ వర్గాల విమర్శగా ఉంది. ప్రధాని మోడీ సభలో ఏదైనా అలజడి జరిగితే దానిని ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్ది పొందాలన్నది వారి లక్ష్యం కావచ్చని అనుమానిస్తున్నారు. సభలో ప్రజలు ఎవరూ టవర్లు ఎక్కకుండా అక్కడ పార్టీ వలంటీర్లనో, కార్యకర్తలనో పెట్టుకోవలిసిన టిడిపి ఎందుకు ఆ పని చేయలేదు? ఆయా టిడిపి సభలలో ఒక యాంకర్ మాదిరి వైర్ లెస్ కార్డు సిస్టమ్ వాడి ప్రసంగం చేసే చంద్రబాబుకు పాతపద్దతిలో మైక్ సిస్టమ్ ఎలా అనుమతించారు? గతంలో కందుకూరు వద్ద ఇరుకు రోడ్డుపై సభ పెట్టి తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన ఏం చేశారు? గుంటూరులో చంద్రబాబు సభకు వచ్చేవారికి చీరలు ఇస్తామని ప్రకటించి,వేలాది మంది వచ్చేలా చేసి, అక్కడ సరిగా నిర్వహించకుండా తొక్కిసలాట జరిగినప్పుడు ఏం చేశారు? మనుష్యులు మరణించినప్పుడు ఆ నెపాన్ని పోలీసులపైనే నెట్టేయలేదా? గోదావరి పుష్కరాలలో చంద్రబాబు ప్రచార యావవల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించినప్పుడు చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడింది గుర్తు లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా అని ప్రశ్నించి అందరిని విస్తుపరిచారు. ఇప్పుడు తమ పార్టీ ప్రయోజనాల కోసం అలాంటి ఘటన ఏదైనా జరిగితే ప్రయోజనం అని ఏమైనా భావించారా అన్న విమర్శను కొందరు చేస్తున్నారు. కేవలం పోలీసు ఉన్నతాధికారులను భయపెట్టి , తమ పార్టీ అభ్యర్ధులు చేసే డబ్బు పంపిణీ, కానుకల పంపిణీ వంటి వాటికి అడ్డు రాకుండా చూసుకోవాలన్న ఆలోచనతో వారిపై ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది. దానికి తగినట్లే ఈనాడు మీడియా ఇదంతా పోలీసుల వైఫల్యం అని, కేంద్రం నిఘా అధికారులు నివేదిక పంపించారంటూ కధనాన్ని కూడా ప్రచారం చేసింది. పైగా పల్నాడు ఎస్పిపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవచ్చంటూ రాసేసింది. అసలు విచారణ చేసిందెప్పుడు, సంబందిత అధికారుల వివరణ కోరిందెప్పుడు? నివేదికను కేంద్రానికి పంపిందెప్పుడు? అదే నిజమైతే ఈనాడు మీడియాకే ఎందుకు ఇచ్చారు? అంటే ఇదంతా ఒక కుట్రగా కనిపించడం లేదా!ఇంతకాలం కోర్టులను అడ్డంపెట్టుకుని ఇలాంటి కధలను నడిపిన టిడిపి, ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా, ఇప్పుడు కొత్త తరహా కుట్రలకు తెరలేపినట్లుగా ఉంది. అందులో భాగంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారనుకోవాలి.ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. జనం అంతా సభ విఫలం అయిందని, మోడీకి అవమానకరంగా సభ నడిచిందని అనుకుంటుంటే, ఈనాడు మాత్రం అందుకు భిన్నంగా టీవీలో ఒక ప్రచారం చేసింది. సభ ముగిసిన వెంటనే ప్రధానిని చంద్రబాబు, పవన్ కలిశారని, ఆ సందర్భంగా మోడీ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారని టీవీలో వార్తలు ఇచ్చింది. అది నిజమే అయితే ఇప్పుడు ఆ వైఫల్యం..ఈ వైఫల్యం అంటూ కొత్తబాణి ఎందుకు అందుకున్నట్లు? - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు -
1996లో తయారు చేసిన జామ్! ఇప్పటికీ టేస్ట్..
నిజానికి నిర్దేశిత ఏళ్లు లేదా రోజులు మాత్రమే కొన్ని రకాలైన ఆహార పదార్థాలను ప్రిజర్వ్ చేయగలం. అంతకు మించి నిల్వ చేస్తే టేస్ట్‌లో తేడా వస్తుంది. రుచి కూడా పాడవ్వుతుంది. కానీ ఇక్కడో బామ్మ 1996లో తయారు చేసిన జామ్ ఎలా ఉందో వింటే షాకవ్వుతారు. అయితే ఇప్పుడు దాని టేస్ట్ ఎలా ఉందంటే..! ఒక కంటెంట్ క్రియేటర్ ఇటీవల తన అమ్మమ్మ తాతయ్యలు ఉండే ఇంటికి వెళ్లింది. అక్కడ తన అమ్మమ్మల కాలం నాటి వస్తువులను గమనిస్తోంది. అక్కడ తన అమ్మమ్మ ఇంటిలో జాగ్రత్తగా భద్రపర్చిన కొన్ని రకాల జామ్ బాటిళ్లను చూసింది. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ టేస్ట్ చేసే యత్నం చేయలేదు. ఎందుకో అనకోకుండా ఒక రోజు ఆ జామ్ డబ్బాలను పరిశీలనగా చూస్తూ..1996లో తయారయ్యిన జామ్ డబ్బాను తీసుకుంది. దాన్ని ఓపెన్ చేసి ఎలాగైన టేస్ట్ చెయ్యాలనుకుంది. అయితే ఇంట్లో వాళ్లంతా వద్దు వద్దు అని వారించారు. అయితే అవేమీ పట్టించకోకుండా తన అమ్మమ్మ చేత్తో తయారయ్యిన జామ్ని టేస్ట్ చేయాల్సిందే అని చూడగా..ఒక్కసారిగా ఆమె ముఖంలో ఓ అద్భుతమైన రియాక్షన్ వచ్చింది. ఆమె ఆ జామ్ రుచికి ఫిదా అయ్యిపోయింది. అస్సలు పాడవ్వకుండా మరింత రుచివ్వెలా ఉంది ఈ జామ్ అని షాకయ్యింది. పైగా ఆమె ఎంతో సంబరపడి తన సోదరులను కూడా రుచి చూడమని చెబుతుంది. వారంతా రుచి చూసి ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ టైంలోని వైరస్ మీ శరీరంలో దాగుండి అటాక్ చేస్తుందంటూ కామెంట్లు చూశారు. కట్ చేస్తే.. మూడు రోజుల తర్వాత ఆమె నేను బాగానే ఉన్నా బతికే ఉన్నా అంటూ పోస్ట్‌లు పెట్టింది. అంతేగాదు ఆకాలం వారికి నిల్వ చేయడం సవాలుగా ఉండేది. అందువల్ల ఒక వస్తువుని ఆరోగ్యకరమైన విధంగా నిల్వం చేయడం ఎలా అనేది వారికి బాగా తెలుసు. ఈ చక్కెర కూడా పదార్థాల రుచి పోకుండా కాపాడుతుందని అన్నారు. తన అమ్మమ్మ సుదీర్థకాలం జామ్ రుచి పాడవ్వకుండా ఉండేలా కొన్ని టెక్నిక్స్ కూడా తనకు నేర్పిందంటూ అమ్మమ్మతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. View this post on Instagram A post shared by Georgiana | London Life (@hrhgeorgiana) (చదవండి: కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బొలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు!) -
ప్రేమతో... జామ్
న్యూఢిల్లీ: ఎప్పుడూ రాజకీయాలతో బిజీ బిజీగా గడిపే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు గరిటె పట్టారు. తల్లి సోనియాగాంధీతో కలిసి బత్తాయి జామ్ తయారు చేశారు. పెరట్లో పండిన బుల్లి బత్తాయిలతో తయారు చేసిన ఆ జామ్ తనకెంతో ఇష్టమని సోనియా చెప్పారు. ఈ ఆసక్తికర వీడియోను నూతన సంవత్సరం సందర్భంగా రాహుల్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి తోటలోని బత్తాయిలను తెంపుకొచ్చి జామ్ తయారు చేస్తూ తమ ఆహార ఇష్టాయిష్టాలను సరదాగా పంచుకున్నారు. కావాలంటే బీజేపీ వాళ్లకు కూడా జామ్ ఇద్దామని రాహుల్ అంటే, ‘మనకే తిరిగిచ్చేస్తా’రని సోనియా బదులిచ్చారు. జామ్ రెసిపీ తన చెల్లెలు ప్రియాంకదని రాహుల్ వెల్లడించారు. తల్లికి ఒకప్పుడు పచ్చళ్లు నచ్చేవి కావని, ఇప్పుడవి ఎంతో ఇష్టమని రాహుల్ అన్నారు. బ్రిటన్‌లో ఉండగా వంట నేర్చుకున్నానన్నారు. తానెప్పుడు విదేశాల నుంచి తిరిగొచ్చినా ముందుగా పప్పన్నం తినాల్సిందేనని సోనియా చెప్పారు. మాటల మధ్యే తయారైన జామ్‌ను ఇద్దరూ కలిసి చిన్న గాజు సీసాల్లో నింపారు. ‘ప్రేమతో.. సోనియా, రాహుల్’ అని రాసి స్నేహితులు, బంధువులకు పంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. -
ఐదు రోజులు సెలవులు.. అర్ధరాత్రైనా ఇంటికి చేరుకోని ధైన్యం
బెంగళూరు: వరుసగా ఐదు రోజులు సెలవులు రావడంతో బెంగళూరులో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. బుధవారం సాయంత్రం కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల తపబడి వాహనదారులు రోడ్లపైనే వేచి ఉన్నారు. పాఠశాల విద్యార్థులు సైతం అర్థరాత్రి వరకు రోడ్లపైనే గడిపారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగిపోయిందని పోలీసులు తెలిపారు. ఐదు రోజులు.. ఈ వీకెండ్‌కు ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ రోజు ఈద్ మిలాద్ ఉన్ నబీకి అధికారికంగా సెలవు ఉంటుంది. కర్ణాటక-తమిళనాడు మధ్య చెలరేగుతున్న కావేరి నదీ జలాల వివాదంపై రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. టెక్ కంపెనీలకు శనివారం, ఆదివారం సెలవులు ఉంటాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పబ్లిక్ హాలిడే. దీంతో నగరవాసులు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. బుధవారం సాయంత్రం ట్రాఫిక్ ఒక్కసారిగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సాధారణ రోజుకు రెండింతలు ట్రాఫిక్ పెరిగిందని వెల్లడించారు. సాధారణంగా రోడ్లపై వాహనాల సంఖ్య 1.5 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. కానీ బుధవారం ఆ సంఖ్య ఏకంగా 3.5 వరకు పెరిగిందని స్పష్టం చేశారు. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇదీ చదవండి: అప్పులు చేసి ఆడంబర వివాహాలొద్దు -
IIT JAM 2022: ఐఐటీలకు మరో మార్గం.. జామ్
ఐఐటీలు..దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు. ఈ విద్యాసంస్థలు బీటెక్, ఎంటెక్ వంటి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులేకాకుండా.. సైన్స్, మేనేజ్మెంట్ తదితర కోర్సులను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీలు సైన్స్ సబ్జెక్టుల్లో అందించే ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సులకు ఎంతో డిమాండ్ ఉంది. వీటిల్లో ప్రవేశానికి మార్గం.. జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్(జామ్)! దేశవ్యాప్తంగా నిర్వహించే జామ్‌లో విజయం సాధిస్తే.. ఐఐటీల్లో పీజీ స్థాయి కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు. ఇటీవల ఐఐటీ జామ్–2022 షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. జామ్‌తో ప్రవేశం కల్పించే ఇన్స్టిట్యూట్లు, కోర్సులు, పరీక్ష విధానం, పరీక్షలో విజయానికి ప్రిపరేషన్ టిప్స్.. ఐఐటీల్లో ఏ కోర్సు చదివినా.. ఉజ్వల కెరీర్ ఖాయమనే అభిప్రాయం. అందుకే ఇంటర్ అర్హతగా నిర్వహించే జేఈఈ–అడ్వాన్స్డ్ మొదలు.. బీటెక్ ఉత్తీర్ణులు రాసే గేట్ వరకూ.. ఐఐటీల్లో అడ్మిషన్ కోసం ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. కానీ అందుబాటులో ఉన్న సీట్లు, పోటీని పరిగణనలోకి తీసుకుంటే.. అవకాశం దక్కేది కొందరికే. అడ్వాన్స్డ్, లేదా గేట్ ద్వారా ప్రవేశం లభించకపోయినా.. అంతగా నిరుత్సాహపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే.. ఐఐటీల కలను నిజం చేసుకునేందుకు మరో మార్గం ఉంది.. అదే జామ్!! జామ్ అంటే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్నే సంక్షిప్తంగా జామ్ అని పిలుస్తున్నారు. దీన్ని ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఒక్కో ఐఐటీ ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపడుతుంది. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ–రూర్కీ.. జామ్–2022 షెడ్యూల్‌ను ప్రకటించింది. అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీలో కనీసం 55శాతం మార్కులు లేదా 5.5 సీజీపీఏ సాధించాలి. 2022లో చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు సెప్టెంబర్ 30, 2022లోపు సర్టిఫికెట్లు అందించాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్లు జామ్‌లో ప్రతిభ ఆధారంగా దేశ వ్యాప్తంగా 20 ఐఐటీలు, ఐఐఎస్సీ–బెంగళూరుల్లో రెండేళ్ల ఎమ్మెస్సీ, పీహెచ్డీ స్థాయి ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం లభిస్తుంది. ప్రస్తుతం ఐఐటీ–భిలాయ్, భువనేశ్వర్, ముంబై, ఢిల్లీ, ధన్‌బాద్, గాంధీనగర్, గువహటి, హైదరాబాద్, ఇండోర్, జోథ్‌పూర్, కాన్పూర్, ఖరగ్‌పూర్, చెన్నై, మండి, పాలక్కాడ్, పాట్నా, రూర్కీ, రోపార్, తిరుపతి, వారణాసి క్యాంపస్‌లతోపాటు ఐఐఎస్సీ–బెంగళూరులోనూ ఆయా కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. కోర్సులు ► జామ్‌లో సాధించిన స్కోర్‌తో.. ఎమ్మెస్సీ(రెండేళ్లు); మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్(రెండేళ్లు); జాయింట్ ఎమ్మెస్సీ–పీహెచ్డీ; ఎమ్మెస్సీ–పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ; పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్; ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందొచ్చు. ► వీటితోపాటు ఐఐఎస్సీ బెంగళూరులో బయలాజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగాల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ అందుబాటులో ఉంది. జామ్ స్కోర్ ఆధారంగా ఈ ఇన్స్టిట్యూట్ సొంతంగా ప్రవేశ ప్రక్రియ చేపడుతుంది. ఇందుకోసం అభ్యర్థులు ఐఐఎస్సీ బెంగళూరు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో కనిష్టంగా 15 మందికి, గరిష్టంగా 23 మందికి ప్రవేశం కల్పిస్తారు. ఏడు పేపర్లలో పరీక్ష జామ్ పరీక్షను మొత్తం ఏడు పేపర్లలో నిర్వహిస్తారు. అవి.. బయోటెక్నాలజీ; కెమిస్ట్రీ; ఎకనామిక్స్; జియాలజీ; మ్యాథమెటిక్స్;మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్; ఫిజిక్స్. అభ్యర్థులు గరిష్టంగా రెండు పేపర్లకు హాజరవ్వొచ్చు. ఈ విషయాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాల్సి ఉంటుంది. మూడు విభాగాలు ► జామ్ పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో జరుగుతుంది. ► సెక్షన్ ఏ: 30 మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్(ఎంసీక్యూ)ఉంటాయి. ఈ విభాగంలో 10 ఒక మార్కు ప్రశ్నలు, రెండు మార్కుల ప్రశ్నలు 20 అడుగుతారు. ► సెక్షన్ బీ: ఈ విభాగంలో 10 మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్(ఎంఎస్క్యూ) ఉంటాయి. వీటిలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉంటాయి. అభ్యర్థులు అడిగిన ప్రశ్నకు సరితూగే సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు లభిస్తాయి. ► సెక్షన్ సీ: ఈ విభాగంలో 20 న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు అడుగుతారు. వీటిలో 10 ప్రశ్నలకు 1 మార్కు చొప్పున, 10 ప్రశ్నలకు 2 మార్కులు చొప్పున కేటాయిస్తారు. ► ఇలా మొత్తం మూడు గంటల వ్యవధిలో 60 ప్రశ్నలు–100 మార్కులకు జామ్ పరీక్ష జరుగుతుంది. ► నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. ఎంఎస్క్యూ, ఎన్ఏటీ ప్రశ్నలకు ఎలాంటి నెగెటివ్ మార్కులు ఉండవు. ఆన్లైన్ విధానంలో సీట్ల కేటాయింపు జామ్‌లో స్కోర్ సాధించిన అభ్యర్థులు ఆ తర్వాత దశలో.. ఐఐటీల్లో ప్రవేశం కోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం.. జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్(జేఓఏపీఎస్)ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు. అభ్యర్థులు ఈ పోర్టల్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకొని.. ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేయాలి. ఈ దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న కోర్సులు, ఇన్స్టిట్యూట్ల ప్రాథమ్యాలను పేర్కొనాలి. ఆ తర్వాత అభ్యర్థులు సాధించిన స్కోర్, పేర్కొన్న ప్రాథమ్యాల ఆధారంగా ఆన్లైన్లోనే సీట్ అలాట్మెంట్ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నాలుగు రౌండ్లలో నిర్వహిస్తారు. సిలబస్.. ప్రిపరేషన్ ఐఐటీ–జామ్‌లో విజయం సాధించేందుకు..అభ్యర్థులు తమ అకడమిక్ సబ్జెక్ట్‌లకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీస్థాయి పుస్తకాలను సమగ్రంగా చదవాలి. కెమిస్ట్రీ ఫిజికల్ కెమిస్ట్రీ: బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్టులు, అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్, థియరీ ఆఫ్ గ్యాసెస్, సాలిడ్ స్టేట్, కెమికల్ థర్మోడైనమిక్స్, కెమికల్ అండ్ ఫేజ్ ఈక్విలిబ్రియా, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనటిక్స్, అబ్సార్పన్, స్పెక్టోమెట్రి; ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ స్పెక్టోమెట్రి బేసిక్ కాన్సెప్టులు, ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం, సింథటిక్ అప్లికేషన్స్,క్వాలిటేటివ్ ఆర్గానిక్ అనాలసిస్, ఆరోమాటిక్ అండ్ హెటిరోసైక్లిక్ కెమిస్ట్రీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. పిరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, షేప్స్ ఆఫ్ కాంపౌండ్స్, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ మెటల్స్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ తదితర అంశాలు చదవాలి. బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ పేపర్‌కు హాజరయ్యే అభ్యర్థులు బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ను ప్రిపేరవ్వాల్సి ఉంటుంది. బయాలజీ విభాగానికి సంబంధించి పదో తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు అకడమిక్స్ పుస్తకాలను చదవడం లాభిస్తుంది. జనరల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రోబయాలజీ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ పాఠ్యాంశాలను చదవాలి. మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ఇంటర్ స్థాయిలో చదివితే సరిపోతుంది. ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్, మాక్రో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్, ఇండియన్ ఎకానమీ, మ్యాథమెటిక్స్ ఫర్ ఎకనామిక్స్‌లను అధ్యయనం చేయాలి. జియాలజీ ప్లానెట్ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పాలియోంటాలజీ, స్టాటిగ్రఫీ, మినరాలజీ, పెట్రోలజీ, ఎకనామిక్ జియాలజీ, అప్లయిడ్ జియాలజీలపై దృష్టి పెట్టాలి. మ్యాథమెటిక్స్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్ ఆఫ్ రియల్ నంబర్స్, ఫంక్షన్స్ ఆఫ్ వన్/టూ/త్రీ రియల్ వేరియబుల్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టార్ క్యాల్కులస్, గ్రూప్ థియరీ, లీనియర్ ఆల్జీబ్రా, రియల్ అనాలసిస్ పాఠ్యాంశాలను ప్రిపేరవ్వాలి. మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్‌కు 40 శాతం, స్టాటిస్టిక్స్‌కు 60 శాతం వెయిటేజీ ఉండే ఈ పేపర్లో.. మ్యాథ్స్‌కు సంబంధించి సీక్వెన్సెస్ అండ్ సిరీస్, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటెగ్రల్ క్యాల్కులస్, మాట్రిసెస్ చాప్టర్లను అధ్యయనం చేయాలి. స్టాటిస్టిక్స్‌లో ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్, సాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్, లిమిట్ థీరమ్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథీసిస్లను అధ్యయనం చేయాలి. ఫిజిక్స్ మ్యాథమెటికల్ మెథడ్స్, మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మేటర్, ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం, కైనటిక్ థియరీ, థర్మోడైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, డివైజెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ పాఠ్యాంశాలను అభ్యసనం చేయాలి. ఐఐటీ–జామ్ 2022 ముఖ్య సమాచారం ► ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 30, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 11, 2021 ► అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: జనవరి 4, 2022 ► జామ్ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 13, 2022 ► ఫలితాల వెల్లడి: మార్చి 22, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://jam.iitr.ac.in -
జామ్ బామ్మ లినెట్!
ప్రకృతి ఎన్నో తియ్యనైన పండ్లను మనకు ప్రసాదిస్తుంది. వాటిలో చాలా వరకు వివిధ కారణాలతో వ్యర్థమవుతుంటాయి. ఈ విషయాన్ని గమనించిన లినెట్ ఆల్ఫ్రే .. జామ్ తయారు చేసి పళ్ల వ్యర్థాలను తగ్గిస్తూ.. మరోపక్క ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. 79 ఏళ్ల వయసులోనూ ఆమె చురుకుగా జామ్ తయారీ ఫ్యాక్టరీని నడిపించడం విశేషం. బ్రిటిష్ ఇండియన్ అయిన లినెట్ యుక్తవయసులో కశ్మీర్‌కు చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. దీంతో ఆమె ఇండియాలోనే స్థిరపడిపోయారు. వివాహం తరువాత భర్తతో కొన్నాళ్లు బిహార్‌లో ఉన్న లినెట్ అనంతరం ఢిల్లీ, ముంబైలకు మకాం మార్చారు. ఈ క్రమంలోనే 1992లో ఒకసారి లినెట్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ కొద్దిరోజులు ఉన్న లినెట్‌కు హిమాచల్ ప్రదేశ్ వాతావరణం బాగా నచ్చింది. దీంతో భార్యాభర్తలు ఇక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుని హిమాచల్ ప్రదేశ్‌లో స్థిర నివాసం ఏర్పర చుకున్నారు. లినెట్ నివసించే ప్రాంతంలో ఆప్రికాట్, పీచ్, యాపిల్, కివి పండ్లు అధికంగా పండుతాయి. అయితే కొన్నిసార్లు వేగంగా గాలి వీచడం, కోతులు సగం కొరికిపడేయడం వల్ల వృథా అవుతుండేవి. ఇది గమనించిన లిన్నెట్ వాటిని ఎలాగైనా ఉపయోగపడే విధంగా మార్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే లిన్నెట్ తల్లి జామ్ తయారీ తనకు గుర్తుకు వచ్చింది. వృథాగా పాడైపోయే పండ్ల నుంచి జామ్ తయారు చేసి స్థానికులకు ఇస్తుండడంతో అది బాగా పాపులర్ అయ్యింది. దీంతో 1999లో లినెట్ ఏకంగా భావురా గ్రామంలో ‘భూయిరా’ జామ్ ఫ్యాక్టరిని∙స్థాపించారు. ఫ్యాక్టరీ అయితే సులభంగా పెట్టారు కానీ, గ్రామం కావడంతో పవర్ కట్స్ ఎక్కువగా ఉండేవి. దీంతో ఫ్యాక్టరిని నడపడం కష్టంగా ఉండేది. అయినప్పటికి అనేక సమస్యలు ఎదుర్కొని ప్రస్తుతం 75 టన్నుల పండ్లతో 48 రకాల జామ్‌లు తయారు చేస్తున్నారు. రోజుకి 850 జామ్ బాటిల్స్‌తో సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల టర్నోవర్‌తో ముందుకు దూసుకుపోతున్నారు. రసాయనాలు వాడరు.. జామ్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి రసాయనాలు వాడరు. వాటికి బదులు నిమ్మరసం, యాపిల్ జ్యూస్, పంచదారను వినియోగిస్తున్నారు. లినెట్ తయారు చేసే జామ్లలో బ్లాక్‌బెర్రి జామ్, స్ట్రాబెర్రి ప్రిజర్వ్, బ్లాక్ బెర్రి ప్రిజర్వ్‌లు బాగా పాపులర్ అయినవి. ఇంకా ఈ జామ్లలో పంచదార కలపనివి కూడా ఉండడం విశేషం. కోట్ల రూపాయల ఆదాయాన్ని సృష్టిస్తూ వందలమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు లినెట్. -
లంబసింగి స్ట్రాబెర్రీ జామ్: జుర్రుకుని తినేయొచ్చు
తాడేపల్లిగూడెం: బ్రెడ్‌కి జామ్ రాసుకొని తింటే మహా రుచిగా ఉంటుంది. చాలా మందికి ఇది అల్పాహారం. బ్రెడ్డే కాదు.. ఇంకా చాలా ఆహార పదార్ధాలతో జామ్ తినొచ్చు. ఇందుకు మార్కెట్లో చాలా రకాల జామ్‌లు దొరుకుతాయి. కానీ.. మన రాష్ట్రంలోని లంబసింగి నుంచి వచ్చే జామ్ ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఇది అక్కడి రైతులు పండించిన స్ట్రాబెర్రీ నుంచి తయారు చేసినది. ఈ జామ్ మిగతా వాటికంటే సూపర్ టేస్ట్. మృదుఫలంగా పిలిచే స్ట్రాబెర్రీని జామ్లా జుర్రుకు తినొచ్చు. ఇదెలా సాధ్యమైందంటే.. విశాఖ జిల్లా చింతపల్లి మండలంలోని మన్యం గ్రామాలైన లంబసింగి, రాజుపాక గ్రామాల రైతులు స్ట్రాబెర్రీ పండించడంలో దిట్టలు. మూడేళ్లుగా రికార్డు స్థాయిలో పంట దిగుబడి సాధిస్తున్నారు. లంబసింగి ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు స్ట్రాబెర్రీ పండ్లను విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. కోవిడ్ కారణంగా గతేడాది లంబసింగి ప్రాంతానికి పర్యాటకుల రాక తగ్గింది. దీంతో స్ట్రాబెర్రీ విక్రయాలకు తీవ్ర అవరోధం కలిగింది. పండ్లను పారబోసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. భారీగా పెట్టుబడులు పెట్టిన రైతులు అయోమయంలోకి వెళ్లారు. ఈ విషయం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉప కులపతి డాక్టర్ తోలేటి జానకిరామ్, పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగ అధిపతి డాక్టర్ డి.వెంకటస్వామి దృష్టికి వచ్చింది. వారు స్ట్రాబెర్రీ రైతుల సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నారు. రైతులు పండించిన స్ట్రాబెర్రీలను వెంకట్రామన్నగూడెంలోని పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగానికి రప్పించారు. వాటిని ఇక్కడ సహజ విధానాలతో శుభ్రం చేయించి, తాజా పండ్లకు వాణిజ్య హంగులు అద్ది ప్యాకింగ్ చేసి విక్రయించే ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ మిగిలిపోయిన పండ్లను గుజ్జుగా మార్చారు. ఆ గుజ్జును పంచదారతో మిశ్రమం చేసి జామ్‌గా తయారు చేశారు. దానిని సీసాల్లో పోసి అందంగా ప్యాకింగ్ చేశారు. లంబసింగి రైతులు పండించిన తాజా స్ట్రాబెర్రీలను వినియోగించడంతో 250 గ్రాముల జామ్ బాటిల్ ధర రూ.250 ధర పలికింది. అంటే కిలోకు రూ.వెయ్యి దక్కింది. స్ట్రాబెర్రీ ప్రాసెసింగ్‌ను పరిశీలిస్తున్న ఉద్యాన వర్సిటీ వీసీ జానకిరామ్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ డీవీ స్వామి ఎకరానికి రూ.2.20 లక్షల లాభం ఎకరానికి 800 కేజీల స్ట్రాబెర్రీ పండ్ల దిగుబడి వస్తుంది. ఆ పండ్లను కిలో రూ.150 చొప్పున విక్రయిస్తుంటారు. ఆ విధంగా పండ్లను నేరుగా విక్రయిస్తే రైతుకు రూ.1,20,000 ఆదాయం లభిస్తుంది. కానీ.. ఆ పండ్ల నుంచి గుజ్జు (పల్ప్) తీస్తే 546 కిలోలు వస్తుంది. దీనిని ప్రాసెసింగ్ చేసి 250 గ్రాముల చొప్పున బాటిల్ ప్యాకింగ్ చేయించాం. 2,025 బాటిల్స్ వచ్చాయి. రిటైల్ మార్కెట్లో 250 గ్రాముల స్ట్రాబెర్రీ జామ్ సీసా రూ.250 పలుకుతోంది. రైతులు గుత్తగా ఒక్కో సీసాను రూ.175 చొప్పున విక్రయించగా.. రైతుకు రూ.3,54,375 ఆదాయం లభించింది. సాగుతోపాటు రవాణా, ఇతర అన్నిరకాల ఖర్చులు కలిపి రూ.1,35,000 అయినట్టు అంచనా వేశారు. ఖర్చులన్నీ పోను రైతుకు ఎకరానికి రూ.2.20 లక్షల నికరాదాయం లభించినట్టు తేల్చారు. పండ్లగా విక్రయించడం కంటే.. జామ్ రూపంలో విక్రయిస్తే ఎకరానికి అదనంగా రూ.లక్ష వరకు అదనపు ఆదాయం వస్తుంది. పండ్లగా విక్రయించే సందర్భంలో అవి కుళ్లిపోయినా.. ధర తగ్గినా.. పండ్లు అమ్ముడుకాకపోయినా ఆ మేరకు రైతు నష్టపోతాడు. జామ్ చేయడం వల్ల ఒక్క పైసా కూడా నష్టం ఉండదు. పైగా ఇది 9 నెలలు నిల్వ ఉంటుంది. రైతులకు మేలు చేయగలిగాం రైతులు పండించిన పంటలకు వాణిజ్య విలువలు తీసుకురావడంలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ముందుంటోంది. లంబసింగి రైతుల సమస్యను తెలుసుకుని స్ట్రాబెర్రీలను వర్సిటీ ఆధ్వర్యంలో జామ్‌గా తయారు చేయించి వారికి మేలు చేయగలిగాం. – డాక్టర్ తోలేటి జానకిరామ్, ఉప కులపతి, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ ఆనందంగా ఉంది లంబసింగి రైతులు పండించిన స్ట్రాబెర్రీలను జామ్‌గా మార్చడానికి సహకారం అందించినందుకు ఆనందంగా ఉంది. వీసీ, పరిశోధన సంచాలకులతో కలిసి జామ్ తయారు చేయించి రైతులకు లాభాలు వచ్చేలా చూడగలిగాం. – డాక్టర్ డీవీ స్వామి, విభాగాధిపతి, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ -
రుచిలో వెలగండి.. ఆరోగ్యానికి ఎంతో మేలు
వెలగ... పేరు వినగానే నాలుక కాస్తా పులుపు, తీపి, వగరు రుచులతో గిరిగరా తిరిగి నోట్లో నీళ్లూరతాయి. వెలగ రుచి తెలియని వారికి మాత్రం వెలగ అంటే వినాయక చవితినాడు పాలవెల్లికి కట్టే గట్టి కాయలాగే అనిపిస్తుంది, కనిపిస్తుంది. కరిమింగిన వెలగ పండని సామెత ఉంది కానీ, నిజానికి సరిగ్గా చేస్తేదాని మీద ఉండే గట్టి చెక్కతో సహా లాగించేయాలనిపిస్తుంది. ప్రస్తుతానికి ఓ ఐదు వెరయిటీలు అందిస్తున్నాము. కానీ ప్రయత్నిస్తే మీరు కూడా మరో ఐదు రకాలు దానికి జత చేయొచ్చు. ఇంకేం ఇవ్వాళ్లే మార్కెట్టుకి వెళ్లండి, వెలగట్టి ఇంటికి తెండి, రుచికి వెలిగిపోండి. వెలగ పండు భేల్ కావలసినవి వెలగ పండ్లు - 4; పచ్చిమిర్చి - 10 (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఉప్పు - తగినంత ; పంచదార - 4 టీ స్పూన్లు; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు; చాట్ మసాలా - ఒక టీ స్పూను; స్వీట్ చట్నీ- అర టీ స్పూను; గ్రీన్ చట్నీ- ఒక టీ స్పూను తయారీ: వెలగపండ్లను పగలగొట్టి, గుజ్జును ఒక పాత్రలోకి తీసుకుని, గరిటెతో బాగా మెదపాలి. పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, పంచదార, కొత్తిమీర తరుగు, చాట్ మసాలా, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ జత చేసి పప్పు గుత్తితో బాగా మెదపాలి. పగుల గొట్టిన వెలగ పండు చెక్కలలోనే అమర్చి అందిస్తే చూడటానికి అందంగా ఉంటుంది. వెలగ పండు స్మూతీ కావలసినవి: వెలగపండు -1; తేనె- 2 టేబుల్ స్పూన్లు; ఓట్స్ - ఒక టేబుల్ స్పూను; పెరుగు- అర కప్పు; తాజా కొబ్బరి తురుము - ఒక టేబుల్ స్పూను; ఏలకుల పొడి - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; బెల్లం పొడి - టేబుల్ స్పూను గార్నిషింగ్ కోసం: దానిమ్మ గింజలు- ఒక టీ స్పూను; మామిడికాయ ముక్కలు - ఒక టీ స్పూను; జీడిపప్పు ముక్కలు - ఒక టీ స్పూను. తయారీ: ఓట్సును తియ్యటి నీళ్లలో లేదా ఏదైనా పళ్లరసంలో పది నిమిషాలు నానబెట్టాలి. వెలగపండును పగులగొట్టి గుజ్జు బయటకు తీసి, రెండు కప్పుల నీళ్లలో సుమారు అరగంట సేపు నానబెట్టాలి. మెత్తగా పిసికి, పీచును, గింజలను వేరు చేయాలి. మిక్సీలో వెలగ పండు గుజ్జు, తేనె, ఐస్ క్యూబ్స్, బెల్లం పొడి, కొబ్బరి తురుము, నానబెట్టిన ఓట్స్, ఏలకుల పొడి, పెరుగు, మిరియాల పొడి వేసి మెత్తగా చేయాలి. గ్లాసులలో పోసి, కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా అయ్యాక బయటకు తీసి, జీడిపప్పు ముక్కలు, దానిమ్మ గింజలు, మామిడికాయ ముక్కలతో అలంకరించి అందించాలి. వెలగ పండు షర్బత్ కావలసినవి వెలగ పండు -1; నీళ్లు - తగినన్ని; పంచదార - తగినంత తయారీ: ముందుగా వెలగపండు గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙చేతితో మెత్తగా మెదిపి, తగిన న్ని నీళ్లు జత చేసి, చేతితో బాగా కలపాలి. ఒక పాత్రలోకి వడ పోయాలి. తగినంత పంచదార జత చేసి బాగా కలియబెట్టాలి. ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచి, బయటకు తీసి చల్లగా తాగాలి . ఎండ బాధ నుంచి కాపాడుతుంది. వెలగ పండు జామ్ కావలసినవి: వెలగ పండ్లు - 4; వేడి నీళ్లు - పావు లీటరు; పంచదార - 200 గ్రా. తయారీ : వెలగ పండ్ల గుజ్జును ఒక పాత్రలో వేసి మెత్తగా మెదపాలి. వేడి నీళ్లు జత చేస్తూ బాగా కలియబెట్టాక, వడబోసి, గింజలను వేరు చేయాలి. స్టౌ మీద బాణలి వేడయ్యాక గుజ్జును అందులో వేసి బాగా కలపాలి. పంచదార జత చేసి బాగా కలియగొట్టి, పొంగులు వచ్చేవరకు ఉడికించాలి. పావు గంట తరవాత మిశ్రమం కొద్దిగా చిక్కబడుతుంది. ఒక ప్లేటులోకి తీసుకుని, కొద్దిగా చల్లారాక గాలి చొరని సీసాలో నిల్వ చేసుకోవాలి. వెలగ పండు పచ్చడి కావలసినవి: వెలగపండు- 1; బెల్లం పొడి - ఒక కప్పు; కారం- ఒక టేబుల్ స్పూను; ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూను; వేయించిన జీలకర్ర పొడి - ఒక టేబుల్ స్పూను; ఉప్పు - తగినంత; కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ∙ముందుగా వెలగపండును పగులగొట్టి గుజ్జును ఒక పాత్రలోకి తీసుకోవాలి. మిక్సీలో అన్ని పదార్థాలు వేసి మెత్తగా చేయాలి. ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో ఉంచితే పదిరోజుల వరకు బాగుంటుంది. వెలగ పండు ఐస్‌క్రీం కావలసినవి: పంచదార- 1 టేబుల్ స్పూన్; కొబ్బరి పాలు- అరకప్పు; వెలగ కాయ - 1 తయారీ: ఒక పాత్రలో వెలగ పండు గుజ్జు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదపాలి. కొబ్బరి పాలు జత చేస్తూ మరోసారి మెత్తగా చేయాలి. పంచదార జత చేసి బాగా కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అంగుళం మందం ఉన్న ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి, డీప్ ఫ్రీజ్‌లో ఐదు గంటల పాటు ఉంచి బయటకు తీయాలి. స్టౌ మీద పాన్ వేడయ్యాక, ఫ్రిజ్‌లో ఉంచిన ప్లేటును బయటకు తీసి, అందులోని వెలగపండు మిశ్రమాన్ని పాన్‌లో వేసి, కొద్దిసేపు ఉంచి, మళ్లీ ప్లేటులో పోసి, డీప్ ఫ్రీజర్‌లో మూడు గంటల పాటు ఉంచి, బయటకు తీసి, ఐస్ క్రీమ్ కప్పుల్లో అందించాలి. ఇలా తింటే ఎలా ఉంటుంది.. ఉదయాన్నే బియ్యంతో చేసిన ఇడ్లీ, దోసెలకు దూరంగా ఉండి, వాటి బదులు జొన్నలు, మినుములతో చేసిన ఇడ్లీ, దోసెలను తినటం మంచిది. మామూలుగా చేసుకునే ఇడ్లీ, దోసెలను వారానికి ఒకసారి మాత్రమే తినాలి. దోసెలను నేతిలో కాల్చుకుని తినటం మంచిది. ఉడకబెట్టిన సెనగలు, వేరు సెనగలు, అలసందలు ఆరోగ్యానికి మంచిది. మొలకెత్తిన గింజలు తినటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పూరీ, మైసూర్ బోండా వంటివి నెలకు ఒకసారి తింటే పరవాలేదు. వీలైతే వాటికి దూరంగా ఉండటం మంచిది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు చపాతీలు తింటే పరవాలేదు. అవి కూడా నేతితో కాల్చుకుని తినటం మంచిది. వెలగపండ్లు – ఉపయోగాలు 100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. అల్సర్‌తో బాధపడే వారికి ఈ పండు వల్ల ఉపశమనం కలుగుతుంది. వెలగపండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధి అవుతుంది. రక్తహీనతను నివారించే గుణం వెలగపండులో ఉంది. ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే, వెలగ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి. అలసటగా, నీరసంగా ఉన్నప్పుడు వెలగపండు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం మంచిది. మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. వెలగపండు గుజ్జుకి తగినంత గోరువెచ్చని నీళ్లు, కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే రక్తంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. కాలేయం, కిడ్నీలపై అధిక పనిభారం పడకుండా ఉంటుంది ∙స్త్రీలు వెలగ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వెలగపండు గుజ్జు తినడం వల్ల ప్రొటీన్లు సమపాళ్లలో అంది కండరాలు వేగంగా వృద్ధి చెందుతాయి ∙వెలగపండు గుజ్జుకి మధుమేహాన్ని అదుపులో ఉంచే శక్తి ఉంది. ∙వెలగ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది ∙నోటి పుండ్లనీ తగ్గిస్తుంది ∙పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది. -
నకిలీ జామ్ ప్యాకెట్లు స్వాధీనం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక హౌసింగ్‌బోర్డు కాలనీలోని హెచ్ఐజీ–36లో శ్రీసత్య కార్తీక్ ఏజెన్సీపై ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు రెండో రోజు గురువారం కూడా తనిఖీలు చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా దేవతి నాగరాజు, పద్మవల్లి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వివిధ రకాల తినుబండారాలను తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నూతలపాటి పూర్ణచంద్రరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎ. సుందరరామిరెడ్డి బుధవారం తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే రకరకాల బ్రాండ్ల తినుబండారాలు అనేకం ఉండటంతో రెండో రోజుకూడా ఈ తనిఖీలను కొనసాగించారు. ప్రముఖ కంపెనీల పేర్లతో జామ్, సాస్‌లు తయారు చేస్తున్నట్లు ఈ తనిఖీలలో వెల్లడయ్యింది. వాటిల్లో నాన్ పర్మిటెడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది. జామ్‌లో చీమలు, ఈగలు.. మ్యాంగో, మిస్టర్ యాపిల్ పేర్లుతో తయారు చేస్తున్న జామ్ ముడి పదార్థం ఉన్న డ్రమ్ములలో చీమలు, దోమలు, ఈగలు ఉన్నాయి. దానినే మిషన్ ద్వారా చిన్నచిన్న ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. సుమారు రూ.10లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. రంగు రంగు ప్యాకెట్లలో ఆకర్షణీయంగా కనబడుతున్న ఈ కల్తీ ఆహార పదార్థాల కారణంగా పిల్లలు రోగాల బారిన పడతారని చెప్పారు. -
హెల్త్‌టిప్స్
{బేక్‌ఫాస్ట్‌లో చపాతీ లేదా బ్రెడ్ మీద జామ్, జెల్లీలకు బదులు తేనె, దాల్చిన చెక్క పొడి మిశ్రమాన్ని రాసుకుని తింటే గుండె సంబంధ వ్యాధులు రావు. ఇది రక్తనాళాల్లో చేరిన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్లు కూడా దీన్ని పాటిస్తే రెండో స్ట్రోక్‌కు దూరంగా ఉంటారు. దాల్చిన చెక్క పొడి, తేనెల కాంబినేషన్ రక్తనాళాలను ఆరోగ్యవంతం చేసి, రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. ఒక మోతాదు తేనెలో రెండు మోతాదుల నీటినీ, ఒక స్పూను దాల్చిన చెక్క పొడినీ కలిపి ఆ మిశ్రమంతో కీళ్లనొప్పులున్న చోట మర్దన చేస్తే రెండు - మూడు నిమిషాలలోనే బాధ తగ్గుతుంది. -
జమ్మల మడుగు, కోవెలకుంట్ల మధ్య భారీగా ట్రాఫిక్ జాం
వైఎస్ఆర్ జిల్లా: కడప జిల్లా జమ్మల మడుగు, కోవెలకుంట్ల రహదారిలో మాయలూరు గ్రామం వద్ద శనివారం ఉదయం భారీగా ట్రాఫీక్ జాం అయింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో రెండు గంటలనుంచి ఎక్కడ నిలిచిన వాహనాలు అక్కడే ఉన్నాయి. కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో గత పదేళ్లనుంచి ఇంతగా వర్షం పడలేదని...ఇలా ట్రాఫిక్ జాం అవ్వడం ఇంతకు ముందెప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. రెండు గంటల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ఇంకా అధికారులెవరు అక్కడికి రాలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. -
‘జామ్’ మాట బంగారు బాట..
నచ్చిన సబ్జెక్టుపై పట్టు సాధించి, మెచ్చిన కెరీర్లో ఉన్నతంగా కుదురుకునే అవకాశాన్ని అందుకోవాలన్న ఉద్దేశంతో విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)కు దగ్గరవుతారు! అలాంటి పీజీని జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తింపు పొందిన ఐఐటీలలో చేసే అవకాశం వస్తే భవిష్యత్తు బంగారుమయమే! అలాంటి అద్భుత అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్) వీలు కల్పిస్తోంది. దీనిద్వారా పరిశోధనలకు పేరుగాంచిన ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలోనూ ప్రవేశించొచ్చు. జామ్-2015కు తాజాగా నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా స్పెషల్ ఫోకస్.. జామ్-2015 నిర్వహణ సంస్థ: ఐఐటీ గౌహతి. ‘జామ్’తో ప్రవేశం లభించే కోర్సులు: ఐఐఎస్సీ: బయలాజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ.ఐఐటీ భువనేశ్వర్: కెమిస్ట్రీ; ఎర్త్ సైన్స; మ్యాథమెటిక్స్; ఫిజిక్స్; అట్మాస్ఫియర్, ఓషన్ సెన్సైస్‌లో జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్డీ.ఐఐటీ బాంబే: అప్లైడ్ జియాలజీ, అప్లైడ్ జియోఫిజిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్-ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో రెండేళ్ల ఎంఎస్సీ.నానో సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో ఎంఎస్సీ (ఫిజిక్స్)-ఎంటెక్ (మెటీరియల్ సైన్స్). ఇది నాలుగేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సు. అప్లైడ్ జియాలజీ, అప్లైడ్ జియోఫిజిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎనర్జీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ.ఐఐటీ ఢిల్లీ: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో రెండేళ్ల ఎంఎస్సీ. ఐఐటీ గాంధీనగర్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో రెండేళ్ల ంఎస్సీ.ఐఐటీ గౌహతి: కెమిస్ట్రీ; మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్; ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ హైదరాబాద్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ ఇండోర్: కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ. రెండో ఏడాది తర్వాత అర్హతను బట్టి ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌కు మారొచ్చు. ఐఐటీ కాన్పూర్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ; ఫిజిక్స్‌లో ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ.ఐఐటీ ఖరగ్‌పూర్: కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,జియో ఫిజిక్స్‌లో జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్డీ.ఐఐటీ మద్రాస్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ రూర్కీ: అప్లైడ్ జియాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ రూపర్: మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ; కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ-ఎంఎస్(రీసెర్చ్)/పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ. అర్హతలు: ఐఐఎస్సీ-బెంగళూరులో ప్రవేశాలకు జనరల్ కేటగిరీ, ఓబీసీ విద్యార్థులు సంబంధిత గ్రూపులో 60 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులు 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ. ఖరగ్‌పూర్, కాన్పూర్, బాంబే, ఢిల్లీ, మద్రాస్, రూర్కీ, హైదరాబాద్, భువనేశ్వర్, గాంధీనగర్, రూపర్ ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధిత సబ్జెక్టుల్లో జనరల్, ఓబీసీ విద్యార్థులు 55శాతం మార్కులు; ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులు 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ. పరీక్ష విధానం: జామ్-2015 పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. అభ్యర్థి ప్రవేశించాలనుకుంటున్న కోర్సు సబ్జెక్టును బట్టి పరీక్షకు (టెస్ట్ పేపర్)కు హాజరుకావాలి. ఏడు సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. అవి.. 1. బయలాజికల్ సెన్సైస్ (బీఎల్); 2. బయోటెక్నాలజీ (బీటీ); 3. కెమిస్ట్రీ (సీవై); 4. జియాలజీ (జీజీ); 5. మ్యాథమెటిక్స్ (ఎంఏ); 6. మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (ఎంఎస్); 7. ఫిజిక్స్. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు రకాల ప్రశ్నలుంటాయి. అవి.. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూ); మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు (ఎంఎస్క్యూ); న్యూమరికల్ సమాధాన ప్రశ్నలు (ఎన్ఏటీ). మూడు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ఒక్కో పేపర్లో మొత్తం 60 ప్రశ్నలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. వీటికి 100 మార్కులు కేటాయించారు. సెక్షన్ ఏలో 1 మార్కు ప్రశ్నల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు, రెండు మార్కుల ప్రశ్నల్లో ప్రతి తప్పు సమాధానానికి 2/3 మార్కు కోత విధిస్తారు. సెక్షన్ బీ, సీల్లో నెగిటివ్ మార్కులుండవు. పేపర్ల వారీగా సిలబస్: బయలాజికల్ సెన్సైస్: జనరల్ బయాలజీ; బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్, మాలిక్యులర్ బయాలజీ ప్రాథమిక భావనలు; మైక్రో బయాలజీ, సెల్ బయాలజీ, ఇమ్యునాలజీ; మ్యాథమెటికల్ సెన్సైస్. బయో టెక్నాలజీ: ఇందులో బయాలజీకి 44 శాతం వెయిటేజీ, కెమిస్ట్రీకి 20 శాతం, మ్యాథమెటిక్స్‌కు 18 శాతం, ఫిజిక్స్‌కు 18 శాతం వెయిటేజీ ఉంటుంది. సిలబస్‌లో జనరల్ బయాలజీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రో బయాలజీ; అటామిక్ స్ట్రక్చర్, సెట్స్-రిలేషన్స్, సర్కిల్స్, పెర్ముటేషన్స్- కాంబినేషన్స్, వర్క్-ఎనర్జీ-పవర్ తదితర అంశాలుంటాయి. కెమిస్ట్రీ: ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలకు సంబంధించిన అంశాలుంటాయి. జియాలజీ: ది ప్లానెట్ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పేలియంటాలజీ, స్ట్రాటీగ్రఫీ, మినరాలజీ, పెట్రాలజీ, ఎకనమిక్ జియాలజీ, అప్లైడ్ జియాలజీలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. మ్యాథమెటిక్స్: సీక్వెన్సెస్, సిరీస్ ఆఫ్ రియల్ నంబర్స్; ఫంక్షన్స్; ఇంటిగ్రెల్ కాలిక్యులస్; డిఫరెన్షియల్ ఈక్వేషన్స్; వెక్టార్ కాలిక్యులస్; గ్రూప్ థియరీ; లీనియర్ ఆల్జీబ్రా; రియల్ అనాలిసిస్. మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్: మ్యాథమెటిక్స్‌కు సంబంధించి సీక్వెన్సెస్-సిరీస్; డిఫరెన్షియల్ కాలిక్యులస్; ఇంటిగ్రెల్ కాలిక్యులస్; మ్యాట్రిసెస్; డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. స్టాటిస్టిక్స్‌కు సంబంధించి ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్స్, ఎస్టిమేషన్ తదితర అంశాలుంటాయి. ఫిజిక్స్: మ్యాథమెటికల్ మెథడ్స్; మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్; ఆసిలేషన్స్, వేవ్స్, ఆప్టిక్స్; ఎలక్ట్రిసిటీ-మ్యాగ్నటిజం; థర్మోడైనమిక్స్; మోడర్న్ ఫిజిక్స్. ప్రిపరేషన్ టిప్స్: ఐఐటీ-జామ్‌లో ప్రశ్నలు అభ్యర్థిలోని నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్, అనాలిసిస్ ఆధారంగా ఇస్తారు. ప్రశ్నపత్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో రూపొందిస్తారు. ప్రతిసారి జామ్‌లో ప్రశ్నలు అడిగే విధానం మారుతుంటుంది. కాబట్టి ఏ ఒక్క చాప్టర్‌ను విస్మరించకుండా ప్రిపరేషన్ సాగించాలి.సబ్జెక్టు ఏదైనా మూలాలు, ప్రాథమిక భావనల నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ముందుకు సాగాలి. కాన్సెప్టు ఆధారిత సమస్యలపై దృష్టిసారించాలి.ప్రిపరేషన్ పూర్తయ్యాక చాప్టర్ల వారీగా నమూనా పరీక్షలు రాయాలి. దీని ఆధారంగా ప్రిపరేషన్లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకోవాలి.ప్రిపరేషన్‌కు ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి. ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం కూడా ఉపకరిస్తుంది. బీఎస్సీ విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం 6 నుంచి 8 నెలల సమయం కావాలి. కాబట్టి బీఎస్సీ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత.. మిగిలిన రెండేళ్ల కాలంలో ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది. సిలబస్ సమగ్ర పరిశీలన ప్రధానం ఐఐటీలలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి నిర్వహిస్తున్న జామ్ విషయంలో నిర్వాహక ఐఐటీ.. నిర్దిష్ట సిలబస్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఔత్సాహిక అభ్యర్థులు దీన్ని సమగ్రంగా పరిశీలించి ఆయా అంశాలపైనే పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. సిలబస్ పరిధిని దాటి ప్రశ్నలు అడగటం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కానీ ప్రశ్నల క్లిష్టత స్థాయిలో తేడాలుంటాయి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యమిచ్చేలా ప్రిపరేషన్ సాగించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించడం ద్వారా ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన ఏర్పరుచుకోవచ్చు. పరీక్షలో స్కోర్ ఆధారంగా ఎంపిక చేసుకునే కోర్సు, ఇన్స్టిట్యూట్ విషయంలో ముందునుంచే స్పష్టత ఉండాలి. కొన్ని ఐఐటీలు ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ (ఎమ్మెస్సీ+పీహెచ్డీ) కోర్సులను అందిస్తున్నాయి. ఇవి పరిశోధనలపై ఆసక్తిగలవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఐఐటీ హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ కోర్సులే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతమున్న సమయంలో సిలబస్‌లోని అన్ని అంశాలను పూర్తి చేసుకునేలా అభ్యర్థులు తమ వ్యక్తిగత నైపుణ్యాల ఆధారంగా టైం మేనేజ్మెంట్ పాటిస్తే జామ్‌లో సత్ఫలితాలు ఆశించొచ్చు. - ప్రొఫెసర్ ఫయజ్ అహ్మద్ ఖాన్; డీన్, అకడెమిక్ ప్రోగ్రామ్స్, ఐఐటీ-హైదరాబాద్. -
మొబైల్, ఇంటర్నెట్ కనెక్షన్లు కట్
శ్రీనగర్: గణతంత్ర వేడుకల సందర్భంగా కాశ్మీర్ లోయలో అన్ని మొబైల్ ఫోన్స్, వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్షన్లను ఆపివేశారు. భద్రత చర్యల్లో భాగంగా ముందు జాగ్రత్తగా ఈ సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచే మొబైల్, వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేశారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవం రోజుల్లో అధికారులు ఇలాంటి నిషేధాజ్ఞలు జారీ చేస్తారు. ఉగ్రవాదులు గతంలో మొబైల్ ఫోన్ల ద్వారా బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. కాగా లాండ్ లైన్ టెలిఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సర్వీసులు పనిచేస్తున్నాయి. గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత అన్ని సర్వీసులను పునరుద్ధరిస్తారు. -
ఐఐటీల్లో ఎంఎస్సీ.. వయా జామ్-2014
ఐఐటీలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఇంజనీరింగ్ కోర్సులే. కానీ సెన్సైస్‌లో పరిశోధనల ప్రాముఖ్యతను గుర్తించిన ఐఐటీలు.. వివిధ సబ్జెక్టుల్లో ఎంఎస్సీ (రెండేళ్లు), జాయింట్ ఎంఎస్సీ- పీహెచ్డీ, ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యుయెల్ డిగ్రీ, ఇతర పోస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తున్నాయి. ఈ కోవలోనే ఐఐఎస్సీ- బెంగళూరు ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ప్రతి ఏటా ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్)’ ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఐఐటీ- కాన్పూర్.. జామ్- 2014ను నిర్వహిస్తుంది. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వివరాలు.. ప్రవేశం కల్పించే సంస్థలివే.. ఐఐటీ-బొంబాయి, ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-గువహటి, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐటీ-చెన్నై, ఐఐటీ-రూర్కీ, ఐఐటీ-భువనేశ్వర్, ఐఐటీ-గాంధీనగర్, ఐఐటీ-హైదరాబాద్ (ఎంఎస్సీ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్), ఐఐటీ-ఇండోర్, ఐఐఎస్సీ- బెంగళూరు. అర్హత : ఐఐఎస్సీ-బెంగళూరులో ప్రవేశాలకు జనరల్, ఓబీసీలు 60 శాతం (ఎస్సీ, ఎస్టీలు 50 శాతం) మార్కులతో, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఐఐటీల్లో ప్రవేశాలకు జనరల్, ఓబీసీలు 55శాతం(ఎస్సీ, ఎస్టీలు, శారీరక వికలాంగులు 50 శాతం) మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. ప్రశ్నపత్రం ఇలా: సబ్జెక్టుల వారీగా ఎగ్జామ్ ప్యాట్రన్‌ను పరిశీలిస్తే.. బయలాజికల్ సైన్స్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్ట్ పేపర్లు పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కుల కోత విధిస్తారు. వీటికి ఆబ్జెక్టివ్ రెస్పాన్స్ షీట్ (ఓఆర్ఎస్)లో మాత్రమే సమాధానాలు గుర్తించాలి. మిగతా పేపర్లన్నీ ఆబ్జెక్టివ్ కమ్ డిస్క్రిప్టివ్ రూపంలో ఉంటాయి. ఇందులో 20 శాతం బహుళైచ్ఛిక ప్రశ్నలు, 30 శాతం ఖాళీలను పూరించడం, 50 శాతం డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి కొశ్చన్ కమ్ ఆన్సర్ బుక్‌లెట్‌లోనే సమాధానాలు రాయాలి. డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు నిర్దేశించిన స్పేస్‌లో మాత్రమే సమాధానాలు ఇవ్వాలి. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు మాత్రం(ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ప్రశ్నలకు లేదు) నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల కోత విధిస్తారు. అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ఒక అభ్యర్థి రెండు సబ్జెక్టుల కంటే ఎక్కువ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోకూడదు. ఎంపిక: రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కేటగిరీలవారీగా, సబ్జెక్టులవారీగా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. వీటి ఆధారంగా ప్రవేశాలుంటాయి. అదేవిధంగా ఐఐఎస్సీ-బెంగళూరు ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, ఐఐటీ-బొంబాయి ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యుయెల్ డిగ్రీ, ఐఐటీ-కాన్పూర్ ఎంఎస్సీ-పీహెచ్డీ డ్యుయెల్ డిగ్రీ (ఫిజిక్స్)ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలకు జామ్ స్కోర్‌తోపాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తున్నాయి. జనరల్ టిప్స్: ఐఐటీ-జామ్‌లో ప్రశ్నలు అభ్యర్థిలోని స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ఉంటాయి. కొన్ని ప్రశ్నలు మెమొరీ బేస్డ్గా ఉన్నప్పటికీ.. అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్, అనాలిసిస్ బేస్డ్గా అడుగుతారు. ప్రశ్నపత్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో రూపొందిస్తారు. ప్రతిసారి జామ్‌లో ప్రశ్నలు అడిగే విధానం మారుతుంటుంది. కాబట్టి ఏ ఒక్క చాప్టర్‌ను విస్మరించకుండా ప్రిపరేషన్ సాగించాలి. సాధారణంగా ఒక ఏడాది అడిగిన చాప్టర్ల నుంచి మరో ఏడాది అదే విధంగా ప్రశ్నలు వస్తాయనుకోవడం పొరపాటే. కాబట్టి ఇటువంటి విషయాల్లో సీనియర్ ఫ్యాకల్టీ సలహాలు తీసుకోవడం మంచిది. సబ్జెక్ట్ ఏదైనా.. ఏ విషయాన్నైనా బట్టీ పట్టకుండా కాన్సెప్ట్ బేస్డ్గా చదివితేనే ప్రయోజనం. మూలాలు, ప్రాథమిక భావనల(ఫండమెంటల్స్, కాన్సెప్ట్స్) నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ముందుకు సాగాలి. కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడం అలవర్చుకోవాలి. దీనివల్ల తక్కువ సమయంలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం అలవడుతుంది. జామ్ సమాధాన పత్రాల్లో ప్రశ్నలకు కేటాయించాల్సిన స్థలాన్ని ముందుగానే నిర్ణయిస్తారు. అందువల్ల తక్కువ స్థలంలో విలువైన సమాచారాన్ని పొందుపర్చే విధంగా రైటింగ్ కూడా(అవసరమైన చోట గ్రాఫ్స్,డయాగ్రమ్స్, టేబుల్స్ ఉపయోగిస్తూ) ప్రాక్టీస్ చేయాలి. సమాధానాలను ప్రాక్టీస్ చేసేటప్పుడు.. స్టాప్‌వాచ్‌ను వినియోగిస్తూ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత సమయంలో జవాబు రాస్తున్నాం? వంటి అంశాలను విశ్లేషించుకుంటూ ఉండాలి. ఇందుకోసం సమస్య పరిష్కారం సమయంలో వేగం పెంచుకోవాలి. తక్కువ స్టెప్పుల్లో సమాధానం పూర్తి చేయగల నేర్పు సొంతం చేసుకోవాలి. ప్రాథమిక భావనలపై పట్టు, లాజికల్ థింకింగ్, రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా ఎస్సే సమాధానాలను ప్రభావవంతంగా ప్రెజెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్సే కొశ్చన్స్తోపాటు ఇతర ప్రశ్నలకు సమాధానాలను ప్రాక్టీస్ చేసేటప్పుడు టైమ్ నిర్దేశించుకుని ప్రాక్టీస్ చేయాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే పరీక్ష శైలిపై ఓ అవగాహన ఏర్పడుతుంది. చాప్టర్వైజ్, గ్రాండ్ టెస్ట్‌లను రాస్తుండాలి. పరీక్షలో ఒకే రకమైన ప్రశ్నలు కాకుండా.. ఎస్సే టైప్, ఖాళీలను పూరించడం, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ మూడు రకాల ప్రశ్నలను సాధించే విధంగా ప్రిపరేషన్ సాగించాలి. మార్కెట్లో లభించే అన్ని రకాల పుస్తకాలను రిఫర్ చేయకుండా.. స్టాండర్డ్ పుస్తకాలను మాత్రమే చదవాలి. తర్వాత వాటిలోని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, ఎస్సే ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. కోచింగ్ తీసుకోవడం కూడా ఉపకరిస్తుంది. జామ్ ఓరియెంటేషన్‌లో ప్రిపరేషన్ సాగించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా బయోటెక్నాలజీ అభ్యర్థులు పలు సబ్జెక్ట్‌లను చదవాల్సి ఉంటుంది కాబట్టి కోచింగ్ అవసరం. బీఎస్సీ విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం 6 నుంచి 8 నెలల సమయం కావాలి. కాబట్టి బీఎస్సీ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత.. మిగిలిన రెండేళ్ల కాలంలో ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది. యూనివర్సిటీ ఎగ్జామ్స్ కోసం పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలి. ఈ ప్రిపరేషన్ జామ్‌కు కూడా కలిసివస్తుంది. పరీక్షలో ఏ విభాగానికి ఎక్కువ మార్కులు కేటాయించారో ముందు ఆ విభాగం ప్రారంభించడం మంచిది. డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంటుంది కాబట్టి ముందు వాటిని ఎంచుకోవడం ఉత్తమం. ఐఐటీ జామ్-2014 సమాచారం: దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 16, 2013 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 16, 2013 జామ్ రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 9, 2014. మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, కడప, నెల్లూరు. వివరాలకు: www.iitk.ac.in/jam సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్ ప్లాన్ కెమిస్ట్రీ: కెమిస్ట్రీకి సంబంధించి ప్రధానంగా మూడు బ్రాంచ్‌లు ఉంటాయి. అవి.. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. రియాక్షన్ మెకానిజమ్, నేమ్డ్ రియాక్షన్స్, ఆర్గానిక్ ట్రాన్స్ఫార్మేషన్స్, సింథసిస్, నేచురల్ ప్రొడక్ట్స్, స్టీరియో కెమిస్ట్రీ అంశాల నుంచి ఎస్సే ప్రశ్నలు వచ్చాయి. ఫిజికల్ కెమిస్ట్రీలో కెమికల్ కెనైటిక్స్, ఫోటో కెమిస్ట్రీ, థర్మో డైనమిక్స్ అండ్ కెనైటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, కెమికల్, అయానిక్, ఫేజ్ ఈక్విలిబ్రియం, క్వాంటమ్ కెమిస్ట్రీ అంశాల నుంచి ఎస్సే ప్రశ్నలు అడిగారు. ఇనార్గానిక్‌లో.. కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఎనలిటికల్ కెమిస్ట్రీ, గ్రూప్స్ అంశాల నుంచి వచ్చాయి. సిలబస్‌లో పేర్కొన్న అంశాల్లోని ప్రాథమిక భావనలపై పట్టు సాధించాలి. ప్రాబ్లమ్స్, రియాక్షన్స్‌ను కాన్సెప్ట్ బేస్డ్గా సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. ఐఐఎస్సీ, బీహెచ్‌యూ,హెచ్‌సీయూ, పాండిచ్చేరి, జేఎన్‌యూ వంటి యూనివర్సిటీల జాతీయ స్థాయి ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో అడిగిన మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. రిఫరెన్స్ బుక్స్: ఫిజికల్ కెమిస్ట్రీ-ఆట్కిన్స్, మారన్ అండ్ పుటన్, లెవిన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ - క్యారీ అండ్ సండ్బర్గ్, సోరెల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ - కాటన్ అండ్ విలికిన్సన్ యూనివ ర్సిటీ కెమిస్ట్రీ - బ్రూస్ హెచ్. మహాన్ కెమిస్ట్రీ - చాంగ్ బయోటెక్నాలజీ: బయోటెక్నాలజీ పలు సబ్జెక్టుల కలయికగా ఉంటుంది. ఇందులో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో అడిగే ప్రశ్నలు 10+2 సీబీఎస్ఈ స్థాయిలో ఉంటాయి. కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నల క్లిష్టత బీఎస్సీ స్థాయిలో ఉంటుంది. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. బయాలజీలో మొత్తం ప్రశ్నల్లో 85 శాతం మోడర్న్ బయాలజీ నుంచి, 15 శాతం క్లాసికల్ బయాలజీ నుంచి వచ్చాయి. 44 ప్రశ్నల్లో.. 40 శాతం ప్రశ్నలు మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, బయోకెమిస్ట్రీ నుంచి అడిగారు. బయోటెక్నాలజీకి సంబంధించి జాతీయ స్థాయిలోని అన్ని పోటీ పరీక్షల్లో జామ్ క్లిష్టమైందని చెప్పొచ్చు. మోడర్న్, క్లాసికల్ బయాలజీతోపాటు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ ప్రిపేర్ కావాల్సి రావడమే ఇందుకు కారణం. నాన్ మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అదే సమయంలో బయాలజీ, కెమిస్ట్రీలను సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, జెనెటిక్ ఇంజనీరింగ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, మెకానిక్స్, ఎలక్ట్రిసిటీ, ఆల్జీబ్రా, కాలిక్యులస్‌పై దృష్టి సారించాలి. పలు సబ్జెక్ట్‌లను ప్రిపేర్ కావాలి కాబట్టి.. ర్యాంక్ సాధించాలంటే దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. కంప్యూటర్ అప్లికేషన్స్: కంప్యూటర్ అప్లికేషన్స్ పరీక్షలో.. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ అవేర్నెస్, ఎనలిటికల్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగాలు ఉంటాయి. ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్, కంప్యూటర్ అంశాల్లో ఎక్కువ ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఈ రెండు అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. మ్యాథమెటిక్స్‌లో కాలిక్యులస్, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్‌పై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. అదే విధంగా లాజిక్ గేట్స్, బులియన్ అల్జీబ్రా, అల్గారిథమ్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్‌పై కూడా దృష్టి సారించాలి. ఎంసీఏలో ప్రవేశం కోసం హెచ్‌సీయూ, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీలు నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్‌ల పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. రిఫరెన్స్ బుక్స్: మ్యాట్రిసెస్ - షహౌమ్ సిరీస్ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్-పిస్కునోవ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ - రాజ్ సింఘానియా, షహౌమ్ సిరీస్ అర్థమెటిక్ - ఆర్ఎస్ అగర్వాల్ టెక్ట్స్‌బుక్ ఆఫ్ రీజనింగ్ - ఎడ్గర్ థోర్ప్ జియో ఫిజిక్స్: ఇందులో జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అనే మూడు విభాగాలు ఉంటాయి. ఈ మూడు విభాగాల్లో విద్యార్థులు ఏవైనా రెండు విభాగాలను ఎంచుకోవచ్చు. ప్రతి విభాగానికి 50 శాతం వెయిటేజీ ఉంటుంది. జియాలజీ సబ్జెక్ట్‌లేని విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాలను ఎంచుకోవచ్చు. మ్యాథమెటిక్స్‌లో స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, వెక్టార్ కాలిక్యులస్, రియల్ అనాలిసిస్ అంశాలపై ఎక్కువ దృష్టి సారించాలి. ఫిజిక్స్‌లో మోడర్న్ ఫిజిక్స్, ఎలక్ట్రో మాగ్నటిక్ థియరీ, మెకానిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు రావొచ్చు. జియాలజీలో స్ట్రక్చరల్ జియాలజీ, ఎకనామిక్ జియాలజీ, మినరాలజీ నుంచి అధిక శాతం ప్రశ్నలు వస్తాయి. బీహెచ్‌యూ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ నిర్వహించిన ఎంట్రెన్స్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం మంచిది. ఫిజిక్స్: ఈ విభాగంలో గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ఎలక్ట్రోమాగ్నటిక్ థియరీ, థర్మో డైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్, మెకానిక్స్, ఆప్టిక్స్, మ్యాథమెటికల్ ఫిజిక్స్ నుంచి ఎస్సే ప్రశ్నలు వచ్చాయి. ప్రిపరేషన్ విషయానికొస్తే.. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ స్కిల్ డెవలప్ చేసుకోకపోతే ఈ పేపర్లో రాణించడం కష్టం. ప్రస్తుతం మన రాష్ట్ర ఫిజిక్స్ సిలబస్‌లోని మ్యాథమెటికల్ ఫిజిక్స్ విభాగం సిలబస్.. జామ్ పరీక్ష స్థాయిలో లేదు. కాబట్టి ఈ అంశంపై దృష్టి సారించాలి. అడ్వాన్స్డ్ టాపిక్స్‌ను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. రిఫరెన్స్ బుక్స్: మెకానిక్స్ - హాన్ అండ్ పురి థర్మో డైనమిక్స్ - సియర్స్ అండ్ జెమాన్స్కీ ఆప్టిక్స్ - అజయ్ ఘాటక్ కాన్సెప్ట్స్ ఆఫ్ మోడ్రర్న్ ఫిజిక్స్ - ఆర్థూర్ బైసర్ వేవ్స్ అండ్ ఆసిల్లేషన్స్ - బజాజ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థియరీ - గ్రిఫిత్స్ మ్యాథమెటికల్ మెథడ్స్ ఇన్ ఫిజిక్స్ - బోస్ మ్యాథమెటిక్స్: మ్యాథమెటిక్స్‌లో.. రియల్ ఎనాలిసిస్, లీనియర్ అల్జీబ్రా, గ్రూప్ థియరీ, రింగ్ థియరీ, వెక్టర్ కాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి అధిక శాతం ప్రశ్నలు వస్తాయి. గ్రూప్ థియరీ, రింగ్ థియరీ, లీనియర్ ఆల్జీబ్రా విభాగాల్లోని మొత్తం సిలబస్ మీద దృష్టి సారించి ప్రిపేర్ కావాలి. ఇందులోని ప్రశ్నలు ఒకదానికొకటి ఇంటర్ లింక్డ్గా ఉంటాయి. వెక్టార్ కాలిక్యులస్.. డైవర్జెన్స్ థిరమ్, గ్రీన్స్ థిరమ్, స్ట్రోక్స్ థిరమ్ ఆధారంగా చేసుకుని అప్లికేషన్ పద్ధతిలో ప్రశ్నలు అడుగుతారు. రిఫరెన్స్ బుక్స్: రియల్ అనాలసిస్ - బార్టెల్ వెక్టార్ కాలిక్యులస్ - షహౌమ్ సిరీస్ లీనియర్ ఆల్జీబ్రా - వశిష్ట లీనియర్ ఆల్జీబ్రా - షహౌమ్ సిరీస్ మోడ్రన్ ఆల్జీబ్రా - వశిష్ట ఇంజనీరింగ్ మ్యాథ్స్ - క్రెయిజెగ్ ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్ - రాబర్ట్ జి.బార్టెల్