
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ- రేసింగ్ వద్ద గందరగోళం నెలకొంది. రేసింగ్ ట్రాక్‌పైకి ఒక్కసారిగా ప్రైవేట్ వాహనాలు దూసుకురావడంతో ప్రాక్టీస్ రేస్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఫార్ములా-ఈరేస్ కారణంగా తెలుగుతల్లి ఫైఓవర్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గంగలు గంటలు ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు అసహనంతో ట్రాక్‌పైకి వచ్చారు. దీంతో ట్రాక్‌పైకి వాహనాలు ఎలా వచ్చాయని నిర్వాహకులు షాక్‌కు గురయ్యారు.
ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు.. మరోవైపు ఈ-ఫార్ములా రేసుతో హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. రేస్ కారణంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్, లక్డీకాపూల్, అసెంబ్లీ, ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రేసింగ్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేసులు ముఖ్యమా? తాము ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం
మరోవైపు ఫార్ములా ఈ రేసింగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. మలుపు వద్ద కారు గోడను ఢీకొట్టింది. క్రేన్ సాయంతో ట్రాక్‌పై నుంచి కారును తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment