‘జామ్’ మాట బంగారు బాట.. | Students, post-graduation | Sakshi
Sakshi News home page

‘జామ్’ మాట బంగారు బాట..

Published Thu, Sep 4 2014 4:03 AM | Last Updated on Fri, May 25 2018 3:26 PM

‘జామ్’ మాట బంగారు బాట.. - Sakshi

‘జామ్’ మాట బంగారు బాట..

నచ్చిన సబ్జెక్టుపై పట్టు సాధించి, మెచ్చిన కెరీర్‌లో ఉన్నతంగా కుదురుకునే అవకాశాన్ని
 అందుకోవాలన్న ఉద్దేశంతో విద్యార్థులు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)కు దగ్గరవుతారు!
 అలాంటి పీజీని జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తింపు పొందిన ఐఐటీలలో చేసే అవకాశం
 వస్తే భవిష్యత్తు బంగారుమయమే! అలాంటి అద్భుత అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు
 జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ (జామ్) వీలు కల్పిస్తోంది. దీనిద్వారా పరిశోధనలకు
 పేరుగాంచిన ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలోనూ ప్రవేశించొచ్చు. జామ్-2015కు
 తాజాగా నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా స్పెషల్ ఫోకస్..
 

 జామ్-2015 నిర్వహణ సంస్థ: ఐఐటీ గౌహతి.
 ‘జామ్’తో ప్రవేశం లభించే కోర్సులు: ఐఐఎస్సీ: బయలాజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ.ఐఐటీ భువనేశ్వర్: కెమిస్ట్రీ; ఎర్త్ సైన్‌‌స; మ్యాథమెటిక్స్; ఫిజిక్స్; అట్మాస్ఫియర్, ఓషన్ సెన్సైస్‌లో జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ.ఐఐటీ బాంబే: అప్లైడ్ జియాలజీ, అప్లైడ్ జియోఫిజిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్-ఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో రెండేళ్ల ఎంఎస్సీ.నానో సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌తో ఎంఎస్సీ (ఫిజిక్స్)-ఎంటెక్ (మెటీరియల్ సైన్స్). ఇది నాలుగేళ్ల డ్యూయల్ డిగ్రీ కోర్సు.
 
 అప్లైడ్ జియాలజీ, అప్లైడ్ జియోఫిజిక్స్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ.ఐఐటీ ఢిల్లీ: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో రెండేళ్ల ఎంఎస్సీ. ఐఐటీ గాంధీనగర్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో రెండేళ్ల ంఎస్సీ.ఐఐటీ గౌహతి: కెమిస్ట్రీ; మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్; ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ హైదరాబాద్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ ఇండోర్: కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ. రెండో ఏడాది తర్వాత అర్హతను బట్టి ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌కు మారొచ్చు.
 
 ఐఐటీ కాన్పూర్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ; ఫిజిక్స్‌లో ఎంఎస్సీ-పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ.ఐఐటీ ఖరగ్‌పూర్: కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్,జియో ఫిజిక్స్‌లో జాయింట్ ఎంఎస్సీ-పీహెచ్‌డీ.ఐఐటీ మద్రాస్: కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ రూర్కీ: అప్లైడ్ జియాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ.ఐఐటీ రూపర్: మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ; కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఎంఎస్సీ-ఎంఎస్(రీసెర్చ్)/పీహెచ్‌డీ డ్యూయల్ డిగ్రీ.
 
 అర్హతలు:
 ఐఐఎస్సీ-బెంగళూరులో ప్రవేశాలకు జనరల్ కేటగిరీ, ఓబీసీ విద్యార్థులు సంబంధిత గ్రూపులో 60 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులు 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ. ఖరగ్‌పూర్, కాన్పూర్, బాంబే, ఢిల్లీ, మద్రాస్, రూర్కీ, హైదరాబాద్, భువనేశ్వర్, గాంధీనగర్, రూపర్ ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధిత సబ్జెక్టుల్లో జనరల్, ఓబీసీ విద్యార్థులు 55శాతం మార్కులు; ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ విద్యార్థులు 50శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ.
 
 పరీక్ష విధానం:

 జామ్-2015 పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. అభ్యర్థి ప్రవేశించాలనుకుంటున్న కోర్సు సబ్జెక్టును బట్టి పరీక్షకు (టెస్ట్ పేపర్)కు హాజరుకావాలి. ఏడు సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. అవి.. 1. బయలాజికల్ సెన్సైస్ (బీఎల్); 2. బయోటెక్నాలజీ (బీటీ); 3. కెమిస్ట్రీ (సీవై); 4. జియాలజీ (జీజీ); 5. మ్యాథమెటిక్స్ (ఎంఏ); 6. మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ (ఎంఎస్); 7. ఫిజిక్స్.
 
 ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు రకాల ప్రశ్నలుంటాయి. అవి.. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూ); మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు (ఎంఎస్‌క్యూ); న్యూమరికల్ సమాధాన ప్రశ్నలు (ఎన్‌ఏటీ). మూడు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. ఒక్కో పేపర్‌లో మొత్తం 60 ప్రశ్నలు ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. వీటికి 100 మార్కులు కేటాయించారు. సెక్షన్ ఏలో 1 మార్కు ప్రశ్నల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు, రెండు మార్కుల ప్రశ్నల్లో ప్రతి తప్పు సమాధానానికి 2/3 మార్కు కోత విధిస్తారు. సెక్షన్ బీ, సీల్లో నెగిటివ్ మార్కులుండవు.
 
  పేపర్ల వారీగా సిలబస్:
 బయలాజికల్ సెన్సైస్: జనరల్ బయాలజీ; బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్, మాలిక్యులర్ బయాలజీ ప్రాథమిక భావనలు; మైక్రో బయాలజీ, సెల్ బయాలజీ, ఇమ్యునాలజీ; మ్యాథమెటికల్ సెన్సైస్. బయో టెక్నాలజీ: ఇందులో బయాలజీకి 44 శాతం వెయిటేజీ, కెమిస్ట్రీకి 20 శాతం, మ్యాథమెటిక్స్‌కు 18 శాతం, ఫిజిక్స్‌కు 18 శాతం వెయిటేజీ ఉంటుంది. సిలబస్‌లో జనరల్ బయాలజీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ, బేసిక్ బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, సెల్ బయాలజీ, మైక్రో బయాలజీ; అటామిక్ స్ట్రక్చర్, సెట్స్-రిలేషన్స్, సర్కిల్స్, పెర్ముటేషన్స్- కాంబినేషన్స్, వర్క్-ఎనర్జీ-పవర్ తదితర అంశాలుంటాయి. కెమిస్ట్రీ: ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీలకు సంబంధించిన అంశాలుంటాయి. జియాలజీ: ది ప్లానెట్ ఎర్త్, జియో మార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, పేలియంటాలజీ, స్ట్రాటీగ్రఫీ, మినరాలజీ, పెట్రాలజీ, ఎకనమిక్ జియాలజీ, అప్లైడ్ జియాలజీలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి.
 
 మ్యాథమెటిక్స్:
 సీక్వెన్సెస్, సిరీస్ ఆఫ్ రియల్ నంబర్స్; ఫంక్షన్స్; ఇంటిగ్రెల్ కాలిక్యులస్; డిఫరెన్షియల్ ఈక్వేషన్స్; వెక్టార్ కాలిక్యులస్; గ్రూప్ థియరీ; లీనియర్ ఆల్జీబ్రా; రియల్ అనాలిసిస్.
 
 మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్:

 మ్యాథమెటిక్స్‌కు సంబంధించి సీక్వెన్సెస్-సిరీస్; డిఫరెన్షియల్ కాలిక్యులస్; ఇంటిగ్రెల్ కాలిక్యులస్; మ్యాట్రిసెస్; డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. స్టాటిస్టిక్స్‌కు సంబంధించి ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్స్, ఎస్టిమేషన్ తదితర అంశాలుంటాయి.
 
 ఫిజిక్స్:
 మ్యాథమెటికల్ మెథడ్స్; మెకానిక్స్ అండ్ జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్; ఆసిలేషన్స్, వేవ్స్, ఆప్టిక్స్; ఎలక్ట్రిసిటీ-మ్యాగ్నటిజం; థర్మోడైనమిక్స్; మోడర్న్ ఫిజిక్స్.
 
 ప్రిపరేషన్
 టిప్స్:
 ఐఐటీ-జామ్‌లో ప్రశ్నలు అభ్యర్థిలోని నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఉంటాయి. అధిక శాతం ప్రశ్నలు కాన్సెప్ట్, అనాలిసిస్ ఆధారంగా ఇస్తారు. ప్రశ్నపత్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో రూపొందిస్తారు. ప్రతిసారి జామ్‌లో ప్రశ్నలు అడిగే విధానం మారుతుంటుంది. కాబట్టి ఏ ఒక్క చాప్టర్‌ను విస్మరించకుండా ప్రిపరేషన్ సాగించాలి.సబ్జెక్టు ఏదైనా మూలాలు, ప్రాథమిక భావనల నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ముందుకు సాగాలి. కాన్సెప్టు ఆధారిత సమస్యలపై దృష్టిసారించాలి.ప్రిపరేషన్ పూర్తయ్యాక చాప్టర్ల వారీగా నమూనా పరీక్షలు రాయాలి. దీని ఆధారంగా ప్రిపరేషన్‌లో లోటుపాట్లను గుర్తించి, సరిదిద్దుకోవాలి.ప్రిపరేషన్‌కు ప్రామాణిక పుస్తకాలను ఉపయోగించుకోవాలి. ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడం కూడా ఉపకరిస్తుంది. బీఎస్సీ విద్యార్థులకు ప్రిపరేషన్ కోసం 6 నుంచి 8 నెలల సమయం కావాలి. కాబట్టి బీఎస్సీ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత.. మిగిలిన రెండేళ్ల కాలంలో ప్రిపరేషన్ ప్రారంభించడం మంచిది.
 
 సిలబస్ సమగ్ర పరిశీలన ప్రధానం
 ఐఐటీలలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశానికి నిర్వహిస్తున్న జామ్ విషయంలో నిర్వాహక ఐఐటీ.. నిర్దిష్ట సిలబస్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఔత్సాహిక అభ్యర్థులు దీన్ని సమగ్రంగా పరిశీలించి ఆయా అంశాలపైనే పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. సిలబస్ పరిధిని దాటి ప్రశ్నలు అడగటం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కానీ ప్రశ్నల క్లిష్టత స్థాయిలో తేడాలుంటాయి. అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ప్రాధాన్యమిచ్చేలా ప్రిపరేషన్ సాగించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించడం ద్వారా ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీపై అవగాహన ఏర్పరుచుకోవచ్చు. పరీక్షలో స్కోర్ ఆధారంగా ఎంపిక చేసుకునే కోర్సు, ఇన్‌స్టిట్యూట్ విషయంలో ముందునుంచే స్పష్టత ఉండాలి. కొన్ని ఐఐటీలు ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ (ఎమ్మెస్సీ+పీహెచ్‌డీ) కోర్సులను అందిస్తున్నాయి. ఇవి పరిశోధనలపై ఆసక్తిగలవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఐఐటీ హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ కోర్సులే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతమున్న సమయంలో సిలబస్‌లోని అన్ని అంశాలను పూర్తి చేసుకునేలా అభ్యర్థులు తమ వ్యక్తిగత నైపుణ్యాల ఆధారంగా టైం మేనేజ్‌మెంట్ పాటిస్తే జామ్‌లో సత్ఫలితాలు ఆశించొచ్చు.
 - ప్రొఫెసర్ ఫయజ్ అహ్మద్ ఖాన్;
 డీన్, అకడెమిక్ ప్రోగ్రామ్స్,
 ఐఐటీ-హైదరాబాద్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement