గిరిజన యువకులు అన్ని రంగాల్లో రాణించాలి | Tribal young people need to use ITDA welfare schemes. | Sakshi
Sakshi News home page

గిరిజన యువకులు అన్ని రంగాల్లో రాణించాలి

Published Sat, Jun 10 2017 4:21 AM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

గిరిజన యువకులు అన్ని రంగాల్లో రాణించాలి

గిరిజన యువకులు అన్ని రంగాల్లో రాణించాలి

ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు, ఏఎస్పీ రాహుల్‌ హెగ్డే
ఎస్‌ఎస్‌తాడ్వాయి(ములుగు): గిరిజన యువకులు అన్ని రంగాల్లో  రాణించాలని ఐటీడీఏ పీఓ చక్రధర్‌రావు అన్నారు. భూమి పండుగను పురస్కరించుకుని కామారంలో బిర్సాముండా యూత్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి గ్రామీణ వాలీబాల్‌ క్రీడత్సోవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్‌ హెగ్డేతో కలిసి వచ్చిన పీఓ మొక్కలు నాటడంతో పాటు బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం పీఓ  మాట్లాడుతూ ఐటీడీఏ సంక్షేమ పథకాలను గిరిజన యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. పోలీస్‌ కానిస్టేబుల్, ఆర్మీ రిక్రూట్‌మెంట్, డ్రైవింగ్‌పై గిరిజన యువకులకు  ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు  తెలిపారు. విజేతలైన క్రీడాకారులకు అం దించే కంపు, మెడల్స్‌కు అయ్యే ఖర్చులను  చెల్లించనున్నట్లు పీఓ ప్రకటించారు. ఏఎస్పీ రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ యు వకులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకున్నపుడే విజయం సాధిస్తారన్నారు. 

గిరిజన యువత క్రీడల్లో తమ శక్తిని  ఉపయోగించి విజయం సాధించాలన్నారు. ఈ సందర్భంగా పీఓ, ఏఎస్పీ వాలీబాల్‌ షో మ్యాచ్‌ అడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో మేడారం జాతర మాజీ చైర్మన్‌ రేగ నర్సయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భర్తపురం నరేష్, కొర్నెబెల్లి నరేందర్, బిర్సాముండా యూత్‌ అధ్యక్షుడు చోక్కరావు, చర్ప రవి, నారాయణ, ధనసరి లలిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement