1996లో తయారు చేసిన జామ్‌! ఇప్పటికీ టేస్ట్‌.. | Woman Tries Homemade Jam Made By Her Grandmother In 1996, Her Reaction Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Viral Video: 1996లో తయారు చేసిన జామ్‌! ఇప్పటికీ టేస్ట్‌..

Published Sat, Jan 20 2024 7:30 AM | Last Updated on Sat, Jan 20 2024 10:36 AM

Woman Tries Jam Made In 1996 By Her Grandmother - Sakshi

నిజానికి నిర్దేశిత ఏళ్లు లేదా రోజులు మాత్రమే కొన్ని రకాలైన ఆహార పదార్థాలను ప్రిజర్వ్‌ చేయగలం. అంతకు మించి నిల్వ చేస్తే టేస్ట్‌లో తేడా వస్తుంది. రుచి కూడా పాడవ్వుతుంది. కానీ ఇక్కడో బామ్మ 1996లో తయారు చేసిన జామ్‌ ఎలా ఉందో వింటే షాకవ్వుతారు. అయితే ఇప్పుడు దాని టేస్ట్‌ ఎలా ఉందంటే..!

ఒక కంటెంట్‌ క్రియేటర్‌ ఇటీవల తన అమ్మమ్మ తాతయ్యలు ఉండే ఇంటికి వెళ్లింది. అక్కడ తన అమ్మమ్మల కాలం నాటి వస్తువులను గమనిస్తోంది. అక్కడ తన అమ్మమ్మ ఇంటిలో జాగ్రత్తగా భద్రపర్చిన  కొన్ని రకాల జామ్‌ బాటిళ్లను చూసింది. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ టేస్ట్‌ చేసే యత్నం చేయలేదు. ఎందుకో అనకోకుండా ఒక రోజు  ఆ జామ్‌ డబ్బాలను పరిశీలనగా చూస్తూ..1996లో తయారయ్యిన జామ్‌ డబ్బాను తీసుకుంది. దాన్ని ఓపెన్‌ చేసి ఎలాగైన టేస్ట్‌ చెయ్యాలనుకుంది. అయితే ఇంట్లో వాళ్లంతా వద్దు వద్దు అని వారించారు.

అయితే అవేమీ పట్టించకోకుండా తన అమ్మమ్మ చేత్తో తయారయ్యిన జామ్‌ని టేస్ట్‌ చేయాల్సిందే అని చూడగా..ఒక్కసారిగా ఆమె ముఖంలో ఓ అద్భుతమైన రియాక్షన్‌ వచ్చింది. ఆమె ఆ జామ్‌ రుచికి ఫిదా అయ్యిపోయింది.  అస్సలు పాడవ్వకుండా మరింత రుచివ్వెలా ఉంది ఈ జామ్‌ అని షాకయ్యింది. పైగా ఆమె ఎంతో సంబరపడి తన సోదరులను కూడా రుచి చూడమని చెబుతుంది. వారంతా రుచి చూసి ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది.

దీంతో నెటిజన్లు ఆ టైంలోని వైరస్‌ మీ శరీరంలో దాగుండి అటాక్‌ చేస్తుందంటూ కామెంట్లు చూశారు. కట్‌ చేస్తే.. మూడు రోజుల తర్వాత ఆమె నేను బాగానే ఉన్నా బతికే ఉన్నా అంటూ పోస్ట్‌లు పెట్టింది. అంతేగాదు ఆకాలం వారికి నిల్వ చేయడం సవాలుగా ఉండేది. అందువల్ల ఒక వస్తువుని ఆరోగ్యకరమైన విధంగా నిల్వం చేయడం ఎలా అనేది వారికి బాగా తెలుసు. ఈ చక్కెర కూడా పదార్థాల రుచి పోకుండా కాపాడుతుందని అన్నారు. తన అమ్మమ్మ సుదీర్థకాలం జామ్‌ రుచి పాడవ్వకుండా ఉండేలా కొన్ని  టెక్నిక్స్‌ కూడా తనకు నేర్పిందంటూ అమ్మమ్మతో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. 

(చదవండి: కృష్ణఫలం గురించి విన్నారా? తింటే బొలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement