న్యూజిలాండ్‌లో పీజీ చేయాలంటే ? | New Zealand PG Courses offered Institutes | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌లో పీజీ చేయాలంటే ?

Published Thu, Jun 5 2014 12:16 AM | Last Updated on Fri, May 25 2018 3:26 PM

న్యూజిలాండ్‌లో పీజీ చేయాలంటే ? - Sakshi

న్యూజిలాండ్‌లో పీజీ చేయాలంటే ?

 పోస్ట్‌గ్రాడ్యుయేషన్ స్థాయిలో వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
 -విజయ్, నల్గొండ.
 వీఎల్‌ఎస్‌ఐ కోర్సులను పూర్తి చేసిన వారికి ప్రాథమికంగా రెండు రకాల కెరీర్‌లు ఉంటాయి. అవి..చిప్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ అండ్ టూల్ డెవలప్‌మెంట్. ఎలక్ట్రానిక్/హార్డ్‌వేర్ పరిశ్రమ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో వీఎల్‌ఎస్‌ఐ కోర్సు పూర్తి చేసిన చక్కని డిమాండ్ ఉంటుంది. ఆయా పరిశ్రమల్లో డిజైన్ ఇంజనీర్, ప్రొడక్ట్ ఇంజనీర్, టెస్ట్ ఇంజనీర్, అప్లికేషన్స్/సిస్టమ్స్ ఇంజనీర్ వంటి హోదాల్లో స్థిరపడొచ్చు. విప్రో, ఫిలిప్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇంటెల్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి టాప్ రిక్రూటర్స్.
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:


     జేఎన్‌టీయూ-హైదరాబాద్
     వెబ్‌సైట్: www.jntuh.ac.in
     ఐఐఐటీ-హైదరాబాద్; వెబ్‌సైట్: www.iiit.ac.in
     మణిపాల్ యూనివర్సిటీ-మణిపాల్ (కర్ణాటక)
     వెబ్‌సైట్: www.manipal.edu
 
 బీటెక్ (ఇంజనీరింగ్ ఫిజిక్స్) కోర్సును అందిస్తున్న ఐఐటీలేవి?-కరణ్, కరీంనగర్. ప్రస్తుతం మనం చూస్తున్న సాంకేతిక అభివృద్ధి వెనక ఫిజిక్స్ పాత్రను బీటెక్ (ఇంజనీరింగ్ ఫిజిక్స్) క్షుణ్నంగా వివరిస్తుంది. ఫిజిక్స్‌కు సంబంధించి ఏదో ఒక విభాగానికి ఈ కోర్సు పరిమితం కాదు. ఒక ప్రత్యేక బ్రాంచ్‌కు చెందిన ఫిజిక్స్ అనువర్తనాలను వివరిస్తుంది. ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్‌తోపాటు అవసరమైన ఫిజిక్స్, అప్లయిడ్ ఫిజిక్స్ అంశాల కలయికగా ఈ కోర్సును రూపొందించారు. ఇందులో ఫిజికల్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఆఫ్ మెటీరియల్స్, కంప్యూటర్ సైన్స్, మ్యానుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్, గ్రాఫిక్ సైన్స్, ఎలక్ట్రోమాగ్నటిక్స్, ఆప్టిక్స్, మెటీరియల్ సెంథిసిస్ వంటి అంశాలను బోధిస్తారు. అంతేకాకుండా అధునిక పరికరాలకు సంబంధించిన ప్రయోగాత్మక పరీక్షలపై కూడా అవగాహన కల్పించే విధంగా సిలబస్ ఉంటుంది.

 అందిస్తున్న ఐఐటీలు:
     ఐఐటీ-ఢిల్లీ; వెబ్‌సైట్: http://physics.iitd.ac.in
     ఐఐటీ-బాంబే; వెబ్‌సైట్: www.phy.iitb.ac.in
     ఐఐటీ-మద్రాస్;వెబ్‌సైట్:www.physics.iitm.ac.in
  హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
 -ప్రణవ్, జహీరాబాద్.

 మన దగ్గర డాక్టర్లు.. అడ్మినిస్ట్రేటివ్ సంబంధిత బాధ్యతల్లో నిమగ్నమై ఉండడంతో.. రోగులకు విలువైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అంతేకాకుండా మ్యాన్ పవర్, మెటీరియల్, మనీ వంటి అంశాలను నిర్వహించడంలో డాక్టర్లు ఎటువంటి ప్రొఫెషనల్ శిక్షణ తీసుకొని ఉండరు. ఈ నేపథ్యంలో హాస్పిటల్ నిర్వహణలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థుల అవసరం పెరుగుతోంది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్, క్లినిక్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, మెడికల్ కాలేజ్‌లు, నర్సింగ్ హోమ్స్, ఫార్మాస్యూటికల్- హాస్పిటల్ సప్లై ఫర్మ్స్‌లలో అవకాశాలు ఉంటాయి. వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలు కూడా ఎంబీఏ-హెల్త్ కేర్/హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అన్ని హాస్పిటల్స్‌లోని ప్రతి విభాగం కంప్యూటరీకరణ చేయడంతో.. సంబంధిత సాఫ్ట్‌వేర్ రూపొందించడం కోసం హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ అభ్యర్థులను ఐటీ కంపెనీలు నియమించుకుంటున్నాయి.
 
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు
 అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-హైదరాబాద్
 వెబ్‌సైట్: www.apolloiha.ac.in
 నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్-
 హైదరాబాద్

     వెబ్‌సైట్: http://nims.ap.nic.in
     ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రెజ్-హైదరాబాద్
     వెబ్‌సైట్: www.ipeindia.org
     దక్కన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్-హైదరాబాద్
     వెబ్‌సైట్: www.dshm.co.in
     యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
     వెబ్‌సైట్: www.uohyd.ac.in
 
 బీటెక్ పూర్తి చేశాను. న్యూజిలాండ్‌లో పీజీ చేయాలనుకుంటున్నాను. సంబంధిత వివరాలు తెలపండి?
 -వేణు, జగిత్యాల.న్యూజిలాండ్ విద్యా వ్యవస్థకు బ్రిటిష్ విద్యా వ్యవస్థ ఆధారం. ఇతర దేశాలతో పోల్చితే న్యూజిలాండ్‌లో విద్యనభ్యసించే వారికి చక్కటి సదుపాయాలు లభిస్తాయి. కోర్సు పూర్తి చేసిన తర్వాత శాశ్వత నివాస సౌకర్యాన్ని పొందొచ్చు. కోర్సు చదువుతున్న సమయంలో పెయిడ్ ఇంటర్న్‌షిప్స్‌తోపాటు నాలుగు నుంచి ఆరు వారాలపాటు వర్క్ పర్మిట్‌ను కూడా లభిస్తుంది. అంతేకాకుండా కోర్సు పూర్తై ఏడాదిపాటు జాబ్ సెర్చ్ వీసా సౌకర్యాన్ని కూడా న్యూజిలాండ్ అందజేస్త్తుంది. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీలు మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో పీజీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. మన దేశంలోని బీఏ/బీకామ్/బీఎస్సీ ఈ డిగ్రీల కొవలకే వస్తాయి.
 
 కొన్ని యూనివర్సిటీలు 16 ఏళ్ల ఫార్మల్ ఎడ్యుకేషన్‌ను అర్హతగా పేర్కొంటున్నాయి. అంటే బీఈ/బీటెక్ వంటివి. ఇక్కడ విద్యనభ్యసించా లనుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఐఈఎల్‌టీఎస్ (ఐఉఔఖీ) పరీక్షకు హాజరుకావాలి. ఇందులో కనీసం 6.5 స్కోర్ సాధించాలి. టోఫెల్ స్కోర్‌ను కూడా కొన్ని యూనివర్సిటీలు పరిగణనలోకి తీసుకుంటాయి. చదవాలనుకుంటున్న యూనివర్సిటీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిషన్ ఖరారయ్యాక వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. కోర్సు వ్యవధి 12 వారాల కంటే తక్కువగా ఉంటే విజటర్ వీసా సరిపోతుంది. ఎక్కువగా ఉంటే మాత్రం స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.
 వివరాలకు:    www.immigration.govt.nz,
     www.studyinnewzealand.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement