ఐపీఎస్ అధికారి, డీసీపీ రాహుల్ హెగ్డే, రామబాణం హీరోయిన్ డింపుల్ హయాతి మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. డీసీపీ కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంజికారుతో రివర్స్‌లో వచ్చి ఢీకొట్టి దుర్భాషలాడిందంటూ నటిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే తాజాగా ఈ కోర్టుపై డింపుల్ హయాతి హైకోర్టును ఆశ్రయించింది.
(ఇది చదవండి: ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి..కేసు నమోదు..)
తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో డింపుల్ హయాతి పిటిషన్ దాఖలు చేసింది. ట్రాఫిక్ డీసీపీ ఒత్తిడితోనే తప్పుడు కేసు పెట్టారని పిటిషన్‌లో పేర్కొంది. అయితే డింపుల్ హయాతికి సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు.
అయితే వాదనలు విన్న న్యాయస్థానం.. సీఆర్‌పీసీ 41ఏ నిబంధనల మేరకే వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. కాగా.. ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై డింపుల్ హయాతి దాడి చేశారన్న ఆరోపణలతో ఆయన డ్రైవర్ చేతన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతి, డేవిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
(ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!)
Comments
Please login to add a commentAdd a comment