
తిరుమల ఘాట్ రోడ్డులో కారు దగ్ధం
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఓ కారు అగ్నికి ఆహుతైంది. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనతో దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
తమిళనాడుకు చెందినదిగా భావిస్తోన్న కారులో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ అప్రమత్తతతో కారులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడగటిగారు.