కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. | Krishna: Road Accident At Machilipatnam Vijayawada Highway | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Published Sat, Mar 12 2022 7:54 PM | Last Updated on Sun, Mar 13 2022 8:31 AM

Krishna: Road Accident At Machilipatnam Vijayawada Highway - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నం, విజయవాడ జాతీయ రహదారిపై గూడూరు మండలం పర్ణశాల గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళుతున్న ఆటోను వెనుక నుండి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 14 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఆరుగురిని ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రులంతా మచిలీపట్నం గిలకలదిండి ప్రాంతానికి చెందిన మహిళలుగా గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకున్న వైసీపీ యువ నాయకుడు, మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కిట్టు ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై వాకబు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న గూడూరు ఎస్సై మదినా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement